Home /News /andhra-pradesh /

AP POLITICS INVITATION TO EX CM CHANDRABABU NAIDU FOR ATTEND PM MODI MEETING IN JULY 4TH AT BHEEMAVARAM NGS GNT

Chandrababu: ప్రధాని సభకు చంద్రబాబుకు ఆహ్వానం.. స్వయంగా ఫోన్ చేసిన కేంద్ర మంత్రి.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

మోదీ సభకు చంద్రబాబుకు ఆహ్వానం

మోదీ సభకు చంద్రబాబుకు ఆహ్వానం

Invitation for Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.. తెలుగు దేశం అధినేత చంద్రబాబు అంటే.. బీజేపీ కేంద్ర పెద్దలకు ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది. అందుకే పొత్తుల విషయంలో ముందడుగు పడడం లేదనే రాజకీచ వర్గాల టాక్.. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ పాల్గొనే భీమవరం సభకు చంద్రబాబుకు ఆహ్వానం లభించింది. కానీ చంద్రబాబు మాత్రం హాజరు కావడం లేదు.. ఆ ట్విస్ట్ కారణం ఏంటంటే?

ఇంకా చదవండి ...
  Invitation for Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ (Andhra Prades) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే ప్రస్తుతం పీలో రాజకీయ పొత్తులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ (TDP),  జనసేన (Janasena), బీజేపీ (BJP) మూడు కలిసి బరిలో దిగుతాయన ప్రచారం ఉండేది. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu)సైతం మొదట అదే అభిప్రాయంతో ఉండే వారని టాక్. అయితే ఈ పొత్తుల ప్రయత్నానికి ఆదిలోనే బీజేపీ బ్రేక్ వేసింది. చంద్రబాబుతో కలిసి ఎన్నికకు వెళ్లడం కంద్ర పెద్దలకు ఇష్టం లేదని.. ఏపీ బీజేపీ నేతలు (AP BJP Leaders) చెబుతూ వచ్చారు. కేవలం టీడీపీతో కలసి పోటీ చేయకపోవడమే కాదు.. అటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు సైతం రూట్ మ్యాప్ లో అదే చెప్పారని తెలుస్తోంది. 2024 గురించి పెద్దగా ఆలోచించవద్దని.. వైసీపీ లేదా టీడీపీ గెలిచినా నష్టం లేదని.. ప్రస్తుతం జగన్ తో వైరం పెట్టుకునే పరిస్థితి లేదని.. ఆ రూట్ మ్యాప్ లో చెప్పినట్టు టాక్. అవసరం అయితే పార్టీకి రాజకీయంగా.. ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్టు టాక్. అలాగే చంద్రబాబు నాయుడ్ని నమ్మే పరిస్థితి లేదని.. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీతో కలిసి బీజేపీపై కుట్రలు చేసిన సంగతిని బీజేపీ పెద్దలు రూట్ మ్యాప్ లో వివరించినట్టు నట్టు సమాచారం. ఇలా టీడీపీకి బీజేపీకి మధ్య పూడ్చలేనంత అగాథం ఉందని అభిప్రాయపడుతున్న వేళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

  ప్రధాని మోదీ భీమవరంలో వచ్చే నెల 4న పర్యటించబోతున్నారు. విప్లవవీరుడు అల్లూరి సితారామరాజు 125వ జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన భీమవరం వస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహం ఏర్పాటు చేసి నివాళులు అర్పించబోతున్నారు. ఈ కార్యక్రమానికి అధికార వైసీపీతో పాటు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపుతున్నారు.  ఇందులో భాగంగా బద్ధ శత్రువుగా భావిస్తున్నచంద్రబాబుకు ప్రధాని మోడీ భీమవరం టూర్ కు హాజరు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాల్లో పాల్గొనాలని అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపుతున్న కేంద్రం.. ఇందులో భాగంగా చంద్రబాబును కూడా ఆహ్వానిస్తూ లేఖ రాశారు. అంతే కాదు కిషన్ రెడ్డి పేరుతో రాసిన ఈ లేఖ అందిన తర్వాత .. నేరుగా చంద్రబాబుకు కిషన్ రెడ్డే స్వయంగా ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని మోడీ హాజరువుతున్న కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. చంద్రబాబుకు కిషన్ రెడ్డి లేఖ ఈ నెల 27న టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర సాంస్కతిక వ్యవహారాల మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కానీ లేఖలో ఓ ట్విస్ట్ ఇచ్చారు.

  ఇదీ చదవండి : ఒక్క క్లిక్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. సైబరర్ నేరాల నుంచి తప్పించుకోవాలంటే.. ఇలా చేయండి

  ఆ లేఖలో మన్యం వీరుడిగా దేశంలో పలు రాష్ట్రాలు గర్వించే అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని కేంద్రం ఈసారి అధికారికంగా నిర్వహిస్తోందని, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దీన్ని చేపడుతున్నట్లు తెలిపారు. భీమవరంలో ప్రధాని మోడీ హజరవుతున్న ఈ కార్యక్రమానికి.. మీ పార్టీ తరపున ఓ ప్రజాప్రతినిధిని పంపాలని కోరారు. అయితే 2019 తర్వాత ఇలా చంద్రబాబుకు బీజేపీ నుంచి ఆహ్వానం రావడం ఇదే తొలిసారి గతంలో టీడీపీ-బీజేపీ 2014లో కలిసి పోటీ ఉమ్మడిగా కేంద్ర, రాష్ట్రాల్లో విజయం సాధింఛాయి. అలాగే కేంద్రంలో మోదీ కేబినెట్ లో ఇద్దరు టీడీపీ మంత్రులకు అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీ తరఫున ఇద్దరు మంత్రులకు చంద్రబాబు అవకాశం కల్పిచారు. ఆ తర్వాత రాజకీయ కారణాలు.. ప్రత్యర్థి పార్టీ వ్యూహాల కారణంగా.. విభజన హామీలపై కేంద్రాన్ని టార్గెట్ చేసి చంద్రబాబు కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత తిరిగి బీజేపీతో స్నేహం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు ఇన్నాళ్లకు మోడీ ఆహ్వానం పంపారు.

  ఇదీ చదవండి : పదో తరగతి ఫెయిల్‌ అయినా... జీవితంలో సక్సెస్‌ అయ్యాడు..! ఎలా సక్సెస్ అయ్యాడంటే?

  ఆహ్వానం అయితే పంపారు కానీ.. అక్కడే మరో ట్విస్ట్ నెలకొంది. చంద్రబాబు ఈ సభకు హాజరు కావడం లేదు. అందుకు కారణం చంద్రబాబుకు కిషన్ రెడ్డి రాసిన లేఖలో ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబును నేరుగా మీరు రావాలని కోరకుండా మీ పార్టీ తరఫున ఓ ప్రజాప్రతినిధిని పంపాలని మాత్రమే కోరారు. దీంతో పార్టీలో ఈ విషయాన్ని చర్చించిన చంద్రబాబు... ఏపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడిని భీమవరం పంపాలని నిర్ణయించారు. అయితే ఇక్కడ కావాలనే బీజేపీ పెద్దలు ఆ కండిషన్ పెట్టారా అనే చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు మోదీని కలవడం ఇష్టం లేదని.. అందుకే నేరుగా మీరు రండి అనకుండా.. మీ ప్రతినిధిని పంపించండి అంటూ లేఖ రాసినట్టు సమాచారం. అలాంటప్పుడు చంద్రబాబు పిలవని పేరంటానికి వెళ్లలేరు.. అలాగే బీజేపీ తనపై విమర్శలు కూడా లేకుండా చేసుకుంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Bjp, Chandrababu Naidu, Narendra modi, TDP, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు