Home /News /andhra-pradesh /

AP POLITICS HINDUPURAM MLA NANDAMURI BALAKRISHNA ATTEND MARRIAGE IN MUSLIM GETUP TO TDP LEADER HOUSE NGS

MLA Balakrishna: వేషం మార్చిన బాలయ్య..? ఆ గెటప్ లో పెళ్లికి హాజరవ్వడంతో అభిమానులు షాక్

వేషం మార్చిన బాలయ్య

వేషం మార్చిన బాలయ్య

MLA Balakrishna: హిందూపురంలో అలా నందమూరి బాలయ్యను చూసి అంతా షాక్ అయ్యారు.. నిత్యం కనిపించేలా కాకుండా వేషం మార్చి మరీ వచ్చారు.. దీంతో ఆ గెటప్ లో తమ అభిమాన హీరోను చూసి ఆనందం వ్యక్తం చేశారు ఫ్యాన్స్.. ఆలా వేషం మార్చడానికి కారణం ఏంటో తెలుసా.??

ఇంకా చదవండి ...
    MLA Balakrishna: నందమూరి బాలకృష్ణ  (Nandamuri Balakrishna) అంటే పిచ్చి ప్రేమ చూపించే అభిమానులు లక్షల్లో ఉంటారు.. వారే కాదు ఆయన సైతం తనను నమ్మినవాళ్లపై అంతే ప్రేమ చూపిస్తారు.. వారి కోసం ఏదైనా చేస్తాను అనే రేంజ్ లో ఆయన అభిమానం ఉంటుంది. ముఖ్యంగా హిందూపురం (Hindupuram) ప్రజలు అన్నా.. నేతలన్నీ ఆయనుకు చెప్పలేనంత ప్రేమ.. అవకాశం వచ్చినప్పుడల్లా ఆ ప్రేమను చూపిస్తూ ఉంటారు. హిందూపురం నుంచి వరసగా రెండుసార్లు బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్‌ సృష్టించారు. అయితే పెద్ద హీరోను కదా అని.. రాజకీయాలను లైట్ తీసుకోరు.. చాలామంది నేతల్లా ఎక్కడో ఉండి.. ఎన్నికలప్పుడు నియోజకవర్గానికి వెళ్లడం కాదు.. కేడర్‌కు అందుబాటులో ఉండటం.. ఎప్పటికప్పుడు హిందూపురం సమస్యలపై అప్‌డేట్‌గా ఉంటారు. వైసీపీ గాలి బలంగా ఉన్న 2019 ఎన్నికల్లో కూడా బాలయ్య భారీ మె మెజారిటీ సాధించారు. ఆ గెలుపునకు బాలయ్య ఇమేజ్.. స్థానికుల్లో ఆయనపై ఉండే నమ్మకమే కారణం. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నా.. సరే హిందూపురంపై ఫోకస్‌ చేస్తుంటారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వాటిమీద ఫోకస్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా హిందూపురం నేతలు అంటే ఆయనకు చెప్పలేనంత ప్రేమ..

    ఆ ప్రేమను మరోసారి ఇలా చూపించారు బాలయ్య. సాధారణంగా బాలకృష్ణ స్టయిలే వేరు. ఆయన ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించిన బాలయ్య సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఓ మైనారిటీ నేత ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు. సంప్రదాయ ముస్లిం వ్యక్తిలా ఆయన వేషం మార్చేశారు. అలా కొత్త గెటప్ లో బాలయ్యను చూసిన అభిమానులంతా ఆనందం వ్యక్తం చేశారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. బాలయ్యను గజ మాలతో సత్కరించారు.



    తమ ఇంట పెళ్ళికి వచ్చిన బాలయ్యకు ఆత్మీయ స్వాగతం పలికారు స్థానిక నేత బంధువులు, సన్నిహితులు. హిందూపురానికి చెందిన ఓ టీడీపీ మైనారిటీ నేత ఇంట జరిగిన వివాహ వేడుకకు బాలకృష్ణ ఇలా హాజరయ్యారు. అచ్చం ముస్లిం వ్యక్తిలా తయారై అక్కడికి వచ్చిన బాలయ్యను చూడడానికి అంతా ఉత్సాహం చూపారు. దీంతో స్థానికుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

    ఇదీ చదవండి : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కు వారితో తిప్పలు.. మారుస్తున్నా సేమ్ సీన్

    ఆఖండా ఇలా వచ్చాడు అంటూ నినాదలతో అక్కడ అంతా కోలాహలం కనిపించింది. ఆ తరువాత ఆయన వధూవరులకు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు అభివాదం చేశారు. బాలయ్యను ఫోటోలు తీయడానికి అభిమానులు ఉత్సాహం చూపించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Bala Krishna Nandamuri, Balakirshna, Hindupuram, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు