హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP Vs TDP: పుట్టపర్తిలో టెన్షన్..టెన్షన్..వైసీపీ, టీడీపీ బాహాబాహీ

YCP Vs TDP: పుట్టపర్తిలో టెన్షన్..టెన్షన్..వైసీపీ, టీడీపీ బాహాబాహీ

టీడీపీ- వైసీపీ పోటా పోటీ

టీడీపీ- వైసీపీ పోటా పోటీ

Ycp Vs Tdp: ఏపీలోని సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హైటెన్షన్ నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, టీడీపీ లీడర్, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈరోజు సత్తెమ్మ టెంపుల్ వద్ద ప్రమాణానికి రావాలంటూ ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. దీనితో పోలీసులు అలెర్ట్ అయ్యి సత్తెమ్మ ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

Ycp Vs Tdp: ఏపీలోని సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హైటెన్షన్ నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, టీడీపీ లీడర్, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈరోజు సత్తెమ్మ టెంపుల్ వద్ద ప్రమాణానికి రావాలంటూ ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. దీనితో పోలీసులు అలెర్ట్ అయ్యి సత్తెమ్మ ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే సవాళ్లలో భాగంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పోలీసులను ఛేదించుకొని ఆలయ ఆవరణకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డిని టీడీపీ ఆఫీస్ వద్ద పోలీసులు నిర్బంధించారు.

ఆయనను బయటకు రానివ్వకుండా..బయట వారు లోపలికి పోకుండా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో టీడీపీ ఆఫీస్ వద్దకు వైసీపీ శ్రేణులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. దీనితో ఇరువర్గాల వారు గాయపడగా..వాహనాలు దెబ్బతిన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అలాగే పుట్టపర్తిలో పోలీస్ యాక్ట్ 30ను అమలులోకి తెచ్చారు. చివరకు మాజీ మంత్రి పోలీసుల కళ్లు గప్పి సత్తెమ్మ ఆలయానికి చేరుకోవడం గమనార్హం. ఆయన కారుపైకి ఎక్కి వైసీపీ నేతలకు సవాల్ విసరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక సత్తెమ్మ ఆలయం వద్దకు చేరుకున్న పల్లె రఘునాధరెడ్డి తోపులాట జరగడంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలుస్తుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో పుట్టపర్తి రాజకీయాలు వేడెక్కాయి. నియోజకవర్గంలో అభివృద్ధి, అవినీతిపై మాటలు కాస్త మంటలు రగిల్చాయి. సత్తెమ్మ తల్లి సాక్షిగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భూములు కబ్జా చేస్తున్నారని  మాజీ మంత్రి పల్లె రఘునాధ్ రెడ్డి ఆరోపిస్తుండగా..ఆయన హయాంలోనే భూకబ్జాలు జరిగాయని శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అభివృద్ధిపై ప్రమాణం చేయాలని ఇరువురు నేతలు పిలుపునివ్వడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

AP Cabinet : ఏపీలో ముగిసిన క్యాబినెట్ కసరత్తు.. ఇవీ కీలక నిర్ణయాలు

ఇరువురి నేతల పరస్పర సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగారు. అలాగే ఇరువర్గాలు ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకున్నారు. అలాగే పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీధర్  రెడ్డికి నచ్చజెప్పిన పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ప్రశాంతంగా ఉండే పుట్టపర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

First published:

Tags: Andhrapradesh, Ap, TDP, Ycp

ఉత్తమ కథలు