Sriharikota Suicide Row: భారతదేశానికే గర్వకారణంగా చెప్పుకునే అంతరిక్ష ప్రయోగ కేంద్ర (SHAR)లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడ ఏదో జరుగుతోందనే అనుమానాలు పెరుగుతున్నాయి. జనవరి 17 తిరుపతి జిల్లా (Tirupati District) లోని శ్రీహరికోట (Sriharikota) లో సీఐఎస్‌ఎఫ్ సీఐ వికాస్‌సింగ్, కానిస్టేబుల్ చింతామణి ఆత్మహత్య (Suicide) కు పాల్పడితే.. ఆత్మహత్య చేసుకుని మరణించిన వికాస్ సింగ్‌ను చూడడానికి ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) నుంచి వచ్చిన ఆయన భార్య ప్రియా సింగ్ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించారు.
అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం జనవరి 18 నర్మద గెస్ట్ హౌస్‌లో ప్రియాసింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకొని వికాస్‌సింగ్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఉత్తర ప్రదేశ్ నుంచి అన్న, పిల్లలతో కలిసి శ్రీహరికోటకు చేరుకున్న ప్రియాసింగ్ భర్త మృతదేహం వద్ద కన్నీటిపర్యంతమయ్యారు.
వికాస్ సింగ్ స్వస్థలం బీహార్ . మొన్న సాయంత్రం షార్ మొదటి గేట్ దగ్గర గన్ తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం అతను కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. వికాస్ సింగ్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తాజాగా భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వీరి ఆత్మహత్యకు కారణాలు ఏంటి అన్నదానిపై విచారణ జరుగుతోంది. అయితే ప్రాథమికంగా ఆర్థిక పరమైన ఇబ్బందులతో వికాస్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు చింతామణి విధి నిర్వహణలో ఉండగానే ఉదయం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఇదీ చదవండి : ఆ మూడు చోట్లలో పవన్ పోటీ ఎక్కడ..? ప్రత్యర్థిగా అలీ ఢీ కొట్టేనా..?
సీఐ వికాస్ సింగ్, ప్రియాసింగ్ దంపతులకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. ఇక వీరిలో వికాస్ కుమార్తె వికలాంగురాలు కావడం శోకనీయం. 2015 బ్యాచ్‌కు చెందిన వికాస్ శిక్షణానంతరం ముంబయిలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తూ.. గతేడాది నవంబరులో బదిలీపై శ్రీహరికోటకు వచ్చారు. ముంబయిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో క్రమశిక్షణ చర్యలకు గురైనట్లు తెలిసింది. మరోవైపు వికాస్‌సింగ్ సెలవు కావాలని కొద్దిరోజులుగా అడుగుతున్నారు. అందుకు ఉన్నతాధికారులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని సహచర సిబ్బంది చెబుతున్నారు. వికాస్ ఆత్మహత్య చేసుకున్న గంటల వ్యవధిలోనే.. షార్‌లోని జీరోపాయింట్ రాడార్ సెంటర్‌కు సమీప అటవీప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని కానిస్టేబుల్ చింతామణి ఆత్మహత్య చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మహషముండ్ జిల్లా శంకర విలేజ్ అండ్ తాలూకాకు చెందిన చింతామణి ఈ నెల 10న కానిస్టేబుల్‌గా శ్రీహరికోటలో ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు.
ఇదీ చదవండి : రథసప్తమికి జోరుగా ఏర్పాట్లు.. ఆ రోజు ఇలా చేస్తే కోరికలు తీరినట్టే
ఈ క్రమంలోనే ఆమె మంగళవారం శ్రీహరికోటలోని నర్మద అతిథి భవన్‌లో ఆమె బస చేశారు. వికాస్ సింగ్ మృతిపై స్థానిక పోలీసులు రాత్రి ప్రియాసింగ్‌ను విచారించారు. అనంతరం అతిథి భవనంలో బంధువులతో కలిసి అక్కడే ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున ఆమె గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇద్దరు మృతదేహాలను శ్రీహరికోట నుంచి పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట సర్వజన ఆసుపత్రికి తరలించారు. భర్త మరణాన్ని తట్టుకోలేకే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Nellore Dist, Sriharikota