హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో మరోసారి టీడీపీ, బీజేపీ స్నేహం.. రూట్ క్లియర్ చేస్తున్న జగన్

ఏపీలో మరోసారి టీడీపీ, బీజేపీ స్నేహం.. రూట్ క్లియర్ చేస్తున్న జగన్

నరేంద్ర మోదీ, చంద్రబాబు (File)

నరేంద్ర మోదీ, చంద్రబాబు (File)

అంతా అనుకున్నట్లుగా జరిగితే ఏపీలో త్వరలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదని పేరు చెప్పేందుకు ఇష్టపడని నేత ఒకరు న్యూస్ 18తో వ్యాఖ్యానించారు.

  ఏపీలో మరోసారి టీడీపీ, బీజేపీ పొత్తు పొడిచే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రంతో సీఎం జగన్ సఖ్యత నానాటికీ తగ్గిపోతుండటం, అటు మరో ప్రత్యర్ధి, తెలంగాణ సీఎం కేసీఆర్ ను సైతం బీజేపీ దూరం పెడుతున్న నేపథ్యంలో కలిసి నడిస్తే ఎలా ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఇరు పార్టీల్లో మొదలైంది. ఏపీలో త్వరలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికల నాటికి దీనిపై ఓ స్పష్టత రానుంది. ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీని ఎదుర్కోవాలంటే భారీ ప్రణాళిక అవసరమని విపక్ష టీడీపీ భావిస్తోంది. ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీకి దగ్గరయితేనే మంచిదని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు వైసీపీపై చర్యలు తీసుకోకుండా అంటకాగుతోందంటూ విమర్శించి బీజేపీకి దూరమైన టీడీపీ... ఇప్పుడు కేంద్రంతో వైసీపీకి చెడిందని అంచనా వేస్తోంది. బీజేపీతో మైత్రికి ఇంతకు మించిన తరుణం లేదని భావిస్తున్న టీడీపీ వర్గాలు... కేంద్రానికి ఈ మేరకు స్ధానిక నేతల ద్వారా సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఎటూ 2024 ఎన్నికల నాటికి లేదా జమిలి ఎన్నికలు జరిగితే ఆ లోపే ఏపీలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి టీడీపీ వైఖరి కలిసి వస్తోంది.

  Gvl narasimha rao,bjp,Andhra Pradesh,tdp,pm modi,chandrababu naidu,tdp mps joined bjp,rajya sabha,జీవీఎల్ నరసింహారావు,బీజేపీ,ఆంధ్రప్రదేశ్,టీడీపీ,ప్రధాని మోదీ,చంద్రబాబునాయుడు,బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు,రాజ్యసభ
  బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ (ఫైల్ ఫోటో)

  ఏపీలో ప్రస్తుత పరిస్ధితుల్లో వైసీపీ సర్కారును ఎదుర్కొనేందుకు అపసోపాలు పడుతున్న టీడీపీ తమకు కేంద్రంలోని బీజేపీ అండ దొరికితే చాలని భావిస్తోంది. రాబోయే రోజుల్లో గత ఐదేళ్ల అవినీతి, అక్రమాల పేరుతో జగన్ ప్రభుత్వం కేసులతో వేధిస్తుందని అంచనా వేస్తున్న టీడీపీ... ఇప్పటికే తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇది కాకతాళీయంగా జరిగిందని కాదని తామే వ్యూహాత్మకంగా వారీని బీజేపీలోకి పంపినట్లు అర్ధమయ్యేలా టీడీపీ వ్యవహారశైలి ఉందనే ప్రచారం ఏపీలో సాగుతోంది. గత రెండేళ్లలో రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి కేంద్రంలోని బీజేపీ సాయం చేయడం వల్లే అధికారం దక్కిందని భావిస్తున్న టీడీపీ... తాము కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తే లబ్ది పొందవచ్చని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర నేతలకు ఈ మేరకు సంకేతాలు కూడా పంపుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

  ap bjp,ap tdp,ysrcp,ap cm ys jagan mohan reddy,bjp attack on religion,amit shah,bjp plan in ap,modi,chandrababu naidu,ఏపీ బీజేపీ,టీడీపీ,వైఎస్ఆర్ కాంగ్రెస్,జగన్ మోహన్ రెడ్డి,అమిత్ షా,ప్రధాని మోదీ,చంద్రబాబునాయుడు,కన్నా లక్ష్మీనారాయణ,పురందేశ్వరి
  అమిత్ షాతో వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

  అంతా అనుకున్నట్లుగా జరిగితే ఏపీలో త్వరలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదని పేరు చెప్పేందుకు ఇష్టపడని నేత ఒకరు న్యూస్ 18తో వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే బీజేపీ-టీడీపీ మైత్రి తప్పదనే అంచనాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్-జగన్ జోడీ ఇద్దరూ తమకు ఉమ్మడి శత్రువులే కాబట్టి బీజేపీతో కలవడం ద్వారా వారిని సమర్ధంగా ఎదుర్కోవచ్చన్న భావన టీడీపీలో వ్యక్తమవుతోంది. అధే సమయంలో ఏపీలో ఏదో రకంగా మళ్లీ బలపడాలని భావిస్తున్న బీజేపీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చనే ప్రచారం సాగుతోంది. ఏదేమైనా ఈ ఏడాది చివరి నాటికి బీజేపీ-టీడీపీ మైత్రిపై స్పష్టత రావచ్చని తెలుస్తోంది.

  (సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Amit Shah, Andhra Pradesh, Bjp-tdp, Chandrababu Naidu, Pm modi

  ఉత్తమ కథలు