AP POLITICS INTELLIGENCE FAILURE IN ANDHRA PRADESH GOVERNMENT SERIOUS ON THEIR FAILURE NGS
CM Jagan: మొన్న విజయవాడ.. నిన్న కొనసీమ.. ఇంటెలిజెన్స్ వైఫల్యాలతో జగన్ సర్కార్ కు టెన్షన్ టెన్షన్
కోనసీమ అల్రల్లలో 46 మంది అరెస్ట్
CM Jagan: ప్రభుత్వానికి పటిష్టమైన నిఘా విభాగం ఉంటుంది.. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే పసి గట్టాలి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా ఏదైనా కార్యక్రమం జరుగుతోంది అంటే ముందే ఊహించి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలి.. కానీ ఏపీలో నిఘా విభాగం పూర్తిగా ఫెయిలైందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇదే పరిస్థితి ఉంటే.. ఎన్నికల సమయంలో ఇబ్బందులు తప్పవని భయపడుతోంది.
CM Jagan: ఆంధ్ర్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ ప్రభుత్వం (YCP Government) అధికారంలోకి వచ్చినప్పటి.. నిఘా విభాగంపై ప్రత్యేక ఫోకస్ చేసింది. ముఖ్యంగా విపక్ష నేతల ఎత్తులు.. వ్యూహాలు పసికట్టడం.. కేసులు పెట్టడం తదితర విషయాల్లో నిఘా విభాగం విదేయత చాటునుకునే వచ్చిందనే ప్రచారం ఉంది. అయితే మొదట వైసీపీ ప్రభుత్వం స్టీఫెన్ రవీంద్ర (S Ravindra) ను తెలంగాణ (Telangana) నుంచి రప్పించడానికి పట్టుబట్టినా విఫలమైంది. కానీ పీఎస్ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu) వంటి విధేయుడైన అధికారిని నియమించి మరీ ఇంటెలిజెన్స్ (Intelligence) ను పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. కానీ ఫలితాలు మాత్రం ఆశించినంతగా ఉండడం లేదని అధిష్టానం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అందుకు రెండు ఘటనలను ఉదహరణగా చెబుతున్నారు. తాజాగా కోనసీమ (Konaseema), గతంలో ఛలో విజయవాడ (Vijayawada) వంటి ఘటనలు నిఘా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ నిఘా వైఫల్యాలు టెన్షన్ పెడుతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు అధికారులను మారుస్తున్నా ఫలితాలు మారడం లేదు. గతంలో స్ధానిక ఎన్నికల సమయంలో నిఘా వైఫల్యాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రభుత్వం, ఆ తర్వాత ఉద్యోగుల ఛలో విజయవాడ సమయంలో మరో భారీ వైఫల్యం ఎదుర్కోక తప్పలేదు. ఇప్పుడు కోనసీమ హింసను గుర్తించడంలోనూ నిఘా పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం పెద్దలు కాస్త సీరియస్ అయినట్టు సమాచారం..
ప్రధానంగా గతంలో ఛలో విజయవాడ ఉద్యోగులు పీఆర్సీ కోసం ఉద్యమిస్తున్న సమయంలో ఛలో విజయవాడ ఊహించని షాక్ ఇచ్చింది ప్రభుత్వానికి.. ఎందుకంటు ఎక్కడికక్కడ నిర్బంధాలు.. అరెస్టులు ఉండడంతో.. ఉద్యమాన్ని కట్టడి చేయొచ్చని భావించింది. ఉద్యోగులు ఆ సంఖ్యలో వస్తారని ఊహించలేకపోయింది. ఛలో విజయవాడ ఫెయిలవుతుందని.. దీంతో ఉద్యోగ సంఘాలు వెనక్కు తగ్గుతాయని ప్రభుత్వం భావించి అప్పటి వరకు ఒక్క మెట్టుకూడా కిందకు దిగలేదు.. కానీ ఊహించని విధంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున విజయవాడకు వచ్చి బీఆర్టీఎస్ రోడ్డును నింపేశారు. ఉద్యోగుల ఆందోళనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలకు దిగింది. అప్పట్లో ఈ నిఘా వైఫల్యాన్ని జగన్ కూడా సీరియస్ గానే పరిగణించారు.
ఆ మూల్యంనికి బందులుగానే డీజీపీ సవాంగ్ ఉద్వాసనకు కారణమనే ప్రచారం కూడా ఉంది. ఆ నిఘా వైఫల్యాన్ని ప్రభుత్వం ఇంకా మరిచిపోలేదు.. తాజాగా కోనసీమలో యువత అదే స్ధాయిలో పోలీసులకు షాకిచ్చింది. కేవలం 400 మంది పోలీసుల్ని అమలాపురంలో బందోబస్తుగా పెడితే దాదాపు 5 వేల మంది తరలివచ్చి పోలీసుల్ని చెల్లాచెదురుచేశారు. ఎస్పీ స్ధాయిలో అధికారులపై దాడులు చేశారు. అక్కడితోనే ఆగలేదు.. ఏకంగా మంత్రి నివాసాన్నే తగులబెట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసం దగ్ధమవుతుంటే పోలీసులు చివరి నిమిషంలో రంగంలోకి దిగి వారి కుటుంబాన్ని రక్షించారు. దీంతో నిఘా వైఫల్యం మరోసారి స్పష్టంగా కనిపించింది. అయితే ఇక్కడ విపక్షాల వాధన మాత్రం వేరేలా ఉంది.. ప్రభత్వమే.. ఈ హింసాత్మక ఘటనలు చేయించి.. తప్పును విపక్షాలపైకి రుద్దే పని చేస్తోందని ఆరోపిస్తున్నాయి. పోలీసులు జరిపిన చర్యగానే విపక్షాలు దీన్ని అనుమానిస్తున్నాయి.
మరోవైపు అధికార పార్టీ మాత్రం.. ఇదంతా విపక్షాల పని అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు వెనుకుండి ఇలాంటి అరచకాలను ప్రోత్సహిస్తున్నారని మంత్రులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ అదే నిజమై ఉంటే.. ఇక్కడ నిఘా వైఫల్యం చెందినట్టు ప్రభుత్వం ఒప్పుకోవాలి.. ఆ స్థాయిలో హింసకు వ్యూహం సిద్ధమైతే.. నిఘా వ్యవస్థ ఏమింది అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని ఇలాగే నిఘా వైఫల్యాలు వెంటాడాయి. ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ మరోసారి గెలుస్తుందని చంద్రబాబుకు ఇచ్చిన సమాచారం చరిత్రలో అతిపెద్ద వైఫల్యంగా నిలిచిపోయింది. తాజాగా ఇప్పుడు సైతం సీఎం జగన్ సర్వే రిపోర్టుల్లో వాస్తవాలు లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.