Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA CHEIF PAWAN KALYAN GAVE GREEN SIGNAL TO ALLIANCE WITH TDP AND DOORS OPEN FOR YCP LEADER NGS

Pawan Kalyan Hints: చంద్రబాబుతో పొత్తుకు సంకేతాలిచ్చారా? వైసీపీ నేత చేరికకు గ్రీన్ సిగ్నల్..?

Pawan Kalyan Twitter

Pawan Kalyan Twitter

Pawan Kalyan Hints: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన చర్చకు వేదికైంది పవన్ కళ్యాణ్ విసిరిసన ఛాలెంజ్.. కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన పవన్.. టీడీపీ అధినేత చంద్రబాబుకు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ కు సవాల్ విసరడం.. ఆ వెంటనే బాలినేని సవాల్ ను స్వీకరించడం ఆసక్తికరంగా మారింది.. కొత్త లెక్కలకు తెరలేచినట్టే అంటూ ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India
  Pawan Kalyan Hints: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఏ పరిణామం చోటు చేసుకున్నా.. అది చర్చనీయాంశంగానే మారుతోంది. ముఖ్యంగా జనసేన (Jansena)-తెలుగు దేశం (Telugu Desam) పొత్తు ఉంటుందా ఉండదా అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కింది స్థాయిలో దీనిపై భిన్న ప్రచారాలు జరుగుతున్నాయి. కొందరు వార్ వన్ సైడ్ అంటున్నారు. మరికొందరు మాత్రం రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయి అంటున్నాయి. కానీ మొదట్లో పొత్తులపై ఇద్దరు పొత్తులపై పరోక్షంగా హింట్లు ఇచ్చినా.. ఇప్పుడు మాత్రం నోరు మెదపడం లేదు. కనీసం పరోక్షంగా కూడా మాట్లాడడం లేదు. ఎవరికి వారు.. సొంతగా అధికారం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరోవైపు వైసీపీ సైతం దమ్ముంటే సింగిల్ గా రావాలని జనసేన, టీడీపీలకు సవాల్ విసురుతోంది. దీంతో పొత్తు ఉంటుందా ఉండదా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి సమయంలో జనసేన అధినేత పవన్ విసిరిన ఛాలెంజ్ తో పరోక్ష హింటు ఇచ్చారనే ప్రచారం ఊపందుకుంది.. తెలంగాణ మంత్రి కేటీఆర్ (MInster KTR) విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన పవన్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ లను ఛాలెంజ్ చేశారు.. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది.

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు చాలా మంది వైఎస్సార్సీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడుతుంటారు. తన సొంత సామాజికవర్గానికి చెందిన నేతలతో జగన్ తనను తిట్టిస్తున్నారని పవన్ వాపోయిన సందర్భాలూ ఉన్నాయి. కానీ వైసీపీకి చెందిన ఓ సీనియర్ నేత మాత్రం పవన్ కళ్యాణ్ అంటే తనకెంతో గౌరవం అంటున్నారు. తమ మధ్య ఉన్న స్నేహ సంబంధాలను ట్విట్టర్ వేదికగా ఆయన మరోసారి బయటపెట్టారు.  జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం.. ‘మై హ్యాండ్లూమ్ మై ప్రైడ్’ ఛాలెంజ్‌ను ఆనంద్ మహీంద్రా, సచిన్ టెండుల్కర్,  పవన్ కళ్యాణ్‌కు విసిరారు. ఈ ఛాలెంజ్ స్వీకరించిన జనసేనాని చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను ట్వీట్ చేశారు. ‘కేటీఆర్ భాయ్ ఛాలెంజ్ స్వీకరించాను. మన చేనేతన్నలంటే నాకెంతో ఇష్టం, అభిమానం. నేను చంద్రబాబు నాయుడు, బాలినేని శ్రీనివాస రెడ్డి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ను నామినేట్ చేస్తున్నా అని ట్వీట్ చేశారు.

  చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ సిద్ధంగానే ఉన్నారని.. చంద్రబాబుకు పవన్ కు గ్యాప్ లేదని.. మరోసారి ఈ ట్వీట్ రుజువు చేసిందని ఓ వర్గం ప్రచారం చేస్తోంది.

  ఇదీ చదవండి : హస్తినలో సీఎం జగన్ కు పెరుగుతున్న ప్రాధాన్యత పెరిగిందా? మోదీ లంచ్ భేటీ లెక్క ఏంటి?

  అదే సమయంలో వైసీపీకి చెందిన బాలినేనికి కూడా సవాల్ విసిరారు కదా అని కొందరు ప్రశ్నిస్తే.. దానికి కూడా కారణం ఉంది అంటున్నారు.. బాలినేని చూపు జనసేన వైపు ఉందనే ప్రచారం ఉంది. ఆయన్నుమంత్రి పదవి నుంచి తప్పించినప్పటి నుంచి ఆ టాక్ నడుస్తోంది. ఆయన స్వయంగా హైదరాబాద్ వెళ్లి పవన్ కలిశారనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. ఎన్నికల సమయానికి ఆయన పవన్ కు మద్దతు తెలుపుతారని.. ఆయన అనుచరులే కొందరు అభిప్రాయపడుతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది..

  ఇదీ చదవండి : సీఎం జగన్ మనసున్న నేత అంటున్న టీడీపీ ఎమ్మెల్యే..? ఇంకా ఏమన్నారంటే?

  అందుకే ఈ ఇద్దర్నీ ఛాలెంజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ ఛాలెంజ్ పై.. సాధారణంగా రాజకీయంగా వ్యతిరేకత ఉన్నా బాలినేని.. ప్రతిపక్ష నేతలతో హుందాగానే వ్యహరిస్తారనే గుర్తింపు ఉంది. ఆ విషయం మరోసారి ఆయన రుజువు చేశారు. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ.. బాలినేని స్పందించారు.

  చేనేత వస్త్రాలు ధరించిన ట్వీట్ చేసిన మాజీ మంత్రి.. ‘‘ట్విట్టర్ వేదికగా చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత దుస్తులు ధరించి ఫొటోలు దిగాలంటూ పవన్ కళ్యాణ్ చేసిన చేనేత సవాల్‌ను స్వీకరించాను.. అంటూ తనను ఛాలెంజ్ కు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తాను చిత్తశుద్ధితో చేనేత మంత్రిగా వైఎస్సార్ హయాంలో పని చేశానని గుర్తు చేశారు. ఆ నాడు వైఎస్సార్ చేనేతల కోసం 300 కోట్లు మాఫీ చేశారు. ఇవాళ తమ నాయకుడు జగన్ ప్రభుత్వంలోనూ నేతన్నల సంక్షేమం కోసం వైఎస్సార్ నేతన్న నేస్తం దగ్గర్నుంచి ఎన్నో పథకాలు అందిస్తున్నామన్నారు.

  బాలినేని ట్వీట్‌కు స్పందించిన పవన్ కళ్యాణ్.. ‘‘చేనేత కార్మికుల కోసం మీరు చేసిన పనిని అభినందిస్తున్నాను. మరోసారి నేతన్నల కోసం మీరు చూపిన కమిట్‌మెంట్‌కు ధన్యవాదాలు అన్నారు.

  Respected @balineni_vasu garu, your sincere efforts towards HandLoom workers was well appreciated then and I wholeheartedly thank you for this response to show your commitment once more for our weaver communities Sir???? https://t.co/nhf7cOJYFE  గతంలో జనసేన నాయకురాలితో వైఎస్సార్సీపీ నేత అర్ధరాత్రి ఫొన్లో మాట్లాడటాన్ని సీరియస్‌గా తీసుకున్న పవన్ కళ్యాణ్.. బాలినేని శ్రీనివాస రెడ్డితో ఈ విషయమై ఫొన్లో మాట్లాడారు. ఆ తర్వాత బాలినేని అనుచరుడైన సదరు వైసీపీ నేత క్షమాపణలు చెప్పారు. జనసేనాని అప్పుడప్పుడు మాటల మధ్యలో వైఎస్సార్సీపీలోనూ మంచి నేతలు ఉన్నారంటూ పరోక్ష వ్యాఖ్యలు చేస్తుంటారు. అందులో భాగంగానే ఆయన బాలినేకి ఛాలెంజ్ చేశారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప రాజకీయ ఉద్దేశం ఏమీ లేదంటున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Balineni srinivas reddy, Janasena, Pawan kalyan

  తదుపరి వార్తలు