YCP–Cong Alliance: ఆంధ్రప్రదేశ్ (Andhra Praesh)లో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. అన్ని పార్టీలు 2024 టార్గెట్ లో వ్యూహాలకు
పదును చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఇప్పుడు ఏపీలో కీలక పరిణమాలు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా పరిస్థితి
చూస్తుంటే.. పొత్తులపై చర్చలు పీక్ కు వెళ్లాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ అధికారమే లక్ష్యంగా వైసీపీ (YCP) అడుగులు వేస్తోంది. మరి వైసీపీ
నేతలు చెపుతున్నట్టు.. ఒంటరిగానే పోటీ చేస్తుందా ? లేదా ఇతర పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా? అనే రాజీకయ అంశం ఇప్పుడు ఎందరికో నిద్ర లేకుండా చేస్తోంది. ఈ క్రమంలో పొత్తులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy), మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) కామెంట్స్ చేశారు. వీరు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రశాంత్ కిషోర్ (Prasant Kishore) పై నమ్మకంతో విరిగిన చేతికి ఫ్యాన్ గాలితో అండగా నిలిచేలా సీఎం జగన్ (CM Jagan) చేస్తారా..? తాజాగా ఈ పొత్తుల అంశాలపై పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి.. మంత్రి అమర్ నాథ్ క్లారిటీ ఇచ్చారు.. కానీ వారి వెర్షన్ ఎలా ఉన్నా.. కాంగ్రెస్ తో వైసీపీ వెళ్తుందని ఓ ప్రచారం జరుగుతోంది.
తాజాగా విశాఖ వచ్చిన ఎంపీ విజయసాయి రెడ్డి.. పొత్తు ఉంటుందనే అర్థం వచ్చేలా మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీకే వైసీపీ సపోర్టు ఉంటుందన్నారు. విధానపరమైన నిర్ణయాలపై సీఎం జగన్ స్పందిస్తారని ఆయన క్లారిటీ ఇచ్చారు. కేవలం పొత్తులపైనే కాదు.. తన పదవుల కోత.. ఇతర పార్టీల పదవులపైనా స్పష్టత ఇచ్చారు. తామందరికీ పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటారో అదే ఫైనల్ అని.. తనకు అది కావాలి.. ఇది కావాలి అనే ప్రస్తావన రాదన్నారు.
ఇదీ చదవండి : ఆయన పార్టీ మారుతున్నారా..? నారా లోకేష్‌తో భేటీపై ఏమన్నారంటే?
ఇదే సమయంలో కాంగ్రెస్ తో పొత్తు వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. ఈ మాట వింటే ఎవరైనా నవ్వుతారన్నారు. అసలు వైసీపీ అన్నదే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందన్నారు. అయినా స్ట్రాటజీస్ చెప్పినట్లు చేయాలా? అని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ ను భూ స్థాపితం అవడానికి పునాది వేసిందే సీఎం జగన్ అని, సోనియా గాంధీని ఎదిరించే వారు అప్పట్లో లేరని అమర్ నాథ్ గుర్తు చేశారు.
ఇదీ చదవండి : ఏపీ సర్కార్ కు షాక్.. నేను లోకల్.. ఎవర్నీ వదలను.. ఏబీ వార్నింగ్ ..!
2004 నుంచి 2014 వరకు దేశ రాజకీయాలను సోనియా శాసిస్తున్న సమయంలో.. జగన్ ధైర్యం చేశారని గుర్తు చేశారు. ఇక 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీట్లు వెతుక్కొనే పరిస్థితి తీసుకొచ్చింది జగన్ అని చెప్పుకొచ్చారు. రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్
కిశోర్ కాంగ్రెస్ లో చేరుతారని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలో తెచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరపడం.. ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ లో పొత్తుల అంశాన్ని ప్రస్తావించారని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP Congress, AP News, AP Politics, Ycp