AP POLITICS IS YS JAGAN FAILING TO DOMINATE TDP IN THIS KEY CONSTITUENCY IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
YS Jagan: అక్కడ టీడీపీని డామినేట్ చేయలేకపోతున్న జగన్.. వైసీపీ నేతలే అడ్డుపడుతున్నారా..?
వైఎస్ జగన్ (ఫైల్)
నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) కంచుకోట ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapuram District) లోని హిందూపురం. బాలయ్యను రెండు సార్వత్రిక ఎన్నికల్లోను ప్రజలు బ్రహ్మరథం పట్టారు హిందూపురం ప్రజలు.
నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) కంచుకోట ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapuram District) లోని హిందూపురం. బాలయ్యను రెండు సార్వత్రిక ఎన్నికల్లోను ప్రజలు బ్రహ్మరథం పట్టారు హిందూపురం ప్రజలు. రాష్ట్రమంతా ఒక లెక్క హిందూపురం మాత్రమే మరో లెక్క అన్నట్లుగా 2019 ఎన్నికల్లో టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీచినా.., ఫ్యాను గాలి ప్రభావం నందమూరి బాలకృష్ణపై మాత్రం పనిచేయలేదు. అక్కడ జగన్ పై బాలయ్యదే పైచేయి అయింది. కానీ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్ పార్టీ నేతలకు కీలక బాధ్యతలతో పాటు పార్టీ గెలుపుకి ఎంత దూరం అయినా వెళ్ళాలనే ఆలోచన చేస్తున్నారు. టీడీపీలో ముఖ్యనేతలు నిలిచే స్థానాలను టార్గెట్ చేస్తూ.. అక్కడ ఎలాగైనా గెలవాలని సీఎం పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసారు. 151 స్థానాలు కాదు.... ఏకంగా 175 స్థానాలు సాధించాలని పార్టీ నేతలకు సూచనలు చేస్తున్నారు సీఎం. ముఖ్యంగా టీడీపీకి కంచుకోటగా మారిన కుప్పం., హిందూపురంపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు.
ఐతే కొన్ని నియోజకవర్గాల విషయంలో సీఎం అనుకుంటున్నది ఒకటైతే.. పార్టీలో జరుగుతున్నది మరొకటి. పార్టీలో వర్గ విబేధాలు వైసీపీకి తలనొప్పిగా మారుతున్నాయి. హిందూపురం ప్రెస్ క్లబ్ ఘటనతో అధికార పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు స్పష్టమవుతున్నాయి. ఒకే పార్టీకి చెందిన నేతలు రోడ్డెక్కి రచ్చ రచ్చ చేయడం పార్టీ వర్గాల్లోనే కాదు.. ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం వైసీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణ రెడ్డి అనుచరులు హిందూపురం రూరల్ ఎంపీపీ స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
అదే సమయంలో ఆయన వ్యతిరేకవర్గమైన ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులు మీడియా సమావేశాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇదే విషయంపై శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ వ్యతిరేక వర్గం వారు చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బలరాంరెడ్డి మాజీ వైసీపీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి 18 మంది కౌన్సిలర్లతో ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వారి అనుచరులు ఒక్కసారిగా అక్కడికి దూసుకుంటూ వచ్చి వార్నింగ్ ఇచ్చి వృద్రిక్త పరిస్థితి నెలకొల్పారు.
ఇరువర్గాల మధ్య విలేకరుల సమక్షంలోనే యుద్ధం జరింగి. పోలీసుల సమక్షంలో ఇదంతా జరగడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ఏమీ జరగనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. బాలయ్యకు మరింత బలం చేకూర్చేలా.. వైసీపీ ప్రతిష్టను దిగజార్చేలా ఆ పార్టీ నాయాకుల వ్యవహార శైలు ఉన్నట్లు విశ్లేషలు చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.