హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: లగ్జరీ కార్లు.. ఇంధ్రభవనం లాంటి ఫాం హౌస్.. పవన్ వ్యాఖ్యలతో వైసీపీ ఎమ్మెల్యే ఆస్తులపై ఆరా

Pawan Kalyan: లగ్జరీ కార్లు.. ఇంధ్రభవనం లాంటి ఫాం హౌస్.. పవన్ వ్యాఖ్యలతో వైసీపీ ఎమ్మెల్యే ఆస్తులపై ఆరా

ఆ ఎమ్మెల్యే ఆస్తులపై పవన్ విమర్శలు

ఆ ఎమ్మెల్యే ఆస్తులపై పవన్ విమర్శలు

Pawan Kalyan: ఆ వైసీపీ ఎమ్మెల్యే వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. చాలా రోజుల నుంచి విపక్షాలు అతడి తీరుపై విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆ ఎమ్మెల్యేకు అన్ని ఆస్తులు ఎక్కడవి అంటూ పవన్ చేసిన విమర్శలతో.. నిజంగా ఆ ఎమ్మెల్యేకు అంత ఆస్తులు ఉన్నాయనే అని అంతా ఆరా తీస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Tirupati, India

  Pawan Kalyan on YCP MLA: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.  తాజాగా ఓ ఎమ్మెల్యే పై  జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరోపణలతో.. ఆయన వ్యవహారం పై దుమారం రేగుతోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే అనుకుంటున్నారా..? అనంతపురం జిల్లా (Anantapuram District) రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు వెళ్తుంటారు ధర్మవరం యువ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (Kethi Reddy Venkatarama Reddy) .. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని భావించి ప్రతి నిత్యం గుడ్ మార్నింగ్ ధర్మవరం  (Good Moring Darmavaram) పేరుతో నియోజకవర్గ ప్రజలతో కలసి వారి సమస్యలు తెలుసుకొని పరిస్కార దిశగా అడుగులు వేయించే వారు. అలా కేతిరెడ్డి చేపట్టిన కార్యక్రమం బాగా ప్రాచుర్యం పొందింది.


  ఇతర ఎమ్మెల్యేలు కూడా ఆయనను చూసి గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంత పాపులారిటీ ఉన్న కేతిరెడ్డి లాక్ డౌన్ లో తీసుకున్న చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలే. వివాదం పాతదే అయినా.... పవన్ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  గతంలోనే కేతిరెడ్డిపై అవినీతి ఆరోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. స్థానికంగా ఉన్న కొందరు నేతలు ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఆరోపణల వర్షం కురిపించారు. అప్పట్లో అందుకు సంబంధించి ఫోటోలు సైతం విడుదల చేసారు. ధర్మవరంలో ఓ చెరువు ఉంది.. ఆ చెరువుకి ఆనుకొని ఓ భారీ కొండా ప్రాంతం ఉంది. ఇక్కడే ఎమ్మెల్యే కేతిరెడ్డి లగ్జరీ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారనేది కొందరి నేతల ఆరోపణలు. ఈ ఫామ్ హౌస్ ఇంద్రభవనాన్ని తలదన్నేలా నిర్మించుకున్నారనే ప్రచారం ఉంది.


  ఇదీ చదవండి : జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని టేకోవర్ చేసుకుంటారా.. తెరపైకి సరికొత్త డిమాండ్


  ఈ ఇంద్ర భవనంలో ఎంతో లగ్జరీ కార్లను పార్కింగ్ చేసి ఉంచారంట. దేశంలో తాయారు చేసే అత్యంత ఖరీదైన కార్లే కాకుండా.. ఇంపోర్టెడ్ కార్లు సైతం అధికంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమానికి వచ్చే సమయంలో లాంబర్గిని, థార్, ల్యాండ్ రోవర్ ఇతర విలాసవంతమైన కార్లలో వచ్చారట. అంతే కాదు ఫామ్ హౌస్ దగ్గర ప్రత్యేక బోటింగ్ ఏర్పాటు చేసుకున్నట్లు ఫోటోలు విడుదల చేసారు కొందరు నేతలు.


  ఇదీ చదవండి: అక్కడ కొండెక్కితే మేఘాలు అందుతాయా..? ఆంధ్రా ఊటీ హార్సిలీ హిల్స్ ఏ సమయంలో వెళ్లాలి.? ఎలా వెళ్లాలో తెలుసా?


   హార్స్ రైడింగ్ నేర్చుకునేందుకు ప్రత్యేకంగా విదేశీ గుర్రాలను తన ఫామ్ హౌస్ లో తెప్పించుకొని ట్రైనింగ్ పొందారట. అందుకు దళితుల భూపులు లాక్కొని తన విలాసాలు సాగిస్తున్నారని.. కార్లు,  గుర్రాల పోషణకు డబ్బులు ఎక్కడ నుంచి తెస్తున్నారని పవన్ ప్రశ్నలు సంధించారు. దింతో ఎమ్మెల్యే స్వయంగా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాక్యూమెంట్ చూపి మరి వివరణ ఇచ్చారు.  


  ఇదీ చదవండి : నారాయణుడి పేరు పైనే ఏపీలో నగరానికి పేరు.. చారిత్రక నేపథ్యం ఏంటంటే?


  జనవాణి కార్యక్రమం చేపట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి కేతిరెడ్డి పై సెటైర్లు వేశారు. తిరుపతి సభలో ధర్మవరం టాపిక్ తీసుకు రావడానికి కారణం అక్కడ పార్టీ తరపున ప్రతినిధ్యం వహిస్తున్న చిలకం మధుసూదన్ రెడ్డి. సేవ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గం మొత్తం పర్యటించి ప్రజలలో మమేకం అయ్యే ప్రయత్నం చేసారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న మధుసూదన్ రెడ్డి రాయలసీమలో చేపట్టే కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఆయనే కేతిరెడ్డి గురించి పవన్ కల్యాణ్ కు చెప్పినట్ట. సమాచారం.


  ఇదీ చదవండి : గోశాల నిర్వహించే ఆలయాలకు ప్రత్యేక నిధులు.. ఇకపై ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో శ్రీవారి కళ్యాణం


  జనవాణి కార్యక్రమంలో సడన్ గా ఓ ఫోటో చూపిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలలో కొందరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని వ్యాఖ్యలు చేసారు. కేతిరెడ్డి గుర్రాలను పట్టుకొని ఉన్న ఫోటోలను చూపిస్తూ దళిత గిరిజన భూములు కాజేసి.. గుర్రాలను మేపేందుకు మాత్రం.. అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఖరీదైన కార్లలో తిరుగుతారు., పోషణకు అధికంగా ఖర్చు అయ్యే గుర్రాలను పెంచుతారని.. ప్రజల బాధను గాలికి వదిలేశారని విమర్శలు చేసారు. పవన్ వ్యాఖ్యలతో ఇప్పుడు ఇటు దర్మవరం ప్రజలు.. అక్కడి పలు పార్టీల నేతలు అంతా నిజంగానే ఆయనకు అన్ని ఆస్తులు ఉన్నాయా అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, AP Politics, Pawan kalyan, Tirupati

  ఉత్తమ కథలు