Home /News /andhra-pradesh /

AP POLITICS HOME MINISTER TANETI VANITHA MADE SENSATIONAL COMMENTS ON CRIMES AGAINST WOMEN AND GADAPA GADPAKU YSRCP PROGRAM FULL DETAILS HERE PRN GNT

AP Minister: ఏపీలో పోలీసుల కొరత.. హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు.. పార్టీ ప్రోగ్రామ్ పైనా క్లారిటీ..

హోం మంత్రి తానేటి వనిత

హోం మంత్రి తానేటి వనిత

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి.

    ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు లేవని, మహిళలకు రక్షణ కరవువైందంటూ ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా ఘటనలు ఏపీ కొత్త హోం మంత్రి తానేటి వనితకు కూడా చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. గత ఏడాది తాడేపల్లిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సీఎం జగన్ ఇంటికి సమీపంలోనే ఇలాంటి ఘటన జరగడం ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు గుంటూరు జిల్లా (Guntur District) లోనే వరుస ఘటనలు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. దిశ యాప్, దిశ చట్టం వంటివి తెచ్చామని ప్రభుత్వం చెబుతున్నా నేరాలు మాత్రం తగ్గడం లేదు.

    ఇటీవల పల్నాడు జిల్లా గురజాల రైల్వే స్టేషన్లో మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన మరువక ముందే బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో గ్యాంగ్ రేప్ జరగడం, బాధితురాలి భర్త రైల్వే పోలీసులను ఆశ్రయించినా వారు నిద్రలేవకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత చేసిన కామెంట్స్ ఇటీవల వివాదాస్పదవుతున్న సంగతి తెలిసిందే.

    ఇది చదవండి: ఇలాగైతే గెలవడం కష్టమే.. ఇకనైనా మారండి..! కీలక జిల్లా నేతలకు చంద్రబాబు క్లాస్..


    తాజాగా రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాల అంశంపై స్పందించిన మంత్రి పోలీసుల కొరత ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీలో పోలీసుల కొరత ఉందని అభిప్రాయపడ్డ ఆమె.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అదే కారణం కాదన్నారు. ఇక రేపల్లె రైల్వే స్టేషన్ ఘటన మద్యం మత్తులోనే జరిగిందన్నారు. నిందితులు బాధితురాలి భర్త వద్ద దొంగతనానికి వచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపారు.

    ఇది చదవండి: జనసేన కొత్త స్ట్రాటజీ.. ముల్లును ముల్లుతోనే తీయాలంటున్న పవన్.. సైనికులదీ అదే మాట..


    ఇక అధికార పార్టీ గడప గడపకు వాయిదా వేయడంపైనా హోం మంత్రి క్లారిటీ ఇచ్చారు. పార్టీ కార్యక్రమం వాయిదా వేయడానికి.., రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధం లేదన్నారు. అఘాయిత్యాల వల్లే కార్యక్రమాన్ని వాయిదా వేశామన్న వార్తలను ఆమె ఖండించారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందిస్తోందని.., ఆందోళనలకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు రాష్ట్రంలో జగన్ ను భయపెట్టేవారేలేరన్నారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు ఇవ్వాల్సిన సమాచారం సిద్ధం కాలేదని అందుకే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.

    ఇది చదవండి: మాట తప్పని.. మడమ తిప్పని వైసీపీ ఎమ్మెల్యే.., యువతికి కంటిచూపును ప్రసాదించిన కోటంరెడ్డి..


    ఇదిలా ఉంటే ఓ వైపు మహిళలపై అత్యాచారాలను సీరియస్ గా తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నా, ఇప్పటికే జరిగిన ఘటనలపై దర్యాప్తు కొనసాగుతున్నా.. అలాంటి ఘటనలు మాత్రం చోటు చేసుకుంటునే ఉన్నాయి. తాజాగా విజయనగరంలో అర్ధరాత్రి తలుపుకొట్టి ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు