హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Manifesto: జనసేన ఎన్నికల మేనిఫెస్టో ఇదే..! వారి ఖాతాల్లో రూ.10 లక్షలు.. పవన్ షణ్ముఖ వ్యూహం..

Pawan Manifesto: జనసేన ఎన్నికల మేనిఫెస్టో ఇదే..! వారి ఖాతాల్లో రూ.10 లక్షలు.. పవన్ షణ్ముఖ వ్యూహం..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సరికొత్త సుపరిపాలన ఇచ్చే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) అన్నారు. 2024లో జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన యాక్షన్ ప్లాన్ (Janasena Manifiesto) ప్రకటించారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సరికొత్త సుపరిపాలన ఇచ్చే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) అన్నారు. 2024లో జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన యాక్షన్ ప్లాన్ (Janasena Manifiesto) ప్రకటించారు. షణ్ముక వ్యూహంతో ముందుకెళ్తామని జనసేనాని తెలిపారు. అంతేకాదు పార్టీ మేనిఫెస్టోని కూడా ప్రకటించారు. జనసేన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు ఇవేనంటూ కొన్ని అంశాలను ప్రకటించారు. అప్పుల్లేనే ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి మెరుగైన పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామన్నారు. ఫ్రెండీ ఇన్వెస్టిమెంట్ సిస్టమ్ ను అమలు చేస్తామని తెలిపారు. ఇక విశ్వనగరంగా విశాఖపట్నం, హైటెక్ సిటీలుగా విజయవాడ, తిరుపతి అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిగా ఉంటుందని.., అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉండేలా అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు.

  ఇక రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ఆయన.. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా కర్నూలును ప్రకటిస్తామని తెలిపారు. తెల్లరేషన్ కార్డులు ఉన్నవారికి వారికి ఫ్రీ ఇసుక.. అదనంగా గదులు నిర్మించినా ఫ్రీ ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. ఇక యువతకు సులభ్ కాంప్లెక్స్ ఉద్యోగాలు కాకుండా.. స్వయం ఉపాధి ఏర్పాట్లు చేస్తామన్నారు. వారి ఉపాధి కోసం అర్హులైన వారికి రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించారు.

  వ్యవసాయరంగాన్ని లాభసాటిగా చేయడం కోసం మార్కెటింగ్ సౌకర్యాలు, ఫుడ్ పార్కుల ఏర్పాటు చేస్తామన్నారు. మన ఏపీ మన ఉద్యోగాలే నినాదమన్న పవన్.., జనసేన అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. అలాగే ఏడాదికి 5లక్షల ఉద్యోగాలు ఇచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ.. సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. సీపీఎస్ పై అధ్యయనం చేసిన తర్వాతే హామీ ఇస్తున్నన్నారు.

  వైసీపీ నాయకుల కొమ్ములు విరిచి.. వచ్చే ఎన్నికల్లో గెలిచి విజయం సాధించి తీరుతామన్నారు. ఇదే తనసేన ఆవిర్భావ దినోత్సవం యొక్క లక్ష్యం ఉద్దేశమన్నారు. బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నామని.. వారు రోడ్ మ్యాప్ ఇస్తే వైసీపీని గద్దెదించేందుకు ముందుకెళ్తామన్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రసక్తే లేదన్న పవన్.. వ్యక్తిగత లాభాల గురించి పట్టించుకోమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు చర్చకు వచ్చినప్పుడే పొత్తుల గురించి ఆలోచిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఐదేళ్ల అధికారం కోసం తాను ఆలోచించడం లేదని జనసేనాని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతను పవన్ కల్యాణ్ తీసుకుంటున్నారంటూ ప్రకటించారు. “ వైసీపీది విధ్వంసం.. జనసేనది వికాసం.. వారిది ఆధిపత్యం... మనది ఆత్మగౌరవం.. అది అహంకారానికి అడ్డా.. ఇది జనసైనికుల గడ్డ..” అంటూ పవన్ ప్రసంగం ముగించారు.

  First published:

  Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan

  ఉత్తమ కథలు