Home /News /andhra-pradesh /

AP POLITICS INTERESTING INCIDENT IN AP POLITICS WILL JAGAN MOHAN REDDY CHANDRABABU PAWAN KALYAN MEETING AT RAJBHAVAN NGS

Jagan-Chandrababu-Pawan: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఒకే వేదికపై సీఎం జగన్-చంద్రబాబు-పవన్.. ఏం జరగనుంది?

 చంద్రబాబు, జగన్, పవన్.. (ఫైల్)

చంద్రబాబు, జగన్, పవన్.. (ఫైల్)

Jagan-Chandrababu-Pawan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, విపక్ష నేతల మధ్య కేవలం రాజకీయ దూరం మాత్రమే కాదు.. వ్యక్తిగత వైరమే నడుస్తోంది. అసలు ఒకరిని ఒకరు నవ్వుతూ పలకరించుకునే పరిస్థితే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ ఒకే వేదికపై వస్తుండడం ఆసక్తికరంగా మారింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    Jagan-Chandrababu-Pawan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో రచ్చ ఓ రేంజ్ లో ఉంది. ముఖ్యంగా అధికార వైసీపీ (YCP), విపక్ష పార్టీలైన టీడీపీ (TDP), జనేసన (Janasena) మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ప్రధాన మూడు పార్టీల అధినేతల మధ్య కేవలం రాజకీయ విబేధాలు, విమర్శలే కాదు.. వ్యక్తిగత వైరమే ఉంది. ఎంతలా అంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఉన్న వేదికను షేర్ చేసుకునేందుకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కానీ, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కానీ ఇష్టపడరు. ఇక చంద్రబాబు, పవన్ ఉన్న మీటింగ్ కు హాజరవ్వాలన జగన్ దూరంగానే ఉంటారు. పొరపాటున ఎదురెదురు పడి.. నవ్వుకుని చేయి చేయి కలిపే పరిస్థితి కూడా లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఆసక్తికర పరిణామం కాసేపట్లో జరగనుంది. సీఎం జగన్ - టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదిక మీదకు వస్తున్నారు. వీరిద్దిరతో పాటు పవన్ కళ్యాణ్ సైతం అక్కడికే రాబోతున్నారు. ఈ ముగ్గురు కీలక నేతలు ఇలా ఒకే వేదిక మీదకు రానుండటం రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది.

    స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ.. ఈ అరుదైన కలయిక జరగబోతోంది. సాధారణంగా ప్రతి ఏడాది.. స్వాతంత్ర్య దినోత్సవం నాడు గవర్నర్ రాజ భవన్ వేదికగా ఎట్ హోం నిర్వహించటం ఆనవాయితీ. రాష్ట్రంలో రాజకీయ -అధికార - పలు రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. వీరి గౌరవార్ధం గవర్నర్ తేనేటి విందు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ సీఎం జగన్ ..మంత్రులతో పాటుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు.. హైకోర్టు న్యాయమూర్తులు..జనసేన అధినేత చంద్రబాబు.. శాసనమండలి ఛైర్మన్.. శాసనసభ స్పీకర్ ను ఆహ్వానించారు.



    తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం ఈ ఎట్ హోం కార్యక్రమానికి ముగ్గురు అధినేతలు హాజరు అయ్యే అవకాశం ఉంది. పవన్, జగన్, చంద్రబాబు ఒకే వేదికపై ఎప్పుడూ చూడకపోయినా.. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకే వేదికపై కనిపించారు. అసెంబ్లీ వేదికగా ఇద్దరు కనిపించే వారు. అయితే ఆ మధ్య అసెంబ్లీలో తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆవేదనతో చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ సీఎం అయిన తరువాతే.. సభలో అడుగు పెడతానంటూ శపథం చేసారు. అప్పటి నుంచి సీఎం జగన్- చంద్రబాబు ఒకే వేదిక మీదకు వచ్చిన సందర్భాలు లేవు.

    ఇదీ చదవండి : ఆంధ్రా సరిహద్దులో భూతల స్వర్గం.. ఆకట్టుకుంటున్న పర్యాటక ప్రాంతం.. ప్రత్యేకతలు ఎన్నో?

    గత వారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇద్దరూ పాల్గొనాల్సి ఉన్నా.. చంద్రబాబు హాజరు కాగా, ముఖ్యమంత్రి మరుసటి రోజున జరిగిన నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఇద్దరూ ఈ సాయంత్రం రాజ్ భవన్ కు వస్తున్నట్లు సమాచారం. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హాజరు అవుతన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ - పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ప్రత్యక్షంగా కలుసుకోలేదు. మరోవైపు జిల్లా ఇంఛార్జ్ మంత్రి హోదాలో రోజా హాజరు కానున్నారని తెలుస్తోంది.

    ఇదీ చదవండి: స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి రోజా.. తన హిట్ సినిమా పాట రావడంతో హుషారు? ఎక్కడో తెలుసా?

    చంద్రబాబు - పవన్ పైన నిత్యం ఫైర్ అయ్యే రోజా.. ఇప్పుడు చంద్రబాబు సమక్షంలో మంత్రి హోదాలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అందుకే వీరందరి కలయిక ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దీంతో ఈ సాయంత్రం రాజ్ భవన లో జరిగే ఎట్ హోం పైన ఆందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Chandrababu Naidu, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు