Home /News /andhra-pradesh /

AP POLITICS HEAD CONSTABLE RESIGNS IN SUPPORT TO CHANDRABABU NAIDU SK

Chandrababu Naidu: అంత మాట అంటారా? చంద్రబాబుకు మద్దతుగా హెడ్ కానిస్టేబుల్ రాజీనామా

చంద్రబాబు నాయుడుకు మద్దతుగా హెడ్ కానిస్టేబుల్ రాజీనామా

చంద్రబాబు నాయుడుకు మద్దతుగా హెడ్ కానిస్టేబుల్ రాజీనామా

చంద్రబాబుపై వైసీపీ నాయకుల మాటలను ఖండిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ హెడ్‌ కానిస్టేబుల్ ఓ వీడియో విడుదల చేశారు.  శుక్రవారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి.  వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తన సతీమణిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ  విమర్శించారని చంద్రబాబు నాయుడు కంటతడిపెట్టారు.  ఆ ప్రెస్ మీట్ తర్వాత ఏపీలోరాజకీయ రగడ రాజుకుంది.  ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. తాజాగా చంద్రబాబుపై వైసీపీ నాయకుల మాటలను ఖండిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ హెడ్‌ కానిస్టేబుల్ ఓ వీడియో విడుదల చేశారు.

  తను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998 బ్యాచ్‌లో సివిల్‌ కానిస్టేబుల్‌గా ప్రకాశం జిల్లా నుంచి టాపర్‌గా నిలిచానని, అప్పటి నుంచి ఇప్పటివరకు నిజాయితీ పనిచేశాని చెప్పారు. ఎప్పడూ ఎక్కడా చేయి చాచకుండా విధులు నిర్వహించాని తెలిపారు. అయితే ఏపీలో పరిస్థితులు పోలీసులకు, ప్రజలకు తెలుసునని, అసెంబ్లీలో విలువ లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబును దూషించడం సబబుకాదని ఆయన మండిపడ్డారు.  విలువలేని వారివద్ద పనిచేయలేనంటూ ఆయన ప్రజల ముందు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

  Botsa Family Politics: బొత్స కుటుంబంలో రాజకీయ చిచ్చు..? అక్కడే చెడిందా..?

  ఇక హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ఈ వివాదంపై తొలిసారి స్పందించారు. మా అక్క జోలికి ఇంకోసారి వస్తే మెడలు విరిచేస్తానంటూ వైసీపీకి బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. నందమూరి కుటుంబానికి చెందిన ఇతర సభ్యులతో బాలయ్య శనివారం తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో పరిణామాలు, అధికార వైసీపీ పోకడలపై బాలయ్య స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు.

  నిన్న అసెంబ్లీ లో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా అసెంబ్లీలో తన సతీమణి నారా భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో ఆయన.. ఆ విషయాన్ని తలుచుకుని మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. అది కూడా వెక్కి వెక్కి ఏడ్చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అన్నారు చంద్రబాబు నాయుడు.. కుప్పలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని గెలిచి.. ఇంత అవహేళన చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా ఎన్ని విమర్శలు అయినా చేయడండి పరవలేదు.. కానీ కుటుంబ సభ్యులను తిట్టడం ఏంటని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

  నారా భువనేశ్వరిపై దారుణ కామెంట్లు.. స్పీకర్ చర్యలు -చంద్రబాబుకు కౌంటర్ -లోకేశ్ పుట్టుకపై..

  చంద్రబాబు కన్నీటిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి  (CM Jagan Mohan Reddy) అసెంబ్లీ వేదికగా స్పందించారు. ఆ సమయంలో తాను సభలో లేనని, సభకు రాకముందు కలెక్టర్లతో వర్షాలపై సమీక్ష చేశానని తెలిపారు. సభకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలేంటో తెలుసుకున్నానన్నారు. తాను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు పొలిటికల్‌ అజెండానే ముఖ్యమని.. ప్రజలస సమస్యల గురించి ఆయనకు పట్టందంటూ జగన్ విమర్శించారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu naidu, Tdp

  తదుపరి వార్తలు