AP POLITICS HERE ARE THE COMPLETE DETAILS FOR TRAFFIC DIVERSIONS AND PARKING PLACES ON THE EVE OF YSRCP PLENARY FULL DETAILS HERE PRN
YCP Plenary-2022: వైసీపీ ప్లీనరీ కోసం ట్రాఫిక్ అంక్షలు.. వాహనాలు ఎలా వెళ్లాలంటే..! పార్కింగ్ ఏర్పాట్లు ఇవే..!
ప్రతీకాత్మకచిత్రం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ (YSR Congress Party Plenary-2022) నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు సీఎం జగన్ (CM YS Jagan) తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ప్లీనరీలోనే ఉండనుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ (YSR Congress Party Plenary-2022) నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు సీఎం జగన్ (CM YS Jagan) తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ప్లీనరీలోనే ఉండనుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లీనరీ పరిసర ప్రాంతాలతో పాటు అటు వైపు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ డీఐజీ కీలక ప్రకటన చేశారు. గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, పెద్దకాకాని వద్ద జాతీయ ఎన్‌హెచ్-16 వద్ద జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాలు, బహిరంగ సభకు సంబంధించి ట్రాఫిక్‌ను సక్రమంగా క్రమబద్ధీకరించడానికి వీలుగా కొన్ని ఆంక్షలు విధించినట్లు తెలిపారు. 09 -07-2022న ఉదయం 10:00AM గంటల నుండి రాత్రి 10:00PM గంటల వరకు. ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఉంటుందని తెలిపారు.
భారీ వాహనాల మళ్లింపులు :
అన్ని భారీ వాహనాలను 09.07.2022 ఉదయం 10.00 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ క్రింది ప్లీనరీ సదస్సు జరుగుతున్న హైవే పైకి రాకుండా మళ్లించారు.
1. చెన్నై వైపు నుండి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు మరియు ఇబ్రహీంపట్నం, నందిగామ, వైపుకు వెళ్ళు భారీ గూడ్స్ వాహనములు ఒంగోలు జిల్లా త్రోవగుంట వద్ద నుండి చీరాల-బాపట్ల-రేపల్లె-అవనిగడ్డ-పామర్రు-గుడివాడ-హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం మరియు ఇబ్రహీంపట్నం వైపుకు మళ్ళించారు.
2. గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బుడంపాడు X మిధుగా తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూరి బ్రిడ్జ్ మిధుగా అవనిగడ్డ, పామర్రు-గుడివాడ-హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు.
3. విశాఖపట్నం వైపు నుండి చెన్నై వైపు వెళ్ళు లారీలు, భారీవాహనములు హనుమాన్ జంక్షన్ వద్ద నుండి గుడివాడ – పామర్రు - అవనిగడ్డ – రేపల్లె- బాపట్ల – చీరాల - త్రోవగుంట – ఒంగోలుజిల్లా మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
4. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు లారీలు, భారీవాహనములు హనుమాన్ జంక్షన్ వద్ద నుండి నూజివీడు- మైలవరం – జి కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు.
5. హైదరాబాద్ వైపు నుండి విశాఖపట్నం వెళ్ళు లారీలు, భారీవాహనములు ఇబ్రహీంపట్నం వద్ద నుండి జి.కొండూరు – మైలవరం-నూజివీడు-హనుమాన్ జంక్షన్ వద్ద నుండి అనుమతిస్తారు.
6. చెన్నై వైపు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే multi-axel Goods వాహనాలను ఎటువంటి మళ్లింపు లేకుండా జాతీయ రహదారి కి సమీపంలోని చిలకలూరి పేట, ఒంగోలు మరియు నెల్లూరు వద్ద నిలిపివేయబడును. ఆ వాహనాలను రాత్రి 10 గంటల అనతరం వాహనాలను అనుమతిస్తారు.
7. విశాఖపత్నమ వైపు నుండి చెన్నై వైపు వెళ్ళే multi-axel Goods వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద మరియు పొట్టిపాటు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారికి సమీపంలో నిలిపివేయబడును. ఆ వాహనాలను రాత్రి10 గంటల అనoతరం వాహనాలను అనుమతిస్తారు.
ప్లీనరీ కి వచ్చే వారి వాహనాల పార్కింగ్ ప్రదేశం వివరాలు:
విజయవాడ నుండి ప్లీనరీ కి వచ్చు బస్సులు కొరకు కాజా టోల్ ప్లాజా వద్ధ గల RK Venuzia లేఅవుట్.
విజయవాడ నుండి ప్లీనరీ కి వచ్చు Cars/Autos/02 Wheelers కొరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.
గుంటూరు నుండి ప్లీనరీ కి వచ్చు బస్సులు కొరకు నంబూరు & కంతెరు రోడ్డు పై.
గుంటూరు నుండి ప్లీనరీ కి వచ్చు Cars/Autos/02 Wheelers కొరకు కేశవరెడ్డి స్కూల్, అమలోద్భవి హోటల్ & రైన్ ట్రీ అపార్ట్మెంట్స్ పక్కన పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.