Prabhas Fans: పాన్ ఇండియా సూపర్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Young Rebel Star Prabhas) ఫ్యాన్స్ నిజంగా ఇది పండగ రోజే.. ఒక రోజు ముందే వారికి దీపావళి పండుగ (Diwali Festival) వచ్చేసింది. టాలీవుడ్ బాహుబలి పుట్టిన రోజు (Prabhas Birthday) అంటే.. ఆ మాత్రం క్రేజ్ లేకుంటే ఎలా అని అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు.. లేద మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చూస్తుంటే తగ్గేదే లే అనేట్టే ఉంది. ఆఖరికి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ (Ind vs Pak Match) లోనూ ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా కనిపించింది. అయితే అభిమానం ఎంతైనా ఉండొచ్చు పరవాలేదు. కానీ అభిమానుల హంగామా లైన్ క్రాస్ చేసి.. రచ్చ చేస్తే.. ఇబ్బందులు తప్పవు. చాలా సార్లు ఆ హద్దులు దాటే అభిమానంతో సంబంధం లేని వారి సైతం ఇబ్బందులు పడుతున్నారు.
తాజాగా ప్రబాస్ ఫ్యాన్స్ విషయంలోనూ అదే జరిగింది. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari)లో ప్రభాస్ అభిమానుల హంగామా ఎక్కువ ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభాస్ పేరు వింటే పూనకాలు వచ్చే వారు ఎందరో ఉన్నారు. అయితే వారి అభిమానం కాస్త హద్దు దాటింది. ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా (Billa) సినిమాను.. తాడేపల్లి గూడెం వెంకట్రామ థియేటర్లో పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ షో వేశారు.
ప్రభాస్ పై అభిమానంతో మళ్లీ బిల్లా సినిమా చూస్తూ కేరింతలు కొట్టడం.. విజిల్స్ వేయడం.. డ్యాన్స్ లు చేయడం తప్పు కాదు.. కానీ వెంకట్రామ థియేటర్లో స్పెషల్ షో చూస్తున్న అభిమానులు.. అత్యుత్సాహంతో థియేటర్లోనే బాణా సంచా కాల్చారు. దాంతో థియేటర్లో మంటలు చేలరేగాయి. కొన్ని సీట్లు కూడా పాక్షికంగా కాలిపోయాయి. దీని వల్ల థియేటర్లో పొగలు వ్యాప్తించాయి. కొందరు ప్రేక్షకులకు ఏం జరుగుతుందో తెలియక ప్రాణ భయంతో థియేటర్ నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇదీ చదవండి : ఢిల్లీకి పవన్.. డేట్ ఫిక్స్ అయ్యిందా..? రూట్ మ్యాప్ పై క్లారిటీ..! అమిత్ షా ట్వీట్
మరోవైపు ప్రభాస్ అభిమానులు.. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ సందడి చేస్తున్నారు. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ లోనూ ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ కనిపించింది. హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అంటూ.. ప్లకార్డులు పట్టుకుని అభిమానులు సందడి చేశారు. ఆ వీడియోలో ట్వీట్టర్ లో వైరల్ అవుతున్నాయి.
All the Love from MCG Stadium ❤️????#HappyBirthdayPrabhas ????????????????
Shine Forever ???????? pic.twitter.com/VaVBi6815x
— Pari (@pari4prabhas) October 23, 2022
ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అని తేడా లేకుండా.. ప్రభాస్ పుట్టిన రోజు వేడుకను అభిమానులు ఘనంగా చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రభాస్ నివాస ప్రాంతం అయిన హైదరాబాద్ లో.. భీమవరంలో ఎక్కవ సందడి కనిపించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Prabhas Latest News, Young rebel star prabhas