హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big Twist: బాలయ్యను కలిసిన మంత్రి విడదల రజని.. అసలు ట్వీస్ట్ ఏంటంటే..?

Big Twist: బాలయ్యను కలిసిన మంత్రి విడదల రజని.. అసలు ట్వీస్ట్ ఏంటంటే..?

బాలయ్యను కలిసిన విడుదల రజిని.. వాస్తవం ఏంటి?

బాలయ్యను కలిసిన విడుదల రజిని.. వాస్తవం ఏంటి?

Big Twist: ఆంధ్రప్రదేశ్ లో భారీగా వలసలు ఉంటాయని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలైతే త్వరలోనే అధికార పార్టీ నుంచి బయకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పదే పదే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మంత్రి విడుదల రజని.. ఎమ్మెల్యే నందమూరి బాలయ్యను కలిశారన వార్త వైరల్ అయ్యింది. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Big Twist: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార -విపక్షాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party)  చాలా రోజులుగా ఓ ప్రచారం చేస్తోంది. త్వరలోనే టీడీపీ (TDP) లోకి భారీగా వలసలు ఉంటాయని.. అధికార వైసీపీ (YCP) నుంచి భారీ సంఖ్యలో తమతో కలిసి పని చేసేందుకు రెడీ గా ఉన్నారంటూ చెబుతూ వస్తోంది. అందుకు తగ్గట్టే అధికార పార్టీలో వర్గ పోరు తీవ్రంగా ఉంది.. చాలా చోట్ల నేతల మధ్య సమన్వయం లేదు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు కూడా.. పార్టీ తీరుపై అసహనం వ్యక్తి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. మంత్రి పదవి దక్కని వారు ఇప్పటికీ చల్లబడలేదు. మరోవైపు మంత్రి పదవి పోయిన వారు సైతం చాలామంది అసమ్మతి గళం వినిపిస్తూనే ఉన్నారు. మంత్రుల్లో కూడా ఒకరిద్దరు.. అంత కంఫర్ట్ గా లేరనే ప్రచారం కూడా ఉంది. ఇక చాలా నియోజకవర్గాల్లో.. ఎమ్మెల్యే సీటు కోసం.. ఇప్పటి నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది.

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని (Minster Vidadala Rajani) పార్టీ మారుతున్నారని..  సీఎం జగన్‌ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కి బిగ్ షాక్‌ ఇస్తున్నారని వార్త వైరల్ గా మారింది. దానికి కారణం లేకపోలేదు.. ఇటీవల రజనీ.. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యను కలిశారు అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ ఫోటోలు చూసిన ఏపీ ప్రజలు నిజంగానే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని పార్టీ మారుతున్నారని సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అసలు విడదల రజని బాలయ్యను కలిసింది లేదు.. కానీ ఇటీవల ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని మర్యాద పూర్వకంగా.. ఇప్పుడు ఆ ఫోటోను కొందరు.. మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ ఫోటో వైరల్ అయ్యింది.. ఆమె పార్టీ మారుతున్నారంటూ ఎవరికి వారు ఫేక్ ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో తెలుగు పార్టీ నేతలే ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటూ వైసీపీ మండిపడుతోంది.


ఇదీ చదవండి : ఐడియా అంటే ఇది.. అంబాసిడర్ కారులో టేస్టీ చికెన్.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

ప్రజల్లో ఆధారణ లేకపోవడంతోనే ఇలాంటి కుట్రలకు తెరలేపారని ఆరోపిస్తున్నారు. ఇటీవల సర్వేలు అన్ని మళ్లీ జగనే సీఎం అవుతారని చెబుతుండడంతో.. తెలుగు దేశం ఓర్వలేకపోతోందని.. అందుకే ఇలాంటి ఫేక్ ప్రాచారాలకు తెరలేపారని మండిపడుతున్నారు. టీడీపీ నేతలు ఎన్ని డ్రామాలు ఆడినా.. ప్రజలు నమ్మరని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి ప్రచారాలు చేస్తున్నది వైసీపీ నేతలే అని.. టీడీపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని గుర్తించే.. వారే ఇలాంటి ఫేక్ ఫోటోలు.. ఫేక్ ప్రాచారాలతో టీడీపీ ఇమేజ్ ను డామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Nandamuri balakrishna, TDP, Vidadala Rajani, Vijayasai reddy, Ycp

ఉత్తమ కథలు