ఏపీలో ముందస్తు ఎన్నికలకు వైసీపీ ప్రభుత్వం సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చని, కార్యకర్తలు సిద్దంగా ఉండాలని పశుసంవర్థక మంత్రి సీదిరి అప్పలరాజు (Sidiri Appalaraju) వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. మూడున్నరేళ్లుగా భారీ జాబ్ నోటిఫికేషన్ ఒక్కటి కూడా ఇవ్వని ప్రభుత్వం, ఇప్పటికే పోలీస్ ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వంలో అత్యున్నత పోస్ట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వైసీపీకి అనుకూలంగా ఉండే తమ సామాజికవర్గం వ్యక్తి జవహర్ రెడ్డిని (Jawahar Reddy)నియమించుకున్నారు. ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటే ఏపీలో వచ్చే ఏప్రిల్ నాటికి ముందస్తు ఎన్నికలు వచ్చేలా ఉన్నాయి. అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రతి వారం ఓ జిల్లాలో ఏదో ఒక పథకం బటన్ నొక్కే పేరుతో మీటింగులు పెడుతున్నారు. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా ప్లాష్ ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ అధినేత భావిస్తున్నట్టుగా ఉంది.
పవన్ వైఖరి ఎందుకు మారిందివిశాఖలో ప్రధాని మోదీని కలసిన తరవాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైఖరి మారింది. అప్పటి వరకు ఓట్ల చీలనీయమంటూ పలికిన జనసేనాని మాట మార్చారు. ఒక్క అవకాశం ఇస్తే తాను ఏంటో చూపిస్తానంటూ ప్రసంగాలు ఇవ్వడం ప్రారంభించారు. అంటే వచ్చే ఎన్నికల్లో తాను కూడా సీఎం అభ్యర్థిగా పోటీలో నిలవాలని, ప్రధాని సమావేశం తరవాత ఓ అభిప్రాయానికి వచ్చాడు. అంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ వేసిన వ్యూహంలో ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడిస్తే ఇక ఆ పార్టీ దిక్కులేకుండా పోతుందని, ఆ తరవాత ఎన్నికల్లో జగన్ రెడ్డిని ఓడించి జనసేన, బీజేపీ అధికారంలోకి రావచ్చని ప్రధాని మోదీ , జనసేనానికి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో జనసేనానిని తానే కాబోయే సీఎం అంటూ ప్రచారం మొదలు పెట్టారు.
జనసేనాని వ్యూహం పార్టీకే దెబ్బబీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ జనసేన పార్టీకి కలసి వచ్చేలా లేదు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళితే ఆ పార్టీకి రెండు, మూడు సీట్లు మించి రాకపోవచ్చు. అదే జరిగితే 2029 ఎన్నికల నాటికి జనసేన పార్టీని మోసేందుకు నాయకులు సిద్దంగా లేరు. అదే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనలో కనీసం 30 మంది అసెంబ్లీలోకి అడుగు పెట్టే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Breaking: వాళ్ల బాబాయిని చంపినట్టు నన్ను, లోకేష్ ను చంపుతామంటున్నారు..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
CM Jagan: రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నాం.. ప్రజలు తోడుగా ఉండాలన్న జగన్
పార్టీ కొన్నాళ్లు బతకాలంటే ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో పొత్తుపెట్టుకోవడం మంచి నిర్ణయం అవుతుందని భావిస్తున్నారు. అందుకే జనసేనాని ప్రతి విషయానికి ప్రధాని మోదీ సలహాలు తీసుకోమని తామే పోరాడతామని ప్రకటించారు. బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాఫ్ ఫాలో అవుతారా, లేదంటేపొత్తు రాజకీయాలతో పార్టీని బలోపేతం చేసుకుంటారో తెలియాలంటే కొంత కాలం వేచి ఉండాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bjp