AP POLITICS INTERNAL POLITICAL FIGHT IN YCP EX MINSTER WILL NOT MEET NEW MINSTER GUDIVADA AMARNATH IN VIZAG NGS VSP
Minster Vs Ex minster: మంత్రి-మాజీ మంత్రి మధ్య చిచ్చు.. జిల్లాకు వచ్చినా పలకరింపులు ల్లేవ్
మంత్రి గుడివాడ అమర్ నాథ్
Minster Vs Ex minster: కేబినెట్ విస్తరణ తరువాత మొదలైన దుమారం ఆగడం లేదు.. ముందునుంచీ నేతల మధ్య ఉన్న గ్యాప్ రోజు రోజుకూ పెరుగుతుంది. ఇప్పటికే నెల్లూరులో మంత్రి-మాజీ మంత్రి మధ్య వివాదానికి తెరపడకముందే.. మరో జిల్లాల్లో వివాదం తెరపైకి వచ్చింది.
Minster Gudivada Amarnath Vs Ex minster Avanti Srinivas: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కేబినెట్ విస్తరణతో అధికార పార్టీలో అంతర్గత పోరు తీవ్రం అవుతోంది. అంతకుముందు వరకు అధినేత నిర్ణయమే శిరోధార్యం అంటూ మూకుమ్మడి రాజీనామాలు చేసిన మంత్రులు.. మాజీలు అయిన తరువాత కొత్త మంత్రులపై యుద్ధం ప్రకటిస్తున్నారు. దానికి ప్రధాన కారణం.. మొదట ఇద్దరు, ముగ్గుర్ని మాత్రమే తిరిగి కొనసాగిస్తామని చెప్పిన సీఎం జగన్ (CM Jagan).. 11 మందిని కొనసాగించడం ఈ అసమ్మతికి కారణం అవుతోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో మంత్రి కాకిని గోవర్దన్ రెడ్డికి వ్యతిరేకంగా.. మాజీ మంత్రి అనికల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారనే ప్రచారం ఉంది. ఇప్పు డు మరో కీలక జిల్లాల్లో అసమ్మతి రాగం మొదలైంది. మంత్రి, మాజీ మంత్రి మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి.
ఉమ్మడి విశాఖ జిల్లా (Visakha District)లో ఒకే ఒక్క మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్(Avanti Srinivas) తాజా గా తనను మంత్రివర్గం నుంచి తొలగించడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారనే ప్రచారం ఉంది. దీనిలో భాగంగా కొత్త మంత్రికి తనదైన నిరసన తెలుపుతున్నారనే అంశం తెరపైకి వచ్చింది. తాజాగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించి విశాఖ కు వచ్చిన గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath)కి స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా నేతలు అందరూ వచ్చినా.. అవంతి అనుచరులతో పాటు భీమిలి నుంచి మాత్రం ఎవ్వరూ హాజరుకాలేదు. దీంతో అమర్ నాథ్ వర్గం ఆరా తీసి అసలు విషయం తెలుసుకున్నట్టు టాక్. తాజా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్వయంగా కార్పొరేటర్లతో పాటు, ముఖ్య నేతలకు చెప్పినట్టు తెలిసింది. ఏకంగా అవంతినే ఫోన్ చేసి ఎవరూ వెళ్ళొద్దని చెప్పడం, మంత్రిగా అమర్ తొలిసారిగా విశాఖ వచ్చి మూడు రోజులు అయినా ఇద్దరూ కలవకపోవడంపై విశాఖలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
విశాఖ లో కాపు సామాజిక వర్గం నుంచి తననే పరిశీలించాలన్నది అవంతి అభిప్రాయం. పార్టీ అమర్ కి ప్రాధాన్యం ఇవ్వడాన్ని అవంతి పెద్దగా ఇష్టపడేవాడు కాదు. ఈ నేపథ్యంలో అవంతి కి పదవి తీసేసి అమర్ కి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతోంది అవంతి వర్గం. ఈ నేపధ్యంలోనే అమర్ కి ఆహ్వానం పలికేందుకు తన కార్పొరేటర్లను వెళ్ళొద్దని స్వయంగా చెప్పడం కూడా అందులో భాగమే అంటున్నారు. అమర్ ది అనకాపల్లి జిల్లా. కాబట్టి, అక్కడకి మాత్రమే పరిమితం కావాలని, అలా కాకుండా విశాఖ జిల్లాలో వేలుపెడితే సహించేది లేదన్నది అవంతి వర్గం తెగేసీ చెబుతోంది. తాను గతంలోనూ అనకాపల్లి నియోజకవర్గంలో వేలు బెట్టలేదని, ఇప్పుడు కూడా అలా కాకుండా విశాఖ జిల్లాలో అమర్ వేలుపెడితే.. ఎదురు తిరగాలి అన్నది అవంతి అనుచర వర్గం మాట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.