వైసీపీలో నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి ఎపిసోడ్ వేడి రాజేసింది. నెల్లూరులో మాఫియా చెలరేగిపోతుందంటూ ఆనం చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ అధికార, ప్రతిపక్షాల్లో మాటలతో అంతర్యద్ధం నడుస్తోంది. అయితే విజయసాయిరెడ్డి ఆనంకు ఓపెన్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇటు జగన్ కూడా ఆనంపై సీరియస్ అయ్యారు. చంద్రబాబును ఆనం కలిశారన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆనం వైఖరి ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. అయితే అందరికీ షాక్ ఇచ్చేలా ఆనం నిండు సభలో ప్రభుత్వం తరపున రంగంలోకి దిగారు. ఏకంగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. సభలో అరాచక శక్తులు అంటూ చంద్రబాబు చేసిన కామెంట్ ను తప్పుపట్టారు ఆనం. సభలో తన సీటు వద్దకు చంద్రబాబు వచ్చే ప్రయత్నం చెయ్యడాన్ని ప్రశ్నించారుజ తన సీటు మార్చాలని స్పీకర్ ను కూడా కోరారు. ప్రశ్నోత్తరాల్లో ప్రొటెస్ట్ తెలిపే సాంప్రదాయమే లేదన్న లేదన్నారు ఆనం. ఆనం ప్రసంగాన్ని ఆసక్తిగా పరిశీలించిన సీఎం జగన్... చంద్రబాబుపై కామెంట్లు చేయగానే నవ్వులు చిందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anam Ramanarayana Reddy, Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Chandrababu Naidu, Cm jagan