Home /News /andhra-pradesh /

AP POLITICS IS THERE NANDAMURI BALAKRISHNA BEHIND CHANDHRA BABU AND MOHANBABU MEETING NGS

Chandrababu-Mohanbabu: చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ వెనుక ఉన్నది బాలయ్యేనా.. అసలు మ్యాటర్ అదేనా?

మోహన్ బాబు, చంద్రబాబు భేటీ వెనుక బాలయ్య ఉన్నారా..?

మోహన్ బాబు, చంద్రబాబు భేటీ వెనుక బాలయ్య ఉన్నారా..?

Chandrababu-Mohanbabu: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..? మొన్నటి వరకు చంద్రబాబు పేరు వింటేనే నిప్పులు చెరిగే మోహన్ బాబు.. ఇంత సడెన్ గా చంద్రబాబును కలవడానికి కారణం.. బాలయ్య జరిపిన మంతనాలే అనే ప్రచారం ఉంది.. త్వరలో సమీకరణాలు మరిన్ని మారే అవకాశం ఉందా..?

ఇంకా చదవండి ...
  Chandrababu-Mohanbabu: మంచు మోహన్ బాబు (Mohan babu) తనకంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమాల్లోనూ తన రూటే సపరేటు అంటూ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు.  ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారన్నది మాత్రం సమాధానం లేని ప్రశ్నే.. ఎందుకంటే.. గతంలో టీడీపీ (TDP) తోనే ప్రయాణం సాగించారు. టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పైనే పోరాటం చేశారు. ఫీజు రియింబర్స్ మెంట్ విడుదల చేయడం లేదని.. కోట్లాది విద్యార్థుల భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెడుతున్నారంటూ ప్రత్యక్షంగా పోరాటం చేశారు. ధర్నాలు నిరసనలతో చంద్రబాబుకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా జగన్ ను కలిసి.. నేరుగా మద్దతు తెలిపిరు. అప్పటికే జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy ) తో దూరపు బంధుత్వం ఉండడంతో.. ఆయనకు వైసీపీలో కీలక పదవి వస్తుందని.. లేదా సినిమా పరిశ్రమకు సంబంధించి ఏవైనా బాధ్యతలు సీఎం జగన్ అప్పగిస్తారని ప్రచారం జరిగినా.. ఎన్నికల తరువాత ఆయనకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు.. ఆ మధ్య మా అసోసియేషన్ ఎన్నికల్లో మాత్రం మంచు విష్ణుకు ఏపీ ప్రభుత్వం నుంచి పరోక్షంగా సహకారం ఉందనే ప్రచారం కూడా జరిగింది. అప్పటి వరకు ఇటు మంచు ఫ్యామిలీకి.. అటు వైసీపీ ప్రభుత్వానికి మంచి సంబంధాలే కొనసాగాయి.. ఏమైందో ఏమో కానీ.. ఇటీవల ఓ కేసు విషయమై చిత్తూరు కోర్టుకు వచ్చిన.. ఆయన.. తాను బీజేపీ మనిషిని అని సన్నిహితులతో చెప్పినట్టు సమారచారం. మళ్లీ మోదీ అధికారంలోకి రావాలన్నదే తన లక్ష్యం అంటూ చెప్పుకొచ్చారు.. కానీ అలాంటిది అయన ఇప్పుడు చంద్రబాబును కలవడం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది.

  మోహన్ బాబు చంద్రబాబును కలవడం వెనుక రాజకీయ కారణాలు లేవని టీడీపీ నేతలు అన్నారు. కేవలం తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ సమీపంలో నిర్మించిన‌ సాయిబాబా గుడి విగ్రహ ప్రతిష్ఠాపన ఆగస్ట్ నెలలో మోహన్ బాబు చేయనున్నారని.. ఈ కార్యక్రమానికి చంద్రబాబును మోహన్ బాబు ఆహ్వానించారట. అంతేతప్ప వీరిద్దరి భేటీ వెనుక మరో కారణం లేదంటున్నారు. మోహన్ బాబు చంద్రబాబుని కలవడం వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని టీడీపీ వర్గాలు స్పష్టం చేశాయి.  కానీ కారణం మాత్రం అది కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. చంద్రబాబు పేరు చెబితేనే నిప్పులు చెరిగే మోహన్ బాబు గుడి ప్రతిష్టాపనకు చంద్రబాబును పిలవాల్సిన అవసరం లేదని.. ఒకవేళ ప్రముఖులు అందర్నీ పిలవాలి అనుకుంటే..? ఎవరితోనైనా కబురు పెట్టినా సరిపోతుంది.. కేవలం గుడి ప్రతిష్టాపన అనేది బయటకు చెప్పే కారణమని.. వీరి భేటీ వెను రాజకీయ కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  ఇదీ చదవండి : ఏపీ-తెలంగాణ లకు కేంద్రం మరో షాక్.. 2026 వరకు వెయిట్ చేయాల్సిందే..?

  ప్రస్తుతం తనకు రాజకీయంగా ఎలాంటి ప్రధాన్యత లేకపోవడం.. ఇటు సినిమా ఇండస్ట్రీకి సీఎం జగన్ కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. మోహన్ బాబు చెప్పినా.. జగన్ వెనక్కు తగ్గే పరిస్థితి లేదు. అసలు మోహన్ బాబుకు అపాయింట్ మెంట్ కూడా దక్కలేదనే ప్రచారం కూడా ఉంది. అందుకే ఆయన పూర్తిగా వైసీపీకి దూరమవ్వాలని అనుకున్నారని.. అందుకే మళ్లీ టీడీపీతో జతకట్టడమే బెటరనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై బాలయ్యే స్వయంగా చొరవ తీసుకుని.. ఇద్దర్నీ కలిపేలా చేశారని ఇప్పుడు మరో ప్రచారం జరుగుతోంది. గతంలో మా ఎన్నికల సమయంలో నేరుగా మంచు ఫ్యామిలీకి బాలయ్య మద్దతు తెలిపారు. ఇప్పుడు అలాగే ఇద్దరి భేటీ విషయంలోనూ ఆయన చొరవ తీసుకున్నారు. ఈ సారి రాజకీయంగా మోహన్ బాబుకు.. కచ్చితంగా ప్రధాన్యమిస్తారని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Balakrishna, Chandrababu Naidu, Manchu mohan babu

  తదుపరి వార్తలు