హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP Politics: అధినేత మాటే శాసనం అనే పార్టీకి ఇప్పుడేమైంది.. సీఎం జగన్ కు పెరుగుతున్న తలనొప్పులు

YCP Politics: అధినేత మాటే శాసనం అనే పార్టీకి ఇప్పుడేమైంది.. సీఎం జగన్ కు పెరుగుతున్న తలనొప్పులు

సీఎం జగన్ (పాత ఫొటో)

సీఎం జగన్ (పాత ఫొటో)

YCP Politics: వైఎస్ఆర్సీపీ అంటే.. బాస్ ఎస్ అంటే ఎస్.. నో అంటే.. ఆయన మాటే శాసనం.. ఆయన కళ్ల సైగ చేస్తే చాలు ఎక్కడి వారు అక్కడ నిలబడాల్సందే.. అలాంటి పార్టీకి ఇప్పుడు ఏమైంది.. దాదాపు అన్ని జిల్లాల్లో అసమ్మతి రాగం బుసలు కొడుతోంది. ప్రధాన నేతలు.. మాజీ మంత్రులు సైతం ఆయన ఆదేశాలను ఎందుకు లెక్క చేయడం లేదు.. పాలనపై ఫోకస్ చేస్తున్న సీఎం జగన్ కు పార్టీ పరంగా తలనొప్పులు తప్పవా?

ఇంకా చదవండి ...

  YCP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ (YCP )లో అధినేత ఎంత అంటే అంతే.. ఆయనకు ఎదురు చెప్పాలన్నా.. సొంతగా నిర్ణయాలు తీసుకోవాలన్న పార్టీ నేతలు భయపపడతారు.. బాస్ ఎస్ అంటే ఎస్.. నో అంటే నో.. అధినేత మాటకు తిరుగే ఉండదు.. ఆయన మాటే శాసనం. క్రమశిక్షణ కలిగిన పార్టీ. కట్టుదాటితే నేతల పని అంతే. ఇప్పటి వరకు అధికార వైసీపీ గురించి.. అందరూ చెప్పిన వ్యాఖ్యలు ఇవి. కానీ ప్రస్తుతం వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. అన్ని పార్టీల మాదిరినే.. అధికార పార్టీలో పరిస్థితి ఉంది. ఆ పార్టీ కూడా అన్ని రాజకీయ పక్షాల మాదిరిగా గడ్డు పరిస్థితులను ఎదుర్కోంటోందా..? అన్ని పార్టీల మాదిరిగా నేతలు బహిరంగంగానే తిట్టుకొంటున్నారు. కొట్టుకొని రచ్చకెక్కుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అధికారంలోకి వచ్చిన మూడేళ్లు పూర్తైనంత వరకు.. ప్రత్యర్థి  పార్టీలను తిట్టి తిట్టి విసుగు వచ్చింది ఏమో..? ఇప్పుడు రూటు మార్చారు. సొంత పార్టీ నేతలపైనా నోరు పారేసుకుంటున్నారు. పార్టీలో మేమంటే మేము అంటూ ఆధిపత్యం చెలాయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు రోడ్డున పడుతున్నాయి. దీంతో త్వరలో ఎన్నికలు ఉంటాయనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ అసమ్మతి రాగాలు.. అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మొన్నటి వరకు మోనార్క్ అనేలా ఉండే పార్టీలో పరిస్థితి ఇప్పుడు ఎందుకిలా మారింది.

  దాదాపు చాలా జిల్లాల్లో అదే పరిస్థితి..

  రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలోనూ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లోనూ అదే పరిస్థితి. కంచుకోట లాంటి నియోజకవర్గాల్లోనూ వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఏ క్షణమైనా ఎన్నికలు ఉండొచ్చనే ప్రచారం జరుగుతుండడంతో.. నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా విభేదాలు ముదురుతున్నాయి. టిక్కెట్ రాదన్న అభద్రతా భావంతో ఒకరు, ఎలాగైనా టిక్కెట్ సాధించాలన్న ప్రయత్నంతో నేతలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ రచ్చకెక్కుతున్నారు. సొంత పార్టీ నేతలకే శత్రువులుగా మారుతున్నారు.

  ఇప్పటికే ముగ్గురు ఎంపీలు పార్టీ మారుతున్నారనే ప్రచారం ఉంది.. ఆ సంఖ్య ఎన్నికల సమయానికి పెరుగుతుందో.. లేక అధిష్టానం జాగ్రత్తపడి తగ్గిస్తుందో చూడాలి.. ఆ నేతలను వద్దు అనుకొని పార్టీ వదిలేసినా.. జనాల్లోకి రాంగ్ సిగ్నల్ వెళ్లే ప్రమాదం ఉంటుంది. తాజాగా కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి.

  ఇదీ చదవండి : గన్నవరంలో ఏం జరుగుతోంది? వంశీ-రాధ మధ్య ఏకాంత చర్చలు.. మ్యాటర్ అదేనా..?

  మూడేళ్లుగా సైలెంట్ గా ఉన్న బందరు నియోజకవర్గం.. కాస్త లైన్ క్రాస్ చేసింది. అటు ఎమ్మెల్యే.. ఇటు ఎంపీ.. తగ్గేదేలే అనే విధంగా వ్యవహరించడంతో పార్టీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మంత్రి విడదల రజినీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరూ కలిసి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్నది లేదు. తాజాగా ఇదే లిస్ట్ లో కృష్ణా జిల్లా కేంద్ర మచిలీపట్నం చేరింది. బందరు ఎంపీకి, ఎమ్మెల్యేకి మధ్య సైలెంట్ గా సాగుతున్నవార్ కాస్తా.. ఇప్పుడు ఓపెన్ అయింది.

  ఇదీ చదవండి : పొత్తుల సంగతి ఓకే.. గ్లాసు గుర్తు మాటేంటి.? కామన్ సింబల్ పోరాటం ఫలించేనా..?

  ఇదే సమయంలో నెల్లూరులోనూ కీలక నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అధినేత చెప్పనా కీలక నేతలు గడపగడకు గడప దాటే పరిస్థితి లేదు. ఇక గన్నవరం రాజకీయాలు ఎలా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే.. వంశీకి టికెట్ ఇస్తే.. సహకరించేది లేదని యార్లగడ్డ, దుట్ట బహిరంగంగానే చెప్పేశారు.. రోడ్డుమీదకు రండి తానేంటో తెలుస్తుంది అంటూ వంశీ సవాల్ విసురుతున్నారు. ఇలా పార్టీలో దాదాపు చాలా నియోజకవర్గా్లో అదే పరిస్థితి ఉంది..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ysrcp

  ఉత్తమ కథలు