Home /News /andhra-pradesh /

AP POLITICS INTERNAL FIGHT BETWEEN HINDUPUR YCP LEADERS MLC FOLLOWERS ATTACKED ON COUNCILOR NGS

YCP Clashes: వైసీపీలో ముదిరిన వర్గపోరు.. కౌన్సిలర్‌పై ఎమ్మెల్సీ వర్గీయుల దాడి

హైకామండ్ కు తలనొప్పిగా వర్గపోరు

హైకామండ్ కు తలనొప్పిగా వర్గపోరు

YSRCP Clashes: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ వర్గ పోరు రచ్చ రచ్చఅవుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో విబేధాలు బయటపడ్డాయి. అవి ఇప్పుడు మరో లెవెల్ కు చేరుకున్నాయి.. నేతల మధ్య దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది.. ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారింది.

ఇంకా చదవండి ...
  YSRCP Clashes:ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ.. గత ఎన్నికల్లో అఖండ మెజార్టీతో విజయం సాధించింది. కానీ మూడేళ్లు తిరిగే సరికి.. పార్టీలో అంతర్గత కలహాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు ఢీ అండే ఢీ అంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఎంపీలకు-ఎమ్మెల్యేలకు పడడం లేదు. ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామ రాజు (MP Raghu rama Raju) రెబల్ గా తాయారు అయ్యారు. మరో ఇద్దరు ఎంపీలు పార్టీ మారుతారనే ప్రచారం ఉంది. బందరు, గన్నవరం పంచాయితీ (Gannavaram Politics) రోడ్డుపైకి వచ్చింది. మాజీ మంత్రి పెర్ని నాని (Ex Minster Perni Nani)పై ఎంపీ బాలసౌరి (MP Balasouri) బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆ వివాదం సద్దుమణగకముందే..?గన్నవరం రాజకీయాలు వేడి వేడిగా మారాయి. ఇదే సమయలో రాజోలు రాజకీయాలు రచ్చ అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన వెంటనే రుద్రరాజు వెంకట రామరాజు (Rudra Raju Venkata Ramaraju) టిడిపి (TDP) జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తాజాగా హిందూపురం వైసీపీలో వర్గపోరు భగ్గుమంది.

  చాలా జిల్లాల్లో వర్గ పోరు ఉన్నా.. హిందుపురంలో అది మరో లెవెల్ కు వెళ్లింది. ఇరువర్గాల మధ్య ఘర్షణలతో హిందూపురంలో ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. ఎమ్మెల్సీ ఇక్బాల్, వైసీపీ మాజీ సమన్వయకర్త రామకృష్ణారెడ్డి మధ్య ఆధిపత్య పోరు ముదిరింది. శుక్రవారం ఉదయం కౌన్సిలర్ ఇర్షాద్ పై ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులు దాడి చేశారు. ఎమ్మెల్సీ తీరుని నిరసిస్తూ 18 మంది కౌన్సిలర్లు, చౌలూరి రామకృష్ణారెడ్డితో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ ను ఎమ్మెల్సీ ఇక్బాల్, అతడి అనుచరులు అడ్డుకున్నారు. కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో రెండువర్గాల మధ్య తోపులాట జరిగింది. కౌన్సిలర్లపై ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులు రాళ్లు రువ్వారు. 

  మీడియా సమావేశం జరుగుతున్న సమయంలోనే.. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వారి అనుచరులు ఒక్కసారిగా ప్రెస్క్లబ్లో కి దూసుకుంటూ వచ్చారు. అక్కడ ప్రెస్ మీట్ నిర్వహిస్తన్న వర్గానికి వార్నింగ్ ఇచ్చారు. అక్కడితోనే ఆగక.. కరిపై ఒకరు దాడికి దిగారు.. ప్రెస్ క్లబ్ కిటికీలను తలుపులను గట్టిగా కొడుతూ రాళ్ల దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలో ఇదంతా జరిగినా.. వారు అడ్డుపడకపోవడం శోచనీయం అంటున్నారు స్థానికులు..

  ఇదీ చదవండి : కోనసీమ అల్లర్ల పిటిషన్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. అంబేద్కర్ కోనసీమ పేరు ఫైనల్ చేసిన కేబినెట్

  మరోవైపు 2019 వరకు హిందూపురం వైసీపీకి అన్నీ తానై నడిపిన నవీన్‌ నిశ్చల్‌ను కాదని ఇక్బాల్‌కు ఎన్నికల్లో ఛాన్స్‌ ఇవ్వడంతో ఆ పంచాయితీ కూడా కొనసాగుతోంది. మూడేళ్లయినా సమసి పోలేదు. ఇక్బాల్‌ పెత్తనాన్ని సహించలేని నవీన్‌ నిశ్చల్‌ వర్గం యాంటీగా మారింది. ఇటీవల ఇక్బాల్‌ విదేశాలకు వెళ్లిన సమయంలో అసమ్మతి వర్గమంతా ఏకమైంది. కర్నాటకలోని ఒక రిసార్ట్‌లో ప్రత్యేకంగా సమావేశమై కలకలం రేపింది. తర్వాత అలాంటి మీటింగ్స్‌ హిందూపురంలోనూ జరిగినట్టు వైసీపీ వర్గాల టాక్. చివరకు అంతా కలిసి తాడేపల్లి వెళ్లి పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. ఇక్బాల్‌పై ఫిర్యాదు చేశారు. అయినా అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Hindupuram, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు