Home /News /andhra-pradesh /

AP POLITICS INDIA TV SURVEY ON WHAT IF LOK SABHA ELECTIONS WERE HELD TODAY PVN

Survey : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..ఏపీలో టీడీపీ,తెలంగాణలో బీజేపీకి పెరగనున్న సీట్లు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India TV survey : నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం 2014 నుండి కేంద్రంలో అధికారంలో ఉంది. గత ఎనిమిదేళ్లుగా,భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, స్థానిక/మునిసిపల్ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికలలో తన సత్తా చూపించింది.

ఇంకా చదవండి ...
India TV survey : నరేంద్ర మోదీ(Narendra Modi) నేతృత్వంలోని ప్రభుత్వం 2014 నుండి కేంద్రంలో అధికారంలో ఉంది. గత ఎనిమిదేళ్లుగా,భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, స్థానిక/మునిసిపల్ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికలలో తన సత్తా చూపించింది. అయితే ఇప్పటికిప్పుడు దేశంలో సాధారణ ఎన్నికలు(General Elections)జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై ఇండియా టీవీ టుడే ఓ సర్వే నిర్వహించింది. దేశ్ కీ ఆవాజ్ (వాయిస్ ఆఫ్ ది నేషన్) పేరుతో జరిపిన సర్వే(Survey) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. సర్వే ప్రకారం.. దేశంలో ఇప్పుటికిప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 41 శాతం, యూపీఏకు 28 శాతం, ఇతరులకు 31 శాతం ఓట్లు రావచ్చని సర్వే అంచనా వేస్తోంది.

మొత్తం 543 లోక్ సభ సీట్లకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ(NDA)కూటమికి ఏకంగా 362 సీట్లు(ఒక్క బీజేపీకే 326 సీట్లు) వస్తాయని,కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA)కూటమికి 97 లోక్ సభ సీట్లు(ఒక్క కాంగ్రెస్ కి 39 సీట్లు) వస్తాయని సర్వే తెలిపింది. చిన్న, ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులతో సహా ఇతరులు కలిపి 84 సీట్లు గెలుస్తారని సర్వే తెలిపింది. ఈ 84 లోక్ సభ సీట్లలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి 26,శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 2,అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి 2,అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి 2 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది.

Viral Video : సముద్రంలో న్యూక్లియర్ బాంబ్ పేలుడు..అగ్నిపర్వతం లావాలా ఆకాశంపైకి నీరు!

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కనిపించింది. అయితే 2019తో పోల్చితే ఆ పార్టీకి సీట్లు తగ్గనున్నాయి. ఓట్ల శాతం కూడా వైసీపీకి గతంలో కన్నా కొంత తగ్గనుంది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)కి 19 సీట్లు రానున్నాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 23 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో మూడు సీట్లు సాధించిన టీడీపీ(TDP) ఆరు సీట్లు గెలుస్తుందని సర్వే వెల్లడించింది. ఏపీలో బీజేపీ ఖాతా తెరవదని సర్వేలో స్పష్టమైంది. అయితే సర్వేలో జనసేన ప్రస్తావనే లేదు.



తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్(TRS)కు 2019 కంటే దాదాపు 8 శాతం ఓట్లు తగ్గనున్నాయి. 2019 లోక్ సభ ఎన్నిక్లలో టీఆర్ఎస్ కు 42 శాతం ఓట్లు రాగా.. తాజా సర్వేలో అది 34 శాతానికి పడిపోయింది. బీజేపీకి 2019లో కేవలం 20 శాతం ఓట్లు రాగా తాజా సర్వేలో అది ఏకంగా 39 శాతానికి పెరిగింది. బీజేపీ ఓటింగ్ 19 శాతం పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి 2019 లోక్ సభ ఎన్నికల్లో 30 శాతం ఓట్లు రాగా తాజా సర్వేలో అది కేవలం 14 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ ఓట్ల శాతం ఏకంగా 16 శాతం తగ్గింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 9 సీట్లు గెలవగా ఇప్పుడు ఎన్నికలు జరిగితే 8 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. గతంలో కంటే రెండు సీట్లు అధికంగా బీజేపీకి ఆరు సీట్లు రానున్నాయి. 2019లో కాంగ్రెస్ మూడు సీట్లు గెలవగా ఈసారి కేవలం రెండు వస్తాయని సర్వేలో తేలింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bjp, Survey, TDP, Trs, Ysrcp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు