హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSRCP: వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్.. సీఎం జగన్ వ్యూహం వర్కవుట్ అవుతుందా..?

YSRCP: వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్.. సీఎం జగన్ వ్యూహం వర్కవుట్ అవుతుందా..?

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) అధికారంలోకి రావడంలో సీఎం జగన్ (AP CM YS Jagan) పాదయాత్ర, నవరత్నాల హామీలతో పాటు ఐ-ప్యాక్ (I PAC) వ్యూహాలు బాగా పనిచేశాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీకి ఐ-ప్యాక్ సేవలు కొనసాగుతున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Andhra Pradesh, India

  Anna Raghu, Sr. Correspondent, News18, Amaravati

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) అధికారంలోకి రావడంలో సీఎం జగన్ (AP CM YS Jagan) పాదయాత్ర, నవరత్నాల హామీలతో పాటు ఐ-ప్యాక్ (I PAC) వ్యూహాలు బాగా పనిచేశాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీకి ఐ-ప్యాక్ సేవలు కొనసాగుతున్నాయి. ఇకపై ఈ సంస్థ సేవలు అధికార పార్టీలో మరింత కీలకం కాబోతున్నాయి. ఐ-ప్యాక్ నివేదికల దెబ్బకి ఇప్పటికే వర్క్ షాప్ పేరుతో పలువురు ఎమ్మెల్యేల తీరుపై సీఎం జగన్ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఒక్కోఎమ్మెల్యేకి ఒక్కో ప్రతినిథిని నియమించనున్నారు. మరో 10 రోజుల్లో వీళ్లంతా ఎమ్మెల్యేల వద్ద విధుల్లో చేరనున్నట్లు సమాచారం. తాజా నిర్ణయంతో ఎమ్మెల్యేలు, మంత్రులకు టెన్షన్ మొదలైంది.

  ఇప్పటికే ఆరోగ్యకరమైన పోటీ అంటూ ఇప్పటికే చాలా చోట్ల శాసనసభ్యులు , ఇన్ ఛార్జులకు పోటీగా పార్టీ కో-ఆర్డినేటర్లను రంగంలోకి దింపిన జగన్ వారికి తోడు తాజాగా ఐ-ప్యాక్ ప్రతినిధులను పంపిస్తున్నారనే వార్తలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. వీరంతా ఆయా నియోజకవర్గాల్లోనే ఎమ్మెల్యేలతో పాటే తిరుగుతూ వారి పనితీరుపై రోజువారీ నివేదికలను పార్టీ అధిష్టానానికి చేరవేయనున్నారు. అంటే ఎమ్మెల్యేలు, మంత్రుల వెంట నిరంతర నిఘా ఉండబోతోంది.

  ఇది చదవండి: ఏపీ సీఎంఓలో కోవర్టులున్నారా..? ఆ పార్టీకి సమాచారం లీక్.. ఆ వ్యక్తిపైనే అనుమానం..!

  ఇప్పటివరకు గడప గడప కి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏవరైనా తమ అవినీతిని ప్రశ్నించినా, పధకాలు అందడం లేదని ఫిర్యాదు చేసినా వారిని పోలీసుల సహాయంతో నయానో భయానో బెదిరించి ఆ విషయాలేవి బయటికి పొక్కకుండా అంతా సవ్యంగా ఉందంటూ కలరింగ్ ఇచ్చుకుంటున్న చాలా మంది నేతలకు ఇది గడ్డు పరిస్థితే అని చెప్పాలి. ఇంతకాలం తమ నియోజకవర్గంలో ఏం జరిగినా బయటికి తెలియకుండా స్థానిక మీడియా ప్రతినిధులను, ప్రతిపక్షాలను ఆఖరికి సోషల్ మీడియ లో పోస్టులు పెట్టేవారిని సైతం కట్టడి చేస్తూ తమ ఇష్టం వచ్చిన రీతిన వ్యవహరిస్తున్న చాలామందికి సీఎం నిర్ణయం ఒకింత షాకింగ్ గా మారింది.

  ఇది చదవండి: రైతులకు అలర్ట్‌..! త్వరగా ఈ-కేవైసీ చేయించుకోండి..! లేకపోతే ఈ పథకాలు రానట్లే..!

  చాలా నియోజకవర్గాలలో ప్రభుత్వ పధకాలపై ప్రజలలో సదాభిప్రాయం ఉన్నప్పటికీ స్థానిక నాయకుల అవినీతి, అక్రమ వసూళ్ళ దెబ్బకి పార్టీపై ప్రజలలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందనేది వైసీపీ నాయకత్వం ఆలోచనగా ఉంది. ఇక ఎన్నిసార్లు చెప్పినా పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇచ్చేది లేదని జగన్ నేరుగానే క్లారిటీ ఇచ్చారు. ఐనా సరే కొందరు ఎమ్మెల్యేలు ఏ మాత్రం తమ పనితీరు మార్చుకోకపోవడం విచిత్రం.

  ఐ.ప్యాక్ నిఘా నేత్రం తమని నీడలా వెంటాడటం పార్టీలో తమ పరిస్థితి పెనం మీది నుండి పొయ్యిలో పడినట్లు అవుతుందని పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారట. ఐ-ప్యాక్ ప్రతినిధులు నేరుగా ఎంట్రీ ఇస్తే అనుయాయులు కూడా దూరమవుతారని, అప్పుడు నియోజకవర్గంలో తమకున్న ఆ కాస్త పట్టుకూడా కోల్పోయి పూర్తిగా దెబ్బతింటామని కొందరు ఆందోళన చెందుతున్నట్లు టాక్.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP Politics, Ysrcp

  ఉత్తమ కథలు