Ex Deputy CM: సాధారణంగా రాజకీయ నాయకులు అంటే.. పదవి ఉన్నప్పుడు ఒకలా.. పదవి లేనప్పుడు ఒకలా..? పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఒకలా..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా కనిపిస్తుంటారు. అయితే పార్టీ అధినేతకు వీర విధేయులుగా పేరు ఉన్నవారు మాత్రం.. పదవి ఉన్న లేకున్నా.. పార్టీకి విధేయత చూపిస్తుంటారు.. కానీ మాజీ డిప్యూటీ సీఎం అళ్లనాని (Ex Deputy CM Alla Nani) మాత్రం అందుకు భిన్నంగా మారారని ప్రచారం జరుగుతోంది. ఏలూరు ఎమ్మెల్యే (Eluru MLA) అయిన ఆయనకు సీఎం జగన్ (CM Jagan) కు వీర విధేయుడిగా గుర్తింపు ఉంది. మొన్నటి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవి పోవడంతో అలకపూనారా అని ఆయన అనుచరులే చర్చించుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం లేదు. అసలు ఏలూరులో ఇంత వరకూ ఆ ఊసే లేదన్నది అధికారపార్టీ శ్రేణులు చెబుతున్న మాట..? అయితే ఈ రెండేళ్లు జనంలో ఉండాలని.. గ్రాఫ్ పెంచుకోవాలని సీఎం జగన్ సూటిగా సుత్తిలేకుండా చెప్పినా.. ఆళ్ల నానిలో ఎందుకు చలనం లేదన్నది ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. తీరు మారని నేతలపై వేటు తప్పదని హెచ్చరించినా ఆయన పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు.. ఆయనకు ఇంతకీ ఏమైంది..?
గడప గడప కార్యక్రమం చేపట్టని జీరో పెర్‌ఫార్మెన్స్ లిస్ట్‌లో ఆళ్లనాని ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంఛార్జులు ఫీల్డ్‌లోకి వెళ్లాని సీఎం జగన్ చెప్పారు. అయితే ఏలూరులో మాత్రం.. ఆళ్లనాని కిందిస్థాయి నాయకులకు సరికొత్త ఆదేశాలు ఇచ్చారని చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..? సమస్యలన్నీ తీరాక తాపీగా తానొస్తానని కేడర్‌కు చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయితే కందకు లేని దురద కత్తికి ఎందుకని స్థానిక నేతలు ఎవరి పనుల్లో వారు బీజీగా ఉంటున్నారట. దీంతో ఏలూరులో వైసీపికి దిక్కు మొక్కు లేకుండా పోయిందని కేడార్ ఆవేదన చెందుతోంది.
అధినేతకు విధేయుడిగా ఉండే ఆళ్ల నాని.. జనంలో లేకుండా పోవడం స్థానికంగా వైసీపీకి పెద్ద సమస్యగా మారింది. జనంలో తిరగకుండా విధేయడ్నిఅని చెప్పుకుంటే ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. ఆయనపై అసంతృప్తి పీక్స్‌కు చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏలూరులో ఆళ్ల నానికి తప్ప మరొకరికి అవకాశం ఉండకూదనేట్టుగా మాజీ మంత్రి వైఖరి ఉంటుందని.. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వైసీపీ నాయకులు ఆగ్రహంతో ఉన్నట్టు ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆళ్లనాని పోటీ చేస్తారో లేదో అనే అనుమానం కొందరిలో ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: కౌలురైతుల పిల్లల బాధ్యత తీసుకున్న పవన్.. ఏం హామీ ఇచ్చారు అంటే..?
పార్టీ అజెండాలను పక్కనపెట్టి సొంత అజెండాతో ముందుకు వెళ్లిన కారణంతోనే ఆయనకు మంత్రి పదవి కొనసాగించలేదన్నది కొందరి వాదన. ఇప్పటికే కిందిస్థాయి నేతలు నాని పేరు చెబితే అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ విషయాలన్నీ తెలిసినా ఆళ్ల నాని ఎందుకు మనసు మార్చుకోవడం లేదో అంతుచిక్కడం లేదని పార్టీ పెద్దలు సైతం అభిప్రాయడపతున్నారని టాక్. ఇప్పటికే ఏలూరు వైసీపీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారట తాడేపల్లిలోని పార్టీ పెద్దలు. ఏలూరు విషయంలో వైసీపీ అధిష్ఠానమే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జోరందుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alla Nani, Andhra Pradesh, AP News, Eluru, Ycp