Weather Update: ఆంధ్ర్రప్రదేశ్ (Andhra Pradesh) ను భారీ వర్షాలు ముంచెత్తుతూనే ఉన్నాయి. కేవలం ఒకటి రెండు రోజులు విరామం ఇచ్చి తరువాత భారీ వానలు ముంచెత్తుతున్నాయి. మళ్లీ మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) పడతాయి అని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సిత్రాంగ్ (Sitrang Cyclone) స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర ఈశాన్య దిశగా గంటకు సుమారు 21 కిలో మీటర్ల వేగంతో కదులుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన సిత్రాంగ్ తుఫాను బంగ్లాదేశ్ వైపుగా వెళ్లగా, ఏపీలో ఉన్న తేమని లాగి బంగ్లాదేశ్, ఈశాన్య భారత దేశం ప్రాంతాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయలో ప్రభావం చూపనుంది. ఈ సిత్రాంగ్ తుఫాను కారణంగా ఏపీ (AP), తెలంగాణ (Telangana) లో చలి తీవ్రతపెరుగుతోంది. వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పడుతున్నాయి. సిత్రాంగ్ తుపాను సోమవారం ఒడిశా (Odisha) తీరాన్ని చేరుకుంది. ఈ సిత్రాంగ్ తుఫాన్ బంగ్లాదేశ్ తీరం దాటే ముందు తీవ్రరూపం దాల్చొచ్చని భావిస్తున్నారు.. సిత్రాంగ్ ప్రభావంతో బెంగాల్, అసోంతో పాటు.. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని, దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
బుధవారం, గురువారం రెండు రోజుల పాటు.. ఒడిశా , పశ్చిమ బెంగాల్ , అసోం, అరుణాచల్ ప్రదేశ్ , నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈశాన్య రుతుపవనాల వర్షాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 29 నుంచి పరిస్ధితులు వర్షాలకు అనుకూలంగా మారతాయి. శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది.
ఈ అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దక్షిణ ఏపీలో అక్టోబర్ చివర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓవైపు వర్షాలు తగ్గినా, మరోవైపు రాత్రివేళ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఏపీలో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలుండగా, తెలంగాణలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. మరోవైపు సింత్రాంగ్ తుఫాను కారణంగా ఇప్పటికే మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక బంగ్లాదేశ్ లో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది.. సోమవారం బంగ్లాదేశ్లో విధ్వంసం సృష్టించిన తుఫాన్.. అక్కడ దాదాపు 11 మందిని బలిగొంది.
ఈశాన్య రాష్ట్రాలను సిత్రాంగ్ తుఫాన్ వణికిస్తున్నది. ఆసోం, పశ్చిమ బెంగాల్ సహా మేఘాలయ, మిజోరంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. సిత్రాంగ్ కారణంగా నాలుగు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Cyclone alert, Heavy Rains, Weather report