Home /News /andhra-pradesh /

AP POLITICS HOME MINISTER TANETI VANITHA SLAMS OPPOSITION PARTIES ON MP GORANTLA MADHAV CONTROVERSY FULL DETAILS HERE PRN GNT

AP Politics: అవన్నీ పెయిడ్ ఆర్టిస్టుల డ్రామాలు.. మహిళా నేతల ఆందోళనపై హోం మంత్రి కౌంటర్.. మాధవ్ వ్యవహారంపై హీటెక్కుతున్న పాలిటిక్స్

మంత్రి తానేటి వనిత (ఫైల్)

మంత్రి తానేటి వనిత (ఫైల్)

వైసీపీ (YSRCP) ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల వేడెక్కుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎంపీని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హోం మంత్రి తానేటి వనిత (AP Home Minister Taneti Vanitha) ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India
    వైసీపీ (YSRCP) ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల వేడెక్కుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎంపీని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హోం మంత్రి తానేటి వనిత (AP Home Minister Taneti Vanitha) ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ శాడిస్టు సైకాలజీని ప్రదర్శిస్తోందని ఆమె మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో.. తప్పు చేసినట్టు నిరూపణ అయితే కచ్చితంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియో అసలో, కాదో.. అన్నదానిపై ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని, ఆ నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. తప్పు ఎవరు చేసినా, తన, మన అన్న తారతమ్యం లేకుండా, తప్పును తప్పుగానే చూస్తామని చెప్పారు.

    ఒకవేళ ప్రభుత్వంపై బురదజల్లేందుకు, రాజకీయ కుట్ర కోణంలో భాగంగా, ఇటువంటి చర్యకు ఎవరైనా పాల్పడినట్టు తేలితే.. వారిపైన కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ వీడియో వ్యవహారంలో బాధిత మహిళల ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అయినా సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా, ఎంపీ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని చెప్పారు.

    ఇది చదవండి: ఏపీలో హీటెక్కిన కుల రాజకీయం.. కమ్మ వర్సెస్ కురబగా మారిన వ్యవహారం..


    రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని, మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయంటూ.. టీడీపీ మహిళా నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని తానేటి వనిత అన్నారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎంపీని కాపాడుతున్నట్టు, బాధిత మహిళకు అన్యాయం చేస్తున్నట్లుగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. వారి భాష, మాట్లాడే తీరు మహిళలు సిగ్గుపడేలా ఉందన్నారు.

    ఇది చదవండి: ఢిల్లీలో ఛాన్స్ వదులుకోని చంద్రబాబు.. ఆ సామెతను నిజం చేయబోతున్నారా..?


    అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వంపైగానీ విమర్శలు చేయడానికి ఏ అంశాలు లేవు కాబట్టే, ఇటువంటి చౌకబారు వీడియోలను పట్టుకుని, మహిళలను అడ్డు పెట్టుకుని జుగుప్సాకరమైన రాజకీయాలకు టీడీపీ తెరలేపిందని మంత్రి వనిత విమర్శించారు. అది మార్ఫింగ్ వీడియో అంటూ సంబంధిత ఎంపీనే కంప్లైంట్ చేశారని.., అతను తప్పు చేశాడు అని నిర్థారణ అయితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.



    ఈ సందర్భంగా టీడీపీ హయాంలో జరిగిన పలు ఘటనలపై తానేటి వనిత ప్రశ్నలు సంధించారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా ఎమ్మార్వోపై దాడి చేయడం, అప్పటి మంత్రి రావెల కిషోర్ బాబు.. ఒక ముస్లిం మహిళా ప్రజా ప్రతినిధిని నోటికొచ్చినట్లు మాట్లాడితే, మీడియా ముందుకు వచ్చి ఏడిస్తే.. ఆరోజున చంద్రబాబు ఏమి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అలాగే విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో.. మహిళలకు అప్పులిచ్చి, తీర్చలేని మహిళల్ని లైంగికంగా వేధింపులకు గురి, వీడియోలు తీస్తే.. అప్పడు ఆరోపణలు వచ్చిన బుద్దా వెంకన్న తదితరులపై మీరు ఏమి చర్యలు తీసుకున్నారని మంత్రి వనిత ప్రశ్నించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు