హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

President Polls 2022: ఏపీలో ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. ఎంతమంది ఓటు వేశారంటే..!

President Polls 2022: ఏపీలో ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. ఎంతమంది ఓటు వేశారంటే..!

ఓటు వేస్తున్న సీఎం జగన్

ఓటు వేస్తున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ (President Polls 2022) మొదలైంది. అసెంబ్లీలో జరుగుతున్న ఓటింగ్ లో మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ (President Polls 2022) పోలింగ్ ముగిసింది. అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ లో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. పోలింగ్ లో తొలిఓటును సీఎం జగన్ (AP CM YS Jagan) వేశారు. ఆయనతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రులు ఆర్కే రోజా (Minister Roja), తానేటి వనిత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే బూత్ లోకి వెళ్లిన జగన్.. అక్కడున్న సిబ్బందిని పలకరించి ఓటు వేశారు. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా తమ ఓట హక్కును వినియోగించుకున్నారు.

ఆ తర్వాత టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఓటు వేశారు. ఆయనతో పాటు అచ్చెన్నాయుడుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. టీడీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna), రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓటు వేయలేదు. బాలకృష్ణ సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉండగా.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యక్తిగత పర్యటన కోసం అమెరికా వెళ్లారు. దీంతో టీడీపీ తరపున రెండు ఓట్లు తక్కువగా పడ్డాయి.

https://twitter.com/i/status/1548902345068912640

ఇది చదవండి: పవన్ వర్సెస్ గంటా.. ఆసక్తిని రేకెత్తిస్తున్న గాజువాక వార్.. 2024లో హైలెట్ ఇదేనా..?


ఏపీలో 173 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ తరపున 151 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు హాజరయ్యారు. ఎంపీలందరూ పార్లమెంట్ భవనం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. వైసీపీ తరపున ఎంపీలకు ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి నేతృత్వం వహించారు.ఈ ఎన్నికల్లో వైసీపీతో పాటు టీడీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) కి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. గిరిజన మహిళను అభ్యర్థిగా నిలబెట్టడంతో ఇటు వైసీపీ, అటు టీడీపీ మద్దతు పలికాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో దాదాపు 61శాతం మంది మద్దతు ద్రౌపది ముర్ముకే ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా, భారత 15వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పోటీ పడ్డారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికైన దాదాపు 4,800 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూలై 21న పార్లమెంటులో కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. గెలిచిన అభ్యర్థి జూలై 25న తదుపరి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

First published:

Tags: Andhra Pradesh, President Elections 2022

ఉత్తమ కథలు