Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రుల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్నవారిలో మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Gudivada Amarnath) ఒకరు. ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. ఆయన తొలిసారే మంత్రి అయినా.. జగన్ కేబినెట్ (Jagan Cabinet) లో కీలకమయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను టార్గెట్ చేస్తూ ఎక్కువగా హైలైట్ అవుతున్నారు. పవన్ అంటే గిట్టని వారంతా అమర్ నాథ్ కు ఫ్యాన్స్ అవుతున్నారు. ఆయనకు ఉండే పర్సనల్ ఇమేజ్ తో పాటు.. పైర్ బ్రాండ్ అనే గుర్తింపు మరింత క్రేజ్ పెరిగేలా చేస్తోంది. అందుకు నిదర్శనం తాజాగా జరిగిన ఆయన పుట్టిన రోజు వేడుకలే..
అట్టహాసంగా మంత్రి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. గతంలో ఎన్నుడూ లేని విధంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఉమ్మడి విశాఖ జిల్లాల నలుమూలల నుంచి పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు.
దీంతో ఆయన స్వగ్రామం మింది అంతా జనసంద్రంగా మారిపోయింది. అమర్ నాథ్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఒక దశలో గంటకు పైగా సమయం పట్టింది అంటే జనం తాకిడి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కిక్కిరిసిన జనాన్ని అదుపు చేయటానికి పోలీసు సిబ్బంది వల్లకాలేదు.
ఇదీ చదవండి : ఏపీలో ఇలాంటి ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్.. లేదా ఈ చిన్న మార్పులు చేసినా.. డబ్బే డబ్బు
సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామిని, ఈస్ట్ పాయింట్ కాలనీ లోని షిరిడి సాయినాధుని దర్శించుకుని తన నివాసానికి చేరుకున్న అమర్నాథ్ కు మొదట అనకాపల్లి నూకాంబిక ఆలయం నుంచి వచ్చిన పురోహితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు.
ఇదీ చదవండి : మొన్నటి వరకు అసమ్మతితో ఉన్న ఆ నేతకు అధినేత బంపర్ ఆఫర్ ఇచ్చారా..? ఆ ఆఫర్ ఏంటంటే..?
మరోవైపు తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దావోస్ లో తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ వెళ్లి ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్ కు వచ్చి పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ను కేటీఆర్ తో పోల్చి ప్రతిపక్ష నేతలు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దీంతో అమరనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పొరుగు రాష్ట్రం ఐటీ శాఖా మంత్రి కేటీఆర్తో పోల్చవద్దని కోరారు. హైదరాబాద్ లో మూడు దశాబ్దాల క్రితమే ఐటీకి బీజం పడడం వల్ల ఈ రోజు ఆ స్థాయిలో ఉందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి కేవలం ఎనిమిదేళ్లే అయిందన్నారు. అందువల్ల ఏపీని హైదరాబాద్ తో పోల్చవద్దన్నారు. ఏపీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి ఒకటి రెండు దశాబ్దాలు పట్టవచ్చన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Visakhapatnam, Ycp