హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan: చంద్రబాబుకు పవన్ ఫుల్ సపోర్ట్.. జగన్ సర్కార్ తీరుపై ఫైర్

Pawan: చంద్రబాబుకు పవన్ ఫుల్ సపోర్ట్.. జగన్ సర్కార్ తీరుపై ఫైర్

జగన్, పవన్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

జగన్, పవన్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Pawnakalyan: తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ మరోసారి మద్దతుగా నిలిచారు.. తాజాగా కుప్పం పరిస్థితులపైనా.. జీవో నెంబర్ 1 పైనా పవన్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఏమన్నారంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Kuppam, India

Pawankalyan on Chandrababu:  ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో రోడ్ షోలు, సభలు నిషేధించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ప్రభుత్వం తీరుపై విపక్షాలన్నీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ముఖ్యంగా బుధవారం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ (TDP) శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కుప్పం (Kuppam) లో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాటలతో పరిస్థితి రాజకీయ రణరంగాన్ని తలపించింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. పోలీసులు లాఠీఛార్జి చేశారు. రోడ్‌ షోలకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు నిలిపివేయడంతో దాదాపు ఆయన గంటపాటు రోడ్డుపైనే ఉన్నారు.  పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబును అడ్డుకున్నారనే వార్త వ్యాపించడంతో.. ఊహించని స్థాయిలో టీడీపీ కార్యకర్తలు పార్టీ నేతలు సునామీలో పోటెత్తారు.

తాజాగా ఈ ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన చేయకుండా అడ్డుకోవడంపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాన అని ప్రకటన చేశారు. 

ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదు.. ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతోనే జీవో 1 తీసుకువచ్చారని పవన్ విమర్శించారు. ఇలాంటి జీవో గతంలో ఉండి ఉంటే జగన్‌ రెడ్డి.. ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేయగలిగేవారా..? అని పవన్ ప్రశ్నించారు.

రాష్ట్రంలోప్రజా వ్యతిరేక విధానాలను పాలకులు అమలు చేస్తుంటే ప్రజా పక్షం వహించడం ప్రతిపక్ష పార్టీలుగా తమపై పూర్తి బాధ్యత ఉంది అన్నారు. ఇప్పటికే పలు మార్లు జగన్ నియంతలా వ్యవహించారు.. అయినా ప్రతిపక్షాలు శాంతియుతంగానే ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నాయి. అయినా ఇలాంటి చీకటి ఉత్త్వరులు ఇవ్వడం ఏంటిని ప్రశ్నించారు. ఇలాంటి జీవోల గురించి విశాఖ నగరంలో అక్టోబరులోనే వెల్లడించారని గుర్తు చేశారు. వాహనంలో నుంచి కనిపించకూడదు.. ప్రజలకు అభివాదం చేయకూడదని, హోటల్‌ నుంచి బయటకు రాకూడదని నిర్బంధాలు విధించారని మండిపడ్డారు. ఇప్పటం వెళ్లరాదని అటకాయించారని అన్నారు.

ఇదీ చదవండి : రెండో రోజూ సేమ్ సీన్.. ఆంక్షలు అడ్డగింతలపై నేడు ప్రత్యేక సమావేశం.. కుప్పంలో చంద్రబాబు విశ్వరూపం

ప్రతిపక్షాల వాదనను ప్రజలకు వినిపించనీయకుండా ఉండాలనే చెడు ఉద్దేశంతోనే ఇలాంటి జీవో ఇచ్చారని ఆయన మండిపడ్డారు. ఈ ఉత్తర్వులు బూచిగా చూపి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన చేయకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ఇలా నిరంకుశత్వంగా వ్యవహరించే ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాను అన్నారు.. ఈ విధమైన చర్యలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్యేగా తన నియోజక వర్గంలో పర్యటించి ప్రజలను కలవడం ఆయన బాధ్యత అని.. దాన్ని జీవో 1 ద్వారా అడ్డుకొవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఈ ఉత్తర్వులు జగన్‌ రెడ్డికి కూడా వర్తిస్తాయా అని ప్రశ్నించార. మరి నిన్నటి రోజున రాజమహేంద్రవరంలో జనాన్ని రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టి ఆయన చేసిన షో ను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Pawan kalyan

ఉత్తమ కథలు