హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: సీఎం కాన్వాయ్ కు సర్కార్ వాహనాల్లేవా? సస్పెండ్ తో సరిపోతుందా? ప్రభుత్వంపై విపక్షాల ఫైర్

Pawan Kalyan: సీఎం కాన్వాయ్ కు సర్కార్ వాహనాల్లేవా? సస్పెండ్ తో సరిపోతుందా? ప్రభుత్వంపై విపక్షాల ఫైర్

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ (ఫైల్)

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ (ఫైల్)

Pawan Kalyan: సీఎం కాన్వాయ్ కు వాహనాల్లేవా..? నడిరోడ్డుపై ప్రయాణికులను దింపేసి వాహనాలు స్వాధీనం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.? ఒక వాహనం ఏర్పాటు చేసుకునే స్థోమత కూడా ప్రభుత్వానికి లేదా..? ఇక రోడ్డుపై వెళ్లాలి అంటే సామాన్యులు భయపడే పరిస్థితి వస్తుందని విపక్షాలు మండిపడుతున్నాయి.

ఇంకా చదవండి ...

  Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని సీఎం జగన్ (CM Jagan) కాన్వాయ్ వివాదంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. సీఎం పర్యటనకు వస్తున్నారనంటే.. వైన్ షాపుల తప్ప అన్ని షాపులకు సెలవులు ప్రకటిస్తారని.. ఇప్పుడు మరో లెవెల్ కు పరిస్థితి వెళ్లిందని.. సీఎం పర్యటన పేరుతో సామన్యుల వాహనాలు తీసుకునే హక్కు ఎవరిచ్చారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సాధారణంగా సీఎం పర్యటన ఉన్నప్పుడు.. స్థానికంగా ప్రభుత్వ వాహనాలు లేకపోతే.. ట్రావెల్స్ వారి దగ్గర అద్దెకు తీసుకుంటారని విన్నాం కానీ.. సామాన్య ప్రజల వాహనాలను బలవంతంగా లాక్కోవడం ఏంటి..? ఇదేమైనా నియంత పాలనా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా జగన్ పర్యటన ఉందని ప్రకాశం జిల్లా (Prakasham District) ఒంగోలులో సీఎం కాన్వాయ్ లో వాహనాలు లేక తిరుమలకు వెళ్తున్న ఓ కుటుంబం నుంచి ఇన్నోవా కారు లాక్కున్న ఘటనపై విమర్శలు వెల్లువ ఆగడం లేదు. అయితే ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన సీఎంవో స్ధానిక ఆర్టీఏ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. అయినా దీనిపై రాజకీయ దుమారం ఆగడం లేదు.

  తాజాగా ఒంగోలు  (Ongle)  ఘటనపై జనసేన (Janasean) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రభుత్వానికి ప్రశ్నలు వేసారు. ఒంగోలు పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా అని పవన్ ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడితో ప్రయాణికులను దింపి మరీ వాహనం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణీకులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకొనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. అధికారులు ఇప్పటికే సామాన్యులను పలు రీతిల్లో ఇబ్బంది పెడుతున్నారని.. పన్నుల పేరుతో ప్రభుత్వం దోపీడీ చేస్తోందని.. అన్ని ధరలు పెంచి బాదుడుతో ఇబ్బంది పెడుతున్నారని.. అవి చాలవని బలవంతంగా వాహనాలు లాక్కోవడం ఏంటని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

  ఇదీ చదవండి : మళ్లీ టీడీపీ ప్రతిపక్షంలోనే.. సీనియర్ నేతలకు చంద్రబాబు క్లాస్.. సీట్లపై క్లారిటీ

  వేమల శ్రీనివాస్ గారి కుటుంబం తిరుమల వెళ్తుంటే రవాణా శాఖ అధికారులు బలవంతంగా వారి వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం విస్మయానికి గురి చేసిందన్నారు పవన్. సీఎం కాన్వాయ్ కోసం ప్రయాణీకులను నడిరోడ్డున దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకోవల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. 2.56 లక్షల కోట్ల బడ్జెట్ కలిగి, 7.77లక్షల కోట్లు అప్పు తెచ్చుకొన్న సామర్థ్యం కలిగిన ప్రభుత్వం.. సీఎం పర్యటనకు ప్రైవేటు వ్యక్తుల వాహనం తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ఒంగోలు ఘటనలో ఒక సహాయ అధికారిని, ఒక హోమ్ గార్డుని సస్పెండ్ చేసేసి విషయాన్ని మరుగునపెట్టేద్దామని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉందని పవన్ ఆరోపించారు. ట్రావెల్ ఆపరేటర్స్ నుంచి అద్దెకు తీసుకోకుండా ప్రయాణీకులను నడిరోడ్డుపై వదిలి వాహనాన్ని తీసుకోవాల్సిన ఒత్తిడితో కూడిన పరిస్థితి ఆ ఉద్యోగులకు ఎందుకు కలిగిందో విచారించాలన్నారు. సదరు ఉద్యోగులపై ఆ స్థాయి ఒత్తిడిని రాజకీయ నాయకులు తీసుకువచ్చారా ఉన్నతాధికారులు తీసుకువచ్చారా అనేది ముఖ్యమన్నారు.

  ఇదీ చదవండి : లోకేష్ తో వైసీపీ నేత భేటీ నిజమేనా? రాష్ట్ర స్దాయి సమీక్షకు బైరెడ్డి డుమ్మా?

  వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే చాలా కోపం వస్తోంది…అయినా.. సభ్యత అడ్డం వచ్చి సంయమనం పాటిస్తున్నామన్నారు. ఎవరైనా అమ్మాయి కావాలని కోరుకుంటే ఇళ్లల్లో వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా..? అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆస్తులకు.. మహిళల శీలాలకు వైసీపీ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. రాజకీయాల్లో వైసీపీ ఉండదగ్గ పార్టీ కాదని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు సైతం ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే చాలా కోపం వస్తోంది…అయినా.. సభ్యత అడ్డం వచ్చి సంయమనం పాటిస్తున్నట్లు తెలిపారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Powe star pawan kalyan, Tirupati

  ఉత్తమ కథలు