Minster Roja: ఆర్కే రోజా (RK Roja), కోడాలి నాని (Kodali Nani).., పేర్ని నాని (Perni Nani).. ఈ ముగ్గురుదీ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు.. ముగ్గురుకీ ఫైర్ బ్రాండ్ (Fire Brand) అనే ముద్ర ఉంది. అయితే ప్రస్తుతం రోజా మంత్రి (Minster Roja)గా ఉండడంతో అప్పుడప్పుడూ ఆమె వాయిస్ వినిపిస్తోంది. తనదైన పవర్ ఫుల్ డైలాగ్ లు పేలుస్తున్నారు. కానీ ఒకప్పుడు ప్రభుత్వ వాయిస్ గా ఉన్న.. పేర్ని నాని, కోడాలి నాని ఈ మధ్య సైలెంట్ అయ్యారు. దీంతో ఆ ఇద్దరికీ ఏమైందనే చర్చ కూడా పొలిటికల్ వర్గాల్లో ఉంది. ఈ విషయంలో ఇటీవల కొడాలి నానితో సీఎం జగన్ (CM Jagan) మాట్లాడారు. ఆయనతో మాట్లాడిన కేసేపటికే మళ్లీ కొడాలి నాని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawankalyan) లపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. కానీ ఆ తరువాత మళ్లీ సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ ముగ్గురు ఫైర్ బ్రాండ్స్ ఒకే ఫ్రేమ్ లోకి వచ్చారు. ఒకే చోట కలిసారు గతంలోనూ వీరంతా చాలాసార్లు కలిసి ఉండొచ్చు.. కానీ ఈ సారి వారి కలయికకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రోజా తొలి సారి ఇన్ ఛార్జ్ మంత్రి హోదాలో క్రిష్ణా జిల్లాకు వచ్చారు.
అదే సమయంలో మొన్నటి వజరుకు జిల్లాలో చక్రం తిప్పిన ఆ ఇద్దరు మంత్రులు.. ఇప్పుడు మాజీలు అయ్యారు. అప్పడు ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఇప్పుడు మంత్రి అయ్యారు. అంతేకాదు క్రిష్ణా జిల్లాకు ఇంచార్జ్ కూడా. ఆ పదవి ఇచ్చిన తరువాత తొలి సారిగా వచ్చిన రోజా కు కలెక్టర్...ఎస్పీతో సహా అధికారులు స్వాగతం పలికారు. అయితే, పార్టీలో రోజాతో పాటుగా ఫైర్ బ్రాండ్స్ గా ముద్ర ఉన్న మాజీ మంత్రులు కొడాలి నాని...పేర్ని నాని సైతం కలిసి అభినందనలు తెలిపారు.. ఈ సందర్భంగా ముగ్గురూ కాసేపు చర్చించుకున్నారు.
ఇంచార్జ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా కృష్ణా జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు @IamKodaliNani @perni_nani @siddharthkausha pic.twitter.com/2KxIFHO0Yv
— Roja Selvamani (@RojaSelvamaniRK) May 10, 2022
ఇదీ చదవండి : ఎక్కడా నిర్లక్ష్యం వద్దూ.. ముప్పు రాకుండా చూడండి.. కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశం
ఇదే సమయంలో జిల్లా మంత్రి జోగి రమేష్ సైతం అక్కడే ఉన్నారు. కానీ, గెస్ట్ సీట్లో రోజా ఉండగా..విజిటర్స్ సీట్లో మాజీ మంత్రులు కనిపించారు. ఏపీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన క్రిష్ణా జిల్లా నడిబొడ్డున చోటు చేసుకున్న ఈ సన్నివేశం...ఈ ఫొటో ఇప్పుడు వైసీపీ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. రోజా - కొడాలి నాని వైసీపీ లో తొలి నుంచి సఖ్యతగా ఉంటున్నారు. వీరు సీఎం జగన్ కు వీర విధేయులుగా గుర్తింపు పొందారు. ఎందుకంటే వారిద్దరి టార్గెట్ టీడీపీ అధినేత చంద్రబాబు.. అందుకే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా ఉంటుందనే టాక్ ఉంది. అయితే ఈ సందర్భంగా కాసేపు జిల్లా రాజకీయాలపై ముగ్గురు చర్చించుకున్నారు. కానీ కొద్ది సేపు ఉన్న కొడాలి నాని తరువాత వెళ్లిపోయారు. తన నియోజకవర్గంలో కార్యక్రమం కావటంతో స్థానిక ఎమ్మెల్యేగా పేర్ని నాని పూర్తిగా అక్కడే ఉన్నారు. జిల్లా మంత్రిగా జోగి రమేష్ తో కలిసి రోజా ఆ కార్యక్రమాలకు హాజరయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kodali Nani, Minister Roja, Perni nani, Ycp