హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: ఉత్తరాంధ్ర టూర్‌లో పవన్‌ కల్యాణ్ సంచలన ప్రకటన .. అధికారంలోకి రాగానే ఏం చేస్తామన్నారంటే

Pawan Kalyan: ఉత్తరాంధ్ర టూర్‌లో పవన్‌ కల్యాణ్ సంచలన ప్రకటన .. అధికారంలోకి రాగానే ఏం చేస్తామన్నారంటే

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Pawan Kalyan: తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో ఉచితంగా ఇసుకను అందజేస్తామని హామీ ఇచ్చారు. గుంకలాంలో జగనన్న ఇళ్లు లబ్ధిదారులతో మాట్లాడిన పవన్ కల్యాణ్ వైసీపీ సర్కారు గొడవలు తప్ప ప్రజల సమస్యలు, రాష్ట్రాభివృద్దిపై దృష్టి పెట్టడం లేదని కామెంట్ చేశారు. ఇంకా ఏమన్నారంటే

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vizianagaram, India

ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏమాత్రం కనిపించడం లేదన్న జనసేనాని.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతరాహిత్యమే అందుకు కారణమని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో ఉచితంగా ఇసుక(Free sand)ను అందజేస్తామని హామీ ఇచ్చారు. గుంకలాం(Gunkalam)లో జగనన్న ఇళ్లు లబ్ధిదారులతో మాట్లాడిన పవన్ కల్యాణ్ వైసీపీ(YCP) సర్కారు గొడవలు తప్ప ప్రజల సమస్యలు, రాష్ట్రాభివృద్దిపై దృష్టి పెట్టడం లేదని కామెంట్ చేశారు. గత రెండ్రోజులుగా ఉత్తరాంద్రలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్‌ పర్యటనకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. దారి పొడవున గజమాలలు వేసి తమ అభిమానాన్ని చూపిస్తున్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోడీ పక్కకు పెట్టారు..మంత్రి రోజా సంచలన కామెంట్స్

ఉచిత ఇసుక ఇస్తానని హమీ ..

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం జిల్లాలోని గుంకలాంలో ప్రభుత్వ నిర్మిస్తున్న జగనన్న కాలనీని పరిశీలించారు జనసేనాని. వైసీప ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజల్ని రాజధాని పేరుతో మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేనని నమ్మాలన్న పవర్ స్టార్ ..వైసీపీ ప్రభుత్వం మోసాల్ని గ్రహించాలని సూచించారు. జిల్లా పర్యటనలో గుంకలాంలో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన పవన్ కల్యాణ్ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగిస్తామని మాటిచ్చారు. అంతే కాదు రాష్ట్రంలో గృహనిర్మాణాలకు ఉచితంగా ఇసుకను అందజేస్తామని సంచలన ప్రకటన చేశారు పవన్‌కల్యాణ్.

మీ వెంట నేనుంటా ..

ఉత్తరాంధ్ర ప్రజలకు బలమైన రాజ్యాధికారం దక్కాలని అభిప్రాయపడ్డారు. తనను నమ్మి జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు జనసేనాని. మీ భవిష్యత్తు కోసం తనను నమ్మితే గుండాలతో పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. రాష్ట్రంలో యువత తమ శక్తిని అవినీతి నిర్మూలన కోసం ఉపయోగించాలని కోరారు. ఉత్తరాంధ్రలోని మత్స్యకారులు ఉపాధి కోసం గోవా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని ..తాము అధికారంలోకి రాగానే ఇక్కడే జెట్టీలు నిర్మించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని..మత్స్యకారులకు హాని కలిగే ఏ పని చేయబోమన్నారు. చివరగా ఉత్తరాంధ్ర ప్రజలు అవినీతిపై రాజీలేని పోరాటం చేయాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని జనసైనికులు ధైర్యంగా పోరాడాలని కేసులు పెడితే మీ వెంట మేముంటామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.

First published:

Tags: Andhra pradesh news, Pawan kalyan, Vizianagaram

ఉత్తమ కథలు