హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: ఇప్పటం గ్రామ ప్రజలు పవన్ కు ఇచ్చిన గిఫ్ట్ ఇదే.. ఎందుకంత అభిమానమో తెలుసా..?

Pawan Kalyan: ఇప్పటం గ్రామ ప్రజలు పవన్ కు ఇచ్చిన గిఫ్ట్ ఇదే.. ఎందుకంత అభిమానమో తెలుసా..?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే పిచ్చిగా అభిమానించే వారు లక్షల్లో ఉంటారు. ఆయన కోసం ఏదైనా చేస్తామనేంత క్రేజ్ ఉంది. అయితే పవన్ అభిమానులే కాదు.. ఇప్పుడు ఓ గ్రామం మొత్త పవన్ ను తమ అభిమాన దేవుడు అంటున్నాయి. ఆయన కోసం ఏ చేసినా తక్కువే అంటున్నారు గ్రామస్తులు.

ఇంకా చదవండి ...

  Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చాలా గ్రామాలు ఉంటాయి. అందులోని గూంటురు జిల్లా (Gunturu District)లోని ఇప్పటం గ్రామం కూడా ఒకటి. అయితే మొన్నటి వరకు ఈ గ్రామం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది అందుకు కారణం పనవ్ కళ్యాణ్ (Pawan Kalyan). ఇటీవల జనసేన అవిర్భావ దినోత్సవాన్ని ఇప్పటం గ్రామంలోనూ నిర్వహించారు. అయితే అంతమాత్రాన అంత గుర్తింపు వస్తుందా అంటే.. కారణం అది కాదు.. అసలు జనసేన సభకు పోలీసులు మొదట అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇప్పటం గ్రామ ప్రజలు.. పోలీసుల ఆంక్షలు.. స్థానికి వైసీపీ నేతల బెదిరింపులను పట్టించుకోకుండా.. జనసేన (Janasena) సమావేశం తమ ఊరిలో నిర్వహించుకోవచ్చని అవకాశం ఇచ్చారు. దీంతో వారి సాహసాన్ని.. అభిమానాన్ని పవన్ గుర్తించారు. దీంతో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఆ గ్రామ ప్రజలు కూడా ఊహించని విధంగా.. జనసేన ట్రస్ట్ ద్వారా ఆ గ్రామానికి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.

  ఇంతకాలం తమ గ్రామం గురించి ఎవరూ పట్టించుకోలేదని.. కానీ సమావేశానికి కేవలం స్థలం ఇచ్చామనే కారణంతో పవన్ కళ్యాణ్ అంత పెద్దమనసు చాటుకున్నారని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. అందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామ ప్రజలు. తమ గ్రామానికి జనసేన ట్రస్ట్ ద్వారా రూ. 50 లక్షల విరాళం కేటాయించినందుకు పవన్‏కు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. ఇప్పటి వరకు తమ గురించి ఎవరికీ పెద్దగా తెలియదని.. కానీ ఇప్పుడు తమ గ్రామాన్ని రాష్ట్రస్థాయిలో తీసుకువచ్చేందుకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ది కోసం పవన్ కళ్యాణ్ చేసిన సాయం ఎప్పటికీ మరిచిపోలేం అంటున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు.. కార్యకర్తలతోపాటు.. మహిళ కార్యకర్తలు సైతం పాల్గొన్నారు.

  ఇప్పటం కేవలం జనసేన సమావేశానికి వేదికగా నిలిచి వార్తల్లో నిలవడమే కాదు.. 2024 ఎన్నికల్లో కీలక నిర్ణయాలకు అక్కడ నుంచి అడుగులు పడ్డాయి. ఇప్పటికే 2024 ఎన్నికలకు ముఖచిత్రం ఎలా ఉండబోతోంది అన్నదానిపై క్లారిటీ వచ్చింది. ఆ సభ వేదికగానే పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడానికి.. తాను అవసరమైన వారితో తప్పక పొత్తు పెట్టుకుంటానని స్పష్టత ఇచ్చారు.. అలాగే తన ప్రయానం బీజేపీతో కలిసే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.. దీంతో ఇప్పటం వేదికగానే.. వచ్చే ఎన్నికల నాటికి మహాకూటమికి నాంధి పలికినట్టు అయ్యింది. మరి అది ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి.. ఒకవేళ నిజంగా మహా కూటమి ఏర్పాడి.. ఎన్నికలకు వెళ్తే.. ఆ ఘనత సైతం ఇప్పటం గ్రామానికే దక్కుతుంది..

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Gunturu, Janasena, Pawan kalyan

  ఉత్తమ కథలు