Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA CHEIF PAWAN KALYAN FOCUSED ON PAWAN KALYAN IN EAST GODAVARI DISTRICT NGS

Pawan Kalyan: ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టనీయొద్దు.. ఆ నియోజకవర్గంపై జనసేనాని ప్రత్యేక ఫోకస్

Pawan Kalyan Twitter

Pawan Kalyan Twitter

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీలు మత శత్రువలను రాజకీయ ప్రత్యర్థులుగా చూడడం లేదు.. వ్యక్తిగత శత్రువులగానే పరిగణిస్తున్నారు. తాజాగా జనసేన సైతం ఓ ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా చూడాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • East Godavari, India
  Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ (YCP), విపక్ష జనసేన (Janasena) మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉంది. టీడీపీ (TDP)ని ఎలా చూస్తారో.. జనసేనను కూడా వైసీపీ నేతలు అలానే చూస్తారు.. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను అయితే.. చంద్రబాబు నాయుడు దత్త పుత్రుడని స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డే (CM Jagan Mohan Reddy) విమర్శిస్తారు.. ఇటీవల కాలంలో టీడీపీ కంటే.. జనసేననే వైసీపీ ఎక్కవగా టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా పవన్ ను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. పవన్ పై కౌంటర్లు వేయడానికి ప్రత్యేకంగా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యే ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు అదే స్థాయిలో అధికార పార్టీలోని కొందరు నేతలను కూడా జనసేన టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఆ ఎమ్మెల్యే మాత్రం తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్ట నీయకూడదని పవన్ భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీలో ప్రముఖులకు ఆ ఆదేశాలు వెళ్లాయి అంటున్నారు. స్థానిక జనసైనికులు సైతం.. కచ్చితంగా ఆయన్ను ఓడించాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

  గతఎన్నిక‌ల్లో రాజోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన జ‌న‌సేన అభ్య‌ర్థి రాపాక వ‌ర‌ ప్ర‌సాద్ (Rapaka Vara Prasad).. ప్రస్తుతం అధికార వైసీపీకి అనుబంధ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు. పార్టీ మార‌కుండా ఉండేందుకు ప‌వ‌న్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ఆ మాటలను ఎమ్మెల్యే లైట్ తీసుకున్నారు. స్వయంగా పవన్ చెప్పిన మాటలను పెడ‌చెవిన పెట్టారు. ఈలోగా మూడు సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి. మ‌రో రెండు సంవ‌త్స‌రాల సమయమే ఉంది.  అయితే ఇప్పుడు మళ్లీ రాజోలు నుంచి రాపాక పోటీ చేస్తారా..? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయ‌న‌కు సీటిస్తుందా? ఒకవేళ అధిష్టానం పెద్దలతో ఉన్న పరిచయం.. పవన్ ను ఎదిరించారనే కారణాలతో సీటు ఇచ్చినా.. స్థానిక వైసీపీ నేతలు సహకరించే పరిస్థితి అయితే లేదు. ఇప్పటికే అతడి తీరుపై ఆగ్రహంతో ఉన్న కొందరు పార్టీని వీడారు కూడా.. మరికొంతమంది కీలక నేతలు సైతం రాపాక తీరుపై గుర్రుగానే ఉన్నారు.

  ఇదీ చదవండి : ఉపాధ్యాయులకు మరో టెన్షన్.. ఇక ఫేషియల్ రికగ్నిషన్.. నిమిషం ఆలస్యమైతే అంతే?

  వైసీప నేతలు సహకరించకున్నా.. అక్కడ గెలుపు కష్టమే.. ఎందుకంటే జగన్ వేవ్ లోనూ.. అక్కడ జన సైనికి కష్టపడి తమ అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఆయన వ్యక్తిగతంగా కాకుండా.. అక్కడ పవన్ ఇమేజ్.. జనసైనికుల శ్రమ కారణంగానే నెగ్గారన్నది బహిరంగ రహస్యం. అయితే ఇప్పటికే ఆయన్ను గెలిపించిన జనసైనికులు అంతా.. రాపాకకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

  ఇదీ చదవండి: తిరుమలలో మంత్రి హల్ చల్.. సిఫార్సు లేఖలు రద్దు చేయడంపై గరం గరం.. అనుచరుల వీరంగం

  ఈ సారి పోటీ చేస్తే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన పొత్తు ఉండే అవకాశం ఉంది. ఒక వేళ పొత్తు లేకపోయినా అంతర్గతంగా కొన్ని సీట్లలో ఒప్పందం చేసుకునే అవకాశాలు లేకపోలేదు.. దీంతో జనసేన బలం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వైసీపీలో వర్గ పోరు ఎక్కువైతే రాపాక ఎమ్మెల్యే అభ్యర్థి అయితే గెలుపు మాత్రం అంతా ఈజీ కాదు.

  ఇదీ చదవండి : ప్రధాని మోదీని వారితో పోల్చిన చంద్రబాబు.. పొత్తుకు సంకేతమేనా..?

  మరోవైపు రాబోయే ఎన్నికల్లో రాపాకు గ‌ట్టిగా బుద్ధిచెప్పాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యించుకున్నారు. ఆయ‌న్ను ఓడించేందుకు మాజీ ఐఏఎస్ అధికారి దేవ వ‌ర‌ప్ర‌సాద్‌ను బ‌రిలోకి దింప‌బోతున్నారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గంలోని డిండి గ్రామానికి చెందిన ఆయ‌న ఇటీవ‌లే పార్టీలో చేరారు. నిజాయితీ క‌లిగిన అధికారిగా పేరు తెచ్చుకున్న వ‌ర‌ప్ర‌సాద్ రాపాక‌ను ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అంతేకాదు.. రాజోలులోని జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రాపాక‌పై మండిప‌డుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదిరితే.. కచ్చితంగా ఆ సీటు జనసేనకు కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Pawan kalyan, Rapaka varaprasad

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు