హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: భగవంతుడి ఆశీస్సులు చంద్రబాబుకి ఉండాలి అంటూ పవన్ విషెస్.. మొదలైన ట్రోల్స్

Pawan Kalyan: భగవంతుడి ఆశీస్సులు చంద్రబాబుకి ఉండాలి అంటూ పవన్ విషెస్.. మొదలైన ట్రోల్స్

చంద్రబాబుకు పవన్ శుభాకాంక్షలు

చంద్రబాబుకు పవన్ శుభాకాంక్షలు

Pawan Wish to Chandrababu: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుకుడు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్.. అయితే ఆయన విషెస్ చెప్పడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. దీనికి జనసేన అభిమానులు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు.

ఇంకా చదవండి ...

  Pawan kalyan Wishes to Chandrababu Brithday: తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు నేడు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు

  స్వీకరించిన ఆయన.. ఉమ్మడి ఏపీలో తెలుగు దేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో కీలకంగా

  వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు.. ఢిల్లీ రాజకీయాల్లోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. విభజన తర్వాత

  నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పలు సవాళ్ళను ఎదుర్కొన్న ఆయన.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవడంతో

  ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. నేడు 73వ ఏట అడుగుపెట్టనున్న సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు..

  రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.  మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు..

  చంద్రబాబు కు భగవంతుడు ఆశీస్సులు అందించి, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే వచ్చే

  ఎన్నికల్లో టీడీపీ -జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం ఉంది. దీనిపై ఇద్దరు నేతలు సుముఖంగానే సంకేతాలు ఇచ్చారు. బీజేపీ

  విషయంలోనూ క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీ దీనిపై నిర్ణయం ప్రకటించిన తరువాతే.. జనసేన పొత్తులపై క్లారిటీ ఇవ్వనుంది. ఈ క్రమంలో

  పవన్ కళ్యాణ్ విషెస్ చెప్పడం కూడా హాట్ టాపిక్ అయ్యింది.


  చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెప్పడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. మరోసారి చంద్రబాబుపై పవన్

  కు ఉన్న ప్రేమ బయడపడింది అంటూ వైసీపీ అభిమానులు విమర్శిస్తున్నారు. చంద్రబాబు వెంట పవన్ పడుతున్నారు అనడానికి ఇదే

  ఉదహరణ అంటూ ఆ ట్వీట్ ను షేర్ చేస్తున్నారు.


  వైసీపీ ట్రోల్స్ కు పవన్ అభిమానులు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో సీఎం జగన్ పుట్టిన రోజు అప్పుడు కూడా పవన్

  శుభాకాంక్షలు చెప్పారని.. ఆ విషయాన్ని వైసీపీ అభిమానులు గుర్తుంచుకోవాలి అంటూ సమాధానం ఇస్తున్నారు.


  విమర్శల సంగతి ఎలా ఉన్నా.. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఆయురారోగ్ యాలతో

  చల్లగా ఉండాలి అంటూ అంతా విష్ చేస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Pawan kalyan, TDP

  ఉత్తమ కథలు