తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సరళిపై రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు తిరుపతి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం.., ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లలో అధికార వైసీపీ పార్టీ 22 డివిజన్ లను ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా.., 27 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరో ఒక్క డివిజన్లో ఎన్నిక అంశం కోర్టు పరిధిలో ఉండటంతో ఎన్నికలు నిలుపుదల చేసారు అధికారులు. ముఖ్యంగా తిరుపతిలోని 50 డివిజన్లలో 3,4మరియి 15వ డివిజన్లను అత్యంత సమస్యాత్మకంగా ప్రాంతంగా పరిగణలోకి తీసుకున్న పోలీసులు.., భారీగా బందోబస్తు ఏర్పాటు చేసారు.
పోలీసులు అనుకున్న విధంగానే ఆయా వార్డులలో భారీగా టీడీపీ-అధికార వైసీపీ పార్టీ కార్యకర్తల నడుమ తీవ్ర వాగ్వాదం నెలకొంది. దొంగ ఓట్లు వేస్తున్నారని అధికార పార్టీపై అభియోగం మోపుతూ.., పోలింగ్ బూత్ లో వెళ్లే ప్రయత్నం చేసారు టీడీపీ కార్యకర్తలు. దింతో టీడీపీ-వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై మరొకరు తోపులాడుకుంటూ.... దాడులకు దిగే ప్రయత్నం చేసారు. సరిగ్గా రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేసారు. బైరాగి పట్టెడలోని పోలింగ్ బూత్ వద్ద ఇరుపార్టీల మధ్య మధ్య వాగ్వాదాన్నీ పోలీసులు లాఠీతో పనిచెప్పి కంట్రోల్ చేసారు.
ఇది చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో టెన్షన్ వాతావరణం.. జనసేనపై ఆరోపణలు
మరో సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని 3,4 పోలింగ్ బూత్ లలో దొంగ ఓట్లు వేసేందుకు వైసిపి కార్యకర్తలు యత్నించినట్లు టీడీపీ కార్యాకర్తలు ఆరోపణలు చేసారు. అక్కడ ఉన్న వైసీపీ నాయకులను దొంగ ఓట్లు వెయ్యకుండా నిలువరించే ప్రయత్నం చేసారు టిడిపి నాయకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap local body elections, Local body elections, TDP, Tirupati, Ysrcp