హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Vijayamma: వెళ్లాలా..? వద్దా..? లెక్కలేసుకుంటున్న అప్పటి మంత్రులు, సీనియర్లు.. విజయమ్మ సమావేశంపై తర్జన భర్జన!

YS Vijayamma: వెళ్లాలా..? వద్దా..? లెక్కలేసుకుంటున్న అప్పటి మంత్రులు, సీనియర్లు.. విజయమ్మ సమావేశంపై తర్జన భర్జన!

వైఎస్ ఫ్యామలీ రాజకీయాలు

వైఎస్ ఫ్యామలీ రాజకీయాలు

YS Vijayamma Meeting: హైదరాబాద్ లో వైఎస్ విజయమ్మ పిలుపు ఇచ్చిన సమావేశం అజెండా ఏంటి..? ప్రస్తుతం వివిధ పార్టీల్లో యాక్టివ్ గా ఉన్న నేతలు.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో మంత్రులు.. ఆయనతో సన్నిహితంగా ఉండే వారిని ఆమె స్వయంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇందులో వైసీపీ నేతలు కూడా ఉండడం విశేషం. మరి ఎంతమంది ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.. ? ఆ నేతలు ఏం అనుకుంటున్నారు?

ఇంకా చదవండి ...

YSR Family Politics: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ప్రస్తుతం వైఎస్ ఫ్యామిలీ (YS Family) రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా వైఎస్ విజయమమ్మ  ఆహ్వానాలు  ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 2న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) వర్దంతి సందర్భంగా.. ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులు, సన్నిహితంగా ఉండే నేతలకు విజయమ్మ ఆహ్వానాలు పంపారు. దీంతో అసలు ఈ ఆహ్వానాలు వెనుక అసలు ఉద్దేశం ఏంటని ఆ నేతలంతా చర్చించుకుంటున్నారు. ఆమె ఆహ్వానాన్ని మన్నించి.. వైఎస్ పై అభిమానంతో వెళ్లాలా..? వెళ్తే రాజకీయంగా ఎలాంటి పరస్థితులు ఎదుర్కోవాలి..? వెళ్లకపోతే.. ఎలాంటి పరిణామాలు ఉంటాయి.. అసలు వెళ్లాలా..? వద్దా అని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఒకలెక్క.. ఇప్పుడు మరో లెక్క.. అన్నాచెళ్లెల్ల బంధానికి ప్రత్యేక నిర్వచనంగా ఉండేవారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy).. వైఎస్ షర్మిల (YS Sharmila).. కానీ గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. అన్న వదిలిన బాణంగా చెప్పుకునే షర్మిల.. అన్న కాదు అన్నా.. ఆయన్ను వ్యతిరేకించి తెలంగాణ (Telangana)లో రాజకీయ పార్టీ పెట్టారు. అక్కడితోనే ఇద్దరి  మధ్య విబేధాలు ఉన్నాయన్న వార్తలకు బ్రేక్ పడలేదు. ఇటీవల వైఎస్ ఆర్ జయంతి (YSR Jayanthi) రోజు జగన్-షర్మిల ఒకరికి ఒకరు ఎదురు పడడానికి ఇష్ట పడలేదు. ఒకరు అక్కడ ఉన్నారని తెలిసి మరొకరు తమ ప్రోగ్రామ్ ను మార్చుకోవాల్సి వచ్చింది.  వేర్వేరు రాజకీయ పార్టీలు అంటే విబేధాలు సర్వసాధారణం.. అయితే ఆ విబేధాలు ఎలా ఉన్నా కచ్చితంగా రాఖీ పండుగ రోజైనా ఇద్దరూ కలుస్తారని వైఎస్ఆర్ అభిమానులు ఆశించారు. కానీ ఇటీవల రక్ష బంధన్ రోజు కూడా షర్మిల నేరుగా జగన్ కు రాఖీ కట్టలేదు. కేవలం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పి చేతులు దులుపుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు నిజమే అని మరోసారి రుజువు అయ్యింది. ఇదే సమయంలో వైఎస్ విజయమ్మ (YS Vijayamma) నిర్ణయం హాటాపిక్ గా మారింది.

వైఎస్ విజయమ్మ సమావేశం నిర్వహించనుండడం.. ఈ సమావేశానికి ఆమె భర్త, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి హయంలో మంత్రులుగా పనిచేసిన వారికి, వైఎస్ఆర్ సన్నిహితులకు ఈ సమావేశానికి ఆహ్వానాలు పంపారనే ప్రచారం గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ సమావేశానికి ఆహ్వానాలు అందుకున్న నేతలు వెళ్ళాలా.. వద్దా అనే సందిగ్ధంలో తర్జన, భర్జన పడుతున్నట్లుగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. సెప్టెంబరు 2న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విజయమ్మ హైదరాబాద్‌లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి మాజీ మంత్రులకు, కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ పదవులు అనుభవించిన నేతలకు, వైఎస్ఆర్ తో సన్నిహితంగా మెలిగిన నేతలకు ఆహ్వానాలు కూడా అందినట్లు తెలుస్తుండగా.. పార్టీలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నామని విజయమ్మ ఆహ్వానాలలో తెలిపినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.

వైఎస్ హయాంలో మంత్రులుగా పని చేసిన నేతలు వీరే..

ఏపీ నుంచి రోశయ్య (Konijeti Rosaiah), కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana), రఘువీరారెడ్డి (Raghuveera Reddy), గల్లా అరుణ కుమారి ( Gall Arun Kumari), ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy), పసుపులేటి బాలరాజు (Pasupuleti Balaraju ), బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), శత్రుచర్ల ( satrucharla), పిల్లి (Pilli Subhash Chandra Bos), పినిపె (Pinipe Viswarup), అహ్మదుల్లా ( Ahmadullah kadapa ), డొక్కా మాణిక్య వరప్రసాద్ (Dokka Manikya Varaprasad ) ఉన్నారు. వీరిలో ప్రస్తుతం బొత్స ఒక్కరే ఏపీలో మంత్రిగా ఉన్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah  కాంగ్రెస్), గీతారెడ్డి (Geeta Reddy కాంగ్రెస్), సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indhra Reddy టీఆర్ఎస్ మంత్రి), డీకే అరుణ ( D.K. Aruna బీజేపీ), సునీతా లక్ష్మారెడ్డి ( Sunitha Laxmareddy టీఆర్ఎస్), కొండా సురేఖ ( Konda Surekha కాంగ్రెస్), డి.శ్రీధర్ బాబు ( Sridhar Babu కాంగ్రెస్), కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy venkatreddy కాంగ్రెస్), దానం నాగేందర్ (Danam Nagender టీఆర్ఎస్), ముఖేష్ గౌడ్ (కాంగ్రెస్), దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha కాంగ్రెస్)లో ఉన్నారు.వీరిలో  సబితా  ఇంద్రా రెడ్డి తెలంగాణ మంత్రిగా ఉన్నారు.

వీరిలో దాదాపు చాలా మందిని స్వయంగా విజయమ్మ ఫోన్ చేసి ఆహ్వానించినట్టు సమాచారం. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు (K.V.P Ramachandra Rao), ఉండవల్లి అరుణ్‌కుమార్‌ (Undavalli Arunkumar), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ (D Srinivas)తోపాటు వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులకు కూడా విజయమ్మ స్వయంగా ఫోన్‌చేసి ఆహ్వానించినట్లు చెప్పుకుంటుండగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలు, ప్రస్తుత వైసీపీలో ముఖ్య నేతలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు కొందరు మాజీలు, ఏపీలో వైసీపీకి చెందిన నేతలు ఈ సమావేశంపై డైలమాలో ఉన్నారని చెప్పుకుంటున్నారు.

విజయమ్మ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ షర్మిల పార్టీ వ్యవహారాలలో కీలకంగా కనిపిస్తున్నారు. షర్మిల పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం సభలో విజయమ్మనే హైలెట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయా అనే ఆలోచనలో కొందరు వైసీపీ నేతలు సలహాలు, సూచనలు తీసుకొనే పనిలో ఉండగా.. తెలంగాణలో మరికొందరు సీనియర్ నేతలు కూడా స్పష్టత లేని రాజకీయాలలో వేలు పెట్టడం అవసరమా అనే ధోరణిలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. మరి ఈ సమావేశానికి ఎంతమంది నేతలు హాజరవుతారు.. అసలు సమావేశం ఉంటుందా.. లేక వైఎస్ఆర్ వర్ధంతి రోజున ఆయనకు నివాళితోనే సరిపెట్టేస్తారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Ys jagan, YS Sharmila, YS Vijayamma

ఉత్తమ కథలు