హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: నారా లోకేష్ అరెస్ట్.. శ్రీకాకుళంలో టెన్షన్ టెన్షన్.. ఏం జరిగిందంటే?

Nara Lokesh: నారా లోకేష్ అరెస్ట్.. శ్రీకాకుళంలో టెన్షన్ టెన్షన్.. ఏం జరిగిందంటే?

నారా లోకేష్

నారా లోకేష్

Nara Lokesh: శ్రీకాకుళం జిల్లా పలాసలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా తెలుగు దేశం నేతలు ఆందోళనకు దిగారు.. అసలు ఏం జరిగింది అంటే..?

 • News18 Telugu
 • Last Updated :
 • Srikakulam, India

  Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ని శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Partyu) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలాసకు వెళ్తున్న లోకేష్ ను కొత్త రోడ్డు జంక్షన్ లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవటాన్ని నిరసిస్తూ రోడ్డుపైనే ఆందోళనకు దిగారు. తరువాత లోకేష్ ను అరెస్ట్ చేసి రణస్థలం పోలీస్ స్టేషన్ కు తరలించారు. లోకేష్ తోపాటు కొంతమంది టీడీపీ నేతలను (TDP Leaders)  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆ తరువాత విశాఖ విమానాశ్రయానికి తరలించారు. అసలు వివాదానికి కారణం ఏంటంటే..? లోకేష్ శ్రీకాకుళం ఎందుకు వచ్చారంటే..?

  శుక్రవారం అర్థరాత్రి సమయంలో.. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఇళ్ల కూల్చివేత యత్నంతో వివాదం మొదలైంది. దాదాపు 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నవారి ఇళ్లను కూలుస్తామనడం వివదానికి ఆజ్యం పోసింది. 40 ఏళ్లు లేని అభ్యంతరం ఇప్పుడు ఏంటని..? టీడీపీకి ఓట్లు వేశారనే కారణంతోనే తమ ఇళ్లు కూల్చేస్తున్నారని స్థానికులు నిరసనకు దిగారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని నిలదీశారు.

  అయితే ఈ వ్యవహారానికి మంత్రి సీదిరి అప్పలరాజే కారణమని.. టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు తెలుగు దేశం పార్టీ నేతలు. మంత్రి సీదిరి అప్పల్రాజుపై ఎమ్మెల్యే బెందళ అశోక్‌ కామెంట్‌తో పరిస్థితి విషమించకుండా పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. నేతలు పలాసకు వెళ్లకుండా జిల్లావ్యాప్తంగా బలగాలను మోహరించారు. ప్రధాన రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. నిన్ననే శ్రీకాకుళం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కూన రవిని హౌస్‌ అరెస్టు చేశారు పోలీసులు. కూనరవి నివాసం దగ్గర భారీగా మోహరించారు.

  ఇదీ చదవండి : సువాసనలు వెదజల్లిన పుష్పయాగం.. వైభవంగా శ్రీవారి కల్యాణం.. ఘనంగా ముగిసిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు

  పలాస లక్ష్మీపురం దగ్గర ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడును అడ్డుకున్నారు పోలీసులు. ఆయనతోపాటు బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్తున్న రామ్మోహన్‌ నాయుడు, శిరీషను అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు అచ్చెన్నాయుడు. పలాసకు ఎందుకు వెళ్లొద్దో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పలాసకు ఎందుకు వెళ్లకూడదో లేఖ ఇవ్వాలని పోలీసులను నిలదీశారు. తాజాగా ఇప్పుడు నారా లోకేష్ ను సైతం అరెస్ట్ చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది.

  ఇదీ చదవండి : ప్రాణాలు తీస్తున్న సెప్టిక్ ట్యాంక్ లు.. క్లీన్ చేస్తూ ముగ్గురి దుర్మరణం

  పలాసలో భూకబ్జాలపై వైసీపీ, టీడీపీ సవాళ్లు, ప్రతిసవాళ్లు నిన్నటికే తీవ్ర రూపం దాల్చాయి. ఇదే సమయంలో నారా లోకేష్ వస్తారని సమాచారం అందింది. దీంతో పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని పోలీసులు భావించారు. పలాస - కాశీబుగ్గ పట్టణాల్లో ర్యాలీలకు, బహిరంగసభలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. తాను వస్తున్నానని తెలిసే పోలీసులు ఇలా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ను అడ్డుకున్న తరువాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. టీడీప నేతలంతా రోడ్లపైనే బైఠాయించి ఆందోళనలు చేపట్టారు.

  ఇదీ చదవండి : ఇవేం మిడతలురా బాబూ.. కన్నీరు పెడుతున్న అన్నదాతలు.. పంట కాపాడేదెలా..?

  పోలీసులపై మండి పడ్డా ఆయన.. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని ఆరోపించారు. సవ్యంగా పాలన ఉంటే పలాస ,శ్రీకాకుళం వెళ్తే పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. జే సీ బి రెడ్డికి కూల్చడాలు.. కుట్రలు చేయడం తప్పా ఏమీ తెలియదు అన్నారు. మముల్ని చూసి భయపడుతున్నారని లోకేష్ ప్రశ్నించారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, Srikakulam, TDP

  ఉత్తమ కథలు