హోమ్ /వార్తలు /andhra-pradesh /

హుజూర్‌నగర్ తుది ఫలితం వెళ్లడయ్యేది మధ్యాహ్నానికే..

హుజూర్‌నగర్ తుది ఫలితం వెళ్లడయ్యేది మధ్యాహ్నానికే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని మార్కెట్ గోడౌన్లలో కౌంటింగ్ నడుస్తోంది. కేంద్ర పారామిలిటరీ బలగాల పహారాలో, ఫుల్లుగా సీసీ కెమెరాలు పెట్టి... ఓట్ల లెక్కిస్తున్నారు. మొత్తం 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. 22 రౌండ్‌ల పాటు ఓట్లను లెక్కించనున్నారు.

ఇంకా చదవండి ...

  తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నిక అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా మారింది. ప్రజలు ఎవరివైపు ఉన్నారో తెలుసుకోవడానికి ఈ ఎన్నికల ఫలితాన్ని పావుగా ఉపయోగించుకునేందుకు రాజకీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. అయితే, నేడు ఈ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లాలోని మార్కెట్ గోడౌన్లలో కౌంటింగ్ నడుస్తోంది. కేంద్ర పారామిలిటరీ బలగాల పహారాలో, ఫుల్లుగా సీసీ కెమెరాలు పెట్టి... ఓట్ల లెక్కిస్తున్నారు. మొత్తం 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. 22 రౌండ్‌ల పాటు ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ మధ్యాహ్నం 12 గంటలు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్ తుది ఫలితం మధ్యాహ్నానికే వెలువడే అవకాశం ఉంది. కాకపోతే, ఉదయం 10 కల్లా గెలుపు ఎవరిదో అంచనాకు వచ్చేయొచ్చు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది.

  ఉప ఎన్నికలో మొత్తం 2,36,842 మంది ఓటర్లున్నారు. 2,00,754 ఓట్లు పోలయ్యాయి. వాటిని లెక్కించడతోపాటూ... ప్రతి మండలానికీ 5 వీవీప్యాట్‌ల స్లిప్‌లను కూడా లెక్కిస్తారు. ఇదిలా ఉండగా, ఈ ఎన్నికలో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. TRS నుంచీ శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచీ పద్మావతిరెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచీ చావా కిరణ్మయి పోటీలో ఉన్నారు. ప్రధానంగా పోటీ సైదిరెడ్డి, పద్మావతిరెడ్డి మధ్యే ఉన్నా.... విజయం టీఆర్ఎస్‌దేనని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: Huzurnagar bypoll 2019, Telangana News, Telangana updates, Telugu news, Telugu varthalu

  ఉత్తమ కథలు