హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Somu Veerraju: టీడీపీతో పొత్తుకు పవన్ సై..! నై అంటున్న ఏపీ బీజేపీ? అధిష్టానం మాటేంటి

Somu Veerraju: టీడీపీతో పొత్తుకు పవన్ సై..! నై అంటున్న ఏపీ బీజేపీ? అధిష్టానం మాటేంటి

సోము వీర్రాజు

సోము వీర్రాజు

Somu Veerraju: వైసీపీని ఓడించడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని పవన్ అంటున్నారు. చర్చలకు కూడా సై అంటూ టీడీపీని ఆహ్వానిస్తున్నారు. కానీ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాత్రం టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదంటున్నారు.. మరి బీజేపీ జాతీయ నేతలు ఏం నిర్ణయం తీసుకుంటారు..?

ఇంకా చదవండి ...

Somu Veerraju: ఏపీలో కొత్త పొత్తులు పొడుస్తాయా..? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే.. రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని పార్టీలు కలిసి ఒకే వేదికపైకి రావాలి అంటున్నారు.  ఆ పొత్తుకు నాయకత్వం వహిస్తామంటున్నారు.. అవసరమైతే త్యాగాలకు సిద్ధం అని సంకేతాలు కూడా ఇచ్చారు.. జనసేన అధినేత పవన్ సైతం అదే అర్థం వచ్చేలా మాట్లాడారు.. రాష్ట్రానికి మంచి  చేయడానికి పొత్తులు అవసరం అన్నారు. ఓట్లు చీలిపోతే.. వైసీపీ గెలిచే అవకాశం ఉంటుందని.. అదే జరిగితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రస్తుతం తమకు బీజేపీతో పొత్తు ఉందని.. ఆ బంధం బలంగా ఉంది అన్నారు.. మోదీ, అమిత్ షాలపై అపార నమ్మకం ఉందని..  బీజేపీ రోడ్డు మ్యాప్ పై సరైన సమయంలో స్పందిస్తామన్నారు. బీజేపీ మిత్ర పక్ష నేత పవన్ వ్యాఖ్యలకు భిన్నంగా మాట్లాడారు బీజేపీ  ఏపీ చీప్ సోము వీర్రాజు.. ఆయనేమన్నారు అంటే..?

కుటుంబ పార్టీ, అవినీతి పార్టీతో కలిసేది లేదంటూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం తెగేసి చెప్తోంది. చంద్రాబబు త్యాగం చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలపైసోము సెటైర్లు వేశారు.  ఈ మధ్య కొంతమంది త్యాగానికి సిద్దంగా ఉన్నామని మట్లాడుతున్నారు. ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఆ త్యాగం గమనించాం. ఇక గమనించడానికి ఏపీ బీజేపీ శాఖ సిద్దంగా లేదని స్పష్టం చేశారు సోము వీర్రాజు.

ఇదీ చదవండి: టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్..! చర్చలు అవసరం ఉందన్న పవన్.. బీజేపీ పైనా క్లారిటీ? ఏమన్నారంటే?

అభివృద్ది, సంక్షేమం బీజేపీ దగ్గర ఉంది. కుటుంబ పార్టీలకోసం బీజేపీ త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు. త్యాగ ధనులంతా తెలుసుకోండి.. మేము అవినీతి రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు వ్యతిరేకం. 2024లో మోడీ నాయకత్వంలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: : చిరకాల మిత్రుడికి ఆత్మీయ వీడ్కోలు.. బొజ్జల పాడె మోసిన చంద్రబాబు

విజయవాడలో జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రైతులను సంస్కరించడంలో అధికారాన్ని అనుభవించిన కుటుంబ పార్టీలు ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు. రైతు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతును పూర్తిగా మోసగించారు.గతంలో చంద్రబాబు, నేడు జగన్ ప్రభుత్వాలు ఈ అంశంలో దగ చేస్తున్నాయి.

ఇదీ చదవండి: : సర్వ రోగాలను దూరం చేసే పండు.. అంతేకాదు రైతులకు కాసుల వర్షమే.. ఎలా సాగు చేయాలంటే?

అయితే సోము వీర్రాజు టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని చెబుతున్నారు.. తమ మిత్రపక్ష నేత పవన్ పొత్తులకు సై అంటూ స్పందిస్తున్నారు. మరి దీనిపై బీజేపీ జాతీయ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. పవన్ కు అల్ రెడీ బీజేపీ రూట్ మ్యాప్ ఇచ్చిందని సోము స్పష్టం చేశారు. అయితే పవన్ మాత్రం సరైన సమయంలో రోడ్ మ్యాప్ పై స్పందిస్తాను అన్నారు.. అంటే పవన్.. టీడీపీ పొత్తుపై బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించగలననే నమ్మకంతో ఉన్నారా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap bjp, AP News, AP Politics, Somu veerraju

ఉత్తమ కథలు