Home /News /andhra-pradesh /

AP POLITICS IS NARA LOKESH NEGLECTING DECISIONS TAKEN IN MAHANADU TO STRENGTHEN TELUGU DESHAM PARTY FULL DETAILS HERE PRN GNT

Nara Lokesh: మాటలకే పరిమితమైన లోకేష్..? ఆ విషయంలో ముందడుగు వేయలేకపోతున్నారా..?

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

Nara Lokesh: నాయకులు వేదికల మీద ఉపన్యాసాలు దంచటం కాకుండా ఆచరణలో చేసి చూపించాలని టీడీపీ వర్గాలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ విషయంలో లోకేష్ ప్రకనలకే పరిమితం కాకుండా రంగంలోకి దిగాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.

  2019 ఎన్నికలలో ఓటమి తరువాత తెలుగుదేశం (Telugu Desham Party) శ్రేణుల పరిస్థితి చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా తయారైంది. అప్పటి నుండి పార్టీ పరంగా ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా అటు నాయకుల నుండి కాని ఇటు కార్యకర్తల వైపు నుండి కానీ పెద్దగా స్పందన కూడా ఉండేది కాదు. స్వయానా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమాలను కూడా పెద్దగా పట్టించుకున్నవారు లేరనే చెప్పాలి. మే నెలలో ఒంగోలులో నిర్వహించిన మహానాడు (TDP Mahanadu-2022) ఊహించని రీతిలో విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులలో ఉత్సాహం ఉరకలు వేసింది. టీడీపీకి పూర్వవైభవం తీసుకు రావచ్చు అనే ఆశ అటు పార్టీ శ్రేణుల నుండి అధినేత వరకు వచ్చాయి.

  అదే ఉత్సాహంతో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కొన్ని మార్పులు చేయాలని.. పార్టీలోకి కొత్త రక్తాన్ని తీసుకువాల్సిన అవసరముందని.. మార్పును తన నుంచే మొదలుపెడతానంటూ నారా లోకేష్ (Nara Lokesh) సంచలన కామెంట్స్ చేశారు. వీటిలో ప్రధానంగా ఎంతటి వారికైనా రెండు సార్లు వరుస ఓటమి చెందితే పార్టీ టికెట్ ఉండదని తేల్చేశారు. ఎవరికైనా పార్టీలో జోడు పదవులు ఉండరాదని, ఒక పదవిలో రెండుసార్లు కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదని అందరికి ఆదర్శంగా త్వరలో తానుకూడా పార్టీ ప్రదాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు.

  ఇది చదవండి: చంద్రబాబు మా అన్నయ్య.. బంధుత్వంపై విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు


  అంతేకాదు పార్టీ యువతకు ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సభసాక్షిగా ప్రకటించారు. పార్టీ కోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చెయ్యటానికి కూడా సిద్ధం అంటూ ప్రకటించారు. వేదిక మీద ప్రగల్భాలైతే పలికారు గానీ ఇప్పటికీ మహానాడు ముగిసి రెండు నెలలు కావస్తున్నా ఆచరణలో మాత్రం ఆరంభ సూరత్వమే కనిపిస్తోంది. ఇప్పటికి 36 నియోజకవర్గాలలో కనీసం పార్టీ ఇన్ఛార్జ్ లను కూడా నియమించకపోవడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.


  ఇది చదవండి: రికార్డుస్థాయిలో వరద.. లంక గ్రామలను ముంచెత్తిన గోదారి.. తాజా అప్ డేట్ ఇదే..!


  మరో సంవత్సరంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంత వరకు పార్టీ పరంగా ఏవిధమైనా చర్యలూ చేపట్టకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటినుండి ప్రజల్లో ఉంటే తప్ప ఎన్నికల నాటికి పార్టీకి జవసత్వాలు కూడబెట్టడం కష్టమని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఎన్నోరకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ అవినీతిని ప్రజలలో ఎండగట్టడమే గాక, రాష్ట్రంలో పెరిగిపోతున్న నిత్యవసర సరకుల ధరలు, విధ్యుత్ ఛార్జీలు, అధ్వాన్నంగా ఉన్న రోడ్లు పరిస్థితులు కుంటుపడిన అభివృధ్ధి, ఆర్ధిక అక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, నాయకులు వేదికల మీద ఉపన్యాసాలు దంచటం కాకుండా ఆచరణలో చేసి చూపించాలని టీడీపీ వర్గాలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ విషయంలో లోకేష్ ప్రకనలకే పరిమితం కాకుండా రంగంలోకి దిగాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Nara Lokesh, TDP

  తదుపరి వార్తలు