Home /News /andhra-pradesh /

AP POLITICS JANA SENA CHIEF PAWAN KALYAN PROTEST AGAINST POWER CHARGES HIKE IN ANDHRA PRADESH NGS

Current Shock: విద్యుత్ పోరాటంలో ఒక్కటవుతున్న విపక్షాలు.. పొత్తులకు ఇదే తొలి అడుగు

పవన్ కళ్యాణ్,చంద్రబాబు (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్,చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ మంటలు రాజకీయ సెగలు రేపుతున్నాయి. మద్య తరగతి ప్రజలే టార్గెట్ గా ప్రభుత్వం ధరలు పెంచిందని విపక్షాలు మండిపడుతున్నాయి. గత ప్రభుత్వం కారణంగానే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం అంటోంది. ఈ విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంపై జనసేన ఉద్యమానికి సిద్ధమైంది. నేరుగా పవన్ ఉద్యమంలో పాల్గొనాడానికి సిద్ధమయ్యారు.

ఇంకా చదవండి ...
    Current Shock in AP:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ ఛార్జీల పెంపు వ్యవహారంపై పొలిటికల్ మంటలు చెలరేగుతున్నాయి.  విద్యుత్ ఛార్జీల బాదుడుపై  (AP Electricity Charges) పై ప్రతిపక్షాలు  తీవ్ర స్థాయిలో  మండిపడుతున్నాయి.  ఉద్యమ బాట పడుతున్నాయి.  ప్రతిపక్షంలో ఉండగా బాదుడే.. బాదుడు అంటూ ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) చేసిన  కామెంట్స్ ను వైరల్ చేస్తన్నాయి.  వైసీపీ ప్రభుత్వం (YCP Government) మూడేళ్లలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు (Current Charges) పెంచిందని టీడీపీ (TDP) ఆరోపిస్తోంది. మరోవైపు దీనిపై దశల వారీ పోరాటినికి సిద్ధమైంది. ఇక జనసేన (Janasena) సైతం రంగంలోకి దిగింది. సామాన్యులపై బాదుడుకి నిరసగా ఉద్యమం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిర్ణయించారు.

    రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. అందులో భాగంగా..  అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.  ఒక్కసారి పవర్ ఇవ్వండి నా పవర్ ఏంటో చూపిస్తా అంటూ విద్యుత్ ఛార్జీలను పెంచేసి వైసీపీ నాయకత్వం తన పవర్ ఈ విధంగా చూపించుకుంది అంటూ ఎద్దేవా చేశారు..

    ఉగాది కానుకగా  1400 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల వడ్డింపుతో పాటు ట్రూ అప్ ఛార్జీల పేరుతో మరో  3 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందని మండిపడ్డారు జనసేనాని. ఆదాయం లేదు.. రాబడి లేదు.. ట్యాక్సులు మీద ట్యాక్సులు మాత్రం వేస్తున్నారని ఫైర్‌ అయ్యారు పవన్.. చెత్త పన్ను, ఆస్తి పన్ను, ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ పై అధిక వ్యాట్, లిక్కర్ పై అయితే సరే సరే అని.. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు కూడా పెంచి సామాన్యుడి వెన్ను విరిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో 20 రూపాయలు లాక్కుంటున్నారని ఆరోపించిన ఆయన..  పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని హామీ ఇచ్చిన జగన్.. ఆ మాటను మరిచిపోయారని మండిపడ్డ పవన్.

    2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది. అందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైతం సిద్ధమనే సంకేతాలు  ఇచ్చారు. అయితే బీజేపీ పొత్తులపై తీసుకునే నిర్ణయం మీద కూటమి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే ఈ కూటమి ఏర్పాటుకు విద్యుత్ ధరలపై పోరాటం తొలి అడుగుగా చెబుతున్నారు.. రాజకీయ విశ్లేషకులు..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Janasena, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు