హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: బీజేపీ ప‌వ‌న్ కు ఇవ్వ‌బోయే రూట్ మ్యాప్ ఏంటి? టీడీపీ నుంచి సీఎం ఆఫర్ వచ్చిందా?

Pawan Kalyan: బీజేపీ ప‌వ‌న్ కు ఇవ్వ‌బోయే రూట్ మ్యాప్ ఏంటి? టీడీపీ నుంచి సీఎం ఆఫర్ వచ్చిందా?

Pawan Kalyan mega plan: బీజేపీ ప‌వ‌న్ కు ఇవ్వ‌బోయే రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారా..? ఇదే సమయంలో ఇప్ప‌టికే ప‌వ‌న్ కు బాబు బంపర్ ఆఫర్ ఇచ్చారా..? జనసేన ఆవిర్భావ సభ తరువాత రాష్ట్ర రాజకీయ పరిణామాల వేగంగా మారుతున్నాయా..?

Pawan Kalyan mega plan: బీజేపీ ప‌వ‌న్ కు ఇవ్వ‌బోయే రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారా..? ఇదే సమయంలో ఇప్ప‌టికే ప‌వ‌న్ కు బాబు బంపర్ ఆఫర్ ఇచ్చారా..? జనసేన ఆవిర్భావ సభ తరువాత రాష్ట్ర రాజకీయ పరిణామాల వేగంగా మారుతున్నాయా..?

Pawan Kalyan mega plan: బీజేపీ ప‌వ‌న్ కు ఇవ్వ‌బోయే రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారా..? ఇదే సమయంలో ఇప్ప‌టికే ప‌వ‌న్ కు బాబు బంపర్ ఆఫర్ ఇచ్చారా..? జనసేన ఆవిర్భావ సభ తరువాత రాష్ట్ర రాజకీయ పరిణామాల వేగంగా మారుతున్నాయా..?

  M BalaKrishna, Hyderabad, News18.                                 Pawan Kalyan Mega Political Plan:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. ఓ వైపు విపక్షాలన్ని మహా కూటమిగా ఏర్పాడుతున్నాయనే సంకేతాలు అందుతున్నాయి. ఇదే తరుణంలో సింగిల్ గా యుద్ధానికి సిద్ధమైన సీఎం జగన్ (CM Jagan).. ఇప్పటికే ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఇంటింటికీ వెళ్తే గాని గెలవడం కష్టమని నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. దీంతో  జ‌న‌సేన (Janasena) ఆవిర్భాభ‌వ స‌భ త‌రువాత ఏపీలో పొలిటిక‌ల్ గ్రౌండ్ ఒక్క‌సారిగా హీట్ ఎక్కింది. జ‌న‌సేనాని ప్ర‌సంగం అటు జ‌న‌సైనికుల్లో కొత్త ఉత్స‌హాన్ని ఇస్తే.. రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులకు  చాలా ప్ర‌శ్న‌ల‌ని మిగిల్చింది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఎలా ఉండ‌బోతాయ‌నే ఉత్కంఠ ఇప్ప‌టి నుంచి మొద‌లైంది. త‌న ప్ర‌సంగంలో వైసీపీ (YCP) ప్ర‌భుత్వాన్ని ఏకిపారేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) మ‌రోసారి స‌మాదానం లేని ప్ర‌శ్న‌ల‌ను వ‌దిలేశాడు. ఏపీ ప్ర‌భుత్వం బాద్య‌త తాను తీసుకుంటాన‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిజేపీ త‌న‌కు రోడ్డు మ్యాప్ ఇస్తాన‌ని చెప్పింద‌ని దాని కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పడం.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

  ఇక ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను త‌న‌కి అనుకూలంగా ఉన్న‌వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కీల‌క పాత్ర పోషించ‌బోతున్నాడ‌ని చెప్పుకుంటుంటే. మ‌రో వైపు అధికార‌పార్టీ నేత‌లు ఎప్ప‌టిలాగే ప‌వ‌న్ ఆ రెండు పార్టీల‌కు ప‌ని చేస్తోన్నాడ‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్నాయి.  ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. అస‌లు బీజేపీ ప‌వ‌న్ కు ఎలాంటి రోడ్డు మ్యాప్ ఇవ్వాల‌నుకంది? ఈ అంశంపై ప‌వ‌న్ కు బిజేపీ పెద్ద‌ల‌కు జ‌రిగిన చ‌ర్చ‌లేంట‌నే అంశాలు ఇప్పుడు రాజ‌కీయంగా చ‌క్క‌ర్లు కోడుతున్నాయి.

  ఇదీ చదవండి : సాగర తీరంలో ఇకపై వెంకన్న దర్శనం.. ప్రత్యేకతలు ఇవే సాగరతీరంలో వెంకన్న దర్శనం

  ఒక వైపు బీజేపీ పెద్ద‌లు జ‌గ‌న్ కు స‌న్నిహితంగా ఉంటూనే మ‌రో వైపు వెనుక నుంచి ప‌వ‌న్ ను ఎగ‌దొస్తోన్నాయానే అనుమానాలు వ్య‌క్తం చేస్తోన్నారు వైసీపీ నేత‌లు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ , బీజేపీ, టీడీపీ క‌లిసి మ‌ళ్లీ పోటీ అవ‌కాశాలు ఉన్నాయ‌నే సంకేతాలు ప‌వ‌న్ త‌న స్పిచ్ లో ఇవ్వ‌డంతో మ‌రో వైపు తెలుగు త‌మ్మ‌ళ్లు కూడా పుల్ జోష్ లో ఉన్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబు నాయుడు గ‌తంలో జ‌న‌సేన‌తో పొత్తును ఉద్దేశించి ల‌వ్ ఎప్పుడు ఒన్ సైడ్ ఉండోద్ద‌ని రెండు వైపుల ఉండాల‌నే వ్యాఖ్యాలు కూడా చేశారు. తాజాగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు కాస్త స్నేహావాతావ‌ర‌ణం క్రీయేట్ చేయ‌డానికి దోహాద‌ప‌డుతుండ‌డంతో తెలుగు త‌మ్ముళ్లు చాలా ఆనందాన్ని వ్య‌క్తం చేస్తోన్నారు.

  ఇదీ చదవండి : కాలజ్ఞానంలో బ్రహ్మంగారూ చెప్పని వింత ఇది.. మామిడి కాయ అనుకుంటున్నారా..? గుడ్డుపై కాలేసినట్టే

  ఇదిలా ఉంటే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు కొద్ది నెల‌ల ముందే టీడీపీ ప‌వ‌న్ ను సంప్ర‌దించిన‌ట్లు జ‌న‌సేన వ‌ర్గాల స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తే మూడేళ్లు టీడీపీ వ్య‌క్తి ముఖ్య‌మంత్రిగా రెండేళ్లు ప‌వ‌న్ ముఖ్యమంత్రిగా ఉండే ప్ర‌తిపాధ‌న ప‌వ‌న్ ముందు పెట్టిన‌ట్లు స‌మాచారం అయితే మొద‌టి మూడేళ్లు టీడీపీ వాళ్లు త‌రువాత రెండేళ్లు జ‌న‌సేన అభ్య‌ర్ధి ముఖ్య‌మంత్రిగా ఉందామ‌ని టీడీపీ నుంచి ప్ర‌తిపాద‌న రావ‌డంతో ప‌వ‌న్ దానికి అంగీక‌రించ‌న‌ట్లు స‌మాచారం. మొద‌టి రెండేళ్లు జ‌న‌సేన ఉంటుంద‌ని ఆయ‌న ఖ‌చ్చితంగా చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

  ఇదీ చదవండి : మరోసారి ఆయన్నే నమ్ముకున్న అధినేత.. 2024లో విజయం కోసం కీలక బాధ్యతలు

  జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రం అభివృద్ది  చాలా వ‌ర‌కు పాతాలానికి వెళ్లిపోయింద‌ని ఈ నేప‌ధ్యంలో అంద‌ర్ని క‌లుపుకొని రాష్ట్రంలో నెల‌కున్న  ప‌రిస్థితిని చ‌క్క‌పెట్టాల‌ని ప‌వ‌న్ భావిస్తోన్న‌ట్లు స‌మాచారం. మ‌రో వైపు బీజేపీ నుంచి ప‌వ‌న్ కోరిన రూట్ మ్యాప్ విష‌యంలో కూడా ఆయ‌న ఖ‌చ్చితంగా ఉన్న‌ట్లు స‌మ‌చారం. కేంద్ర పెద్ద‌లు జ‌గ‌న్ తో స‌న్నిహితంగా ఉంటూనే రాష్ట్రంలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌మంటే త‌న వ‌ల్ల కాద‌ని ఈ విష‌యంలో బిజేపీ వైఖ‌రి ఒక రూట్ మ్యాప్ రూపంలో ఇవ్వాల‌ని దాన్ని బ‌ట్టి త‌న భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ రెడీ చేసుకుంటాని ప‌వ‌న్ బీజేపీ పెద్ద‌ల‌కే నేరుగా చెప్పిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి ప‌వ‌న్ అడిగిన రూట్ మ్యాప్ బీజేపీ ఇస్తోందా? అనేదే ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింది.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Bjp-janasena, Pawan kalyan, TDP

  ఉత్తమ కథలు