Home /News /andhra-pradesh /

AP POLITICS IS AP CM YS JAGAN LOST THE LUCKY CHANCE TO DEMAND SPECIAL CATEGORY STATUS TO ANDHRA PRADESH AHEAD OF PRESIDENT ELECTIONS FULL DETAILS HERE PRN GNT

YS Jagan: సీఎం జగన్ గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యారా..? ఆ విషయంలో ఆశలు వదులుకోవాల్సిందేనా..?

సీఎం జగన్ (పాత ఫొటో)

సీఎం జగన్ (పాత ఫొటో)

YS Jagan: ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కంటే.. రాజకీయ ప్రయోజనాలకే వైసీపీ ప్రాధాన్యత ఇచ్చిందన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితులున్నా సద్వినియోగం చేసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి.

    Anna Raghu, News18, Amaravati

    భారత రాష్ట్రపతి అభ్యర్ధిగా NDA మిత్రపక్షాలు గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్మూ (Draupadi Murmu) ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆమె శుక్రవారం తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఐతే విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా సీనియర్ రాజకీయ నేత కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాని ప్రకటించాయి. ఐతే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలలో తీవ్రమైన పోటీ నెలకొంది. దేశంలోని విపక్షాలు అన్నీ కలిసి ఈ సారి మాత్రం రాష్ట్రపతి ఎన్నిక ఏకపక్షం కాకుండా చూడాలని ధృఢంగా నిశ్ఛయించుకున్నాయి. విపక్షానికి నేతృత్వం వహిస్తున్న పశ్ఛిమబెంగాల్ సి.ఎం మమతా బెనర్జీ (Mamata Benarjee) తమ అభ్యర్ధికి మద్దతు తెలపాలంటూ ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan)  కు లేఖ రాయడం జరిగింది.

    ఐతే జగన్ ఆ లేఖకు స్పందించకుండా ఎన్.డి.ఏ అభ్యర్ధికి తన మద్దతు పలకడం ప్రతిపక్షాల నుండి తీవ్రవిమర్శలకు దారితీసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకి వైసీపీ మద్దతు కీలకం అనుకుంటున్న సమయంలో ఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్ర నుండి హామీ తీసుకుంటే బాగుండేదని, అలాక్కాకుండా భేషరతుగా ఎన్డీయే కూటమికి మద్దతు తెలపడంలో ఆంతర్యమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జగన్ తీరు వల్ల రాష్త్రానికి రావలసిన ప్రయోజనాలను సాధించుకోలేని పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేసుల భయంతోనే జగన్ ఇలా చేశారని విమర్శిస్తున్నాయి.

    ఇది చదవండి: జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. అమ్మకానికి అమరావతి భూములు.. ఎకరం ఎంతంటే..!


    రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరు ఇటీవలి కాలంలో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కేంద్రం నుండి తమకు రావలసిన హక్కులను సాధించుకుంటామంటూ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రతిపక్ష నేతలు గుర్తుచేస్తున్నారు. తీరాచూస్తే ఇప్పుడు చడీచప్పుడు లేకుండా ఎన్డీయే అభ్యర్ధి ముర్మూకు మద్దతు తెలపడం జగన్ అసమర్ధతే అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి కనీసస్థాయిలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోవడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఊసేలేదు. అటు ఎన్డీయే గానీ ఇటు విపక్షాలుగానీ కనీసం చంద్రబాబు వంక తొంగిచూడలేదు.

    ఇది చదవండి: అక్కడ టీడీపీని డామినేట్ చేయలేకపోతున్న జగన్.. వైసీపీ నేతలే అడ్డుపడుతున్నారా..?


    ఐతే జగన్ మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతివ్వడం ద్వారా రాజకీయంగా జగన్ కు ప్లస్ అయిందంటున్నారు విశ్లేషకులు. జగన్ తన నిర్ణయంతో బీజేపీకి క్లోజ్ అవుతూనే.. ఆ పార్టీతో దోస్తీ చేయాలన్న చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లారన్న చర్చ జరుగుతోంది. ఐతే ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కంటే.. రాజకీయ ప్రయోజనాలకే వైసీపీ ప్రాధాన్యత ఇచ్చిందన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితులున్నా సద్వినియోగం చేసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి.



    మద్దతు విషయంలో ఆచితూచి వ్యవహరించి విభజన సమస్యలు పరిష్కరించుకొని ఉంటే బావుండేదని.. అలా కాకుండా ఊరుకి ముందే మద్దతు తెలిపడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందన్న భావన ప్రజల్లో ఉంది. అలాంటిది కేంద్రాన్ని నిలదీసే అవకాశం వచ్చిందినా వదిలేశారన్న మాట కూడా వినిపిస్తోంది. అంతేకాదు అవసరం తీరిన తర్వాత బీజేపీకి ఎవరైనా ఒకటేనన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, President Elections 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు