GVL on KTR: ఆంధ్రప్రదేశ్ లో మౌలిక వసతులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల దుమారం ఆగడం లేదు.. వివాదం సద్దుమణిగేలా ఆయన.. మరో ట్వీట్ చేసినా వివాదం మాత్రం కొనసాగుతోంది. తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
GVL on KTR: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అభివృద్ధి గురించి, మౌలిక వసతుల కల్పన గురించి తెలంగాణ (Telagnagan) మంత్రి కేటీఆర్ (Minster KTR) చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో తెలియాలంటే తెలంగాణ ప్రజలను పొరుగు రాష్ట్రానికి పంపాలని తన మిత్రుడు చెప్పాడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి. ఏపీలో కరెంట్ సరిగా లేదని, నీళ్లు కూడా లేవని, అభివృద్ధి జరగడం లేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తన మిత్రుడు చెప్పారంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ కాక రేపాయి.
కేటీఆర్ వ్యాఖ్యలను.. తెలుగు దేశం (Telugu Desam) నేతలు వైరల్ చేస్తూనే ఉన్నారు. వైసీపీ మంత్రులు (YCP MInsters)కౌంటర్లు ఇస్తున్నారు. అయితే ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేయడం ఇష్టం లేని.. మంత్రి కేటీఆర్ మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సీఎం జగన్ (CM Jagan ) ఆధ్వర్యంలో ఏపీ డవలప్ మెంట్ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. అయినా ఈ వివాదానికి మాత్రం ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదు.
తాజాగా బీజేపీకి చెందిన కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) మరోలా స్పందించారు. ఆయన ఉత్తరప్రదేశ్ ప్రస్తావనను తెరపైకి తెచ్చారు. తెలంగాణ ప్రజలను పొరుగు రాష్ట్రం ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్ పంపాలని కేటీఆర్కు సూచించారు. తెలంగాణ ప్రజలను అధ్వాన్నంగా పరిపాలిస్తున్న టీఆర్ఎస్ పాలకులు తమ రాష్ట్ర ప్రజలను ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్ కు పంపాలని జీవీఎల్ సూచించారు. అవినీతిని, అరాచకాలను డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎలా బుల్డోజింగ్ చేస్తుందో తెలంగాణ ప్రజలు చూస్తారని జీవీఎల్ అన్నారు.
మోడీ నేతృత్వంలోని బీజేపీ కోసం తెలంగాణ ఎదురుచూస్తోందని కామెంట్ చేశారు. తెలంగాణ ప్రజలను ఉత్తరప్రదేశ్ పంపే ధైర్యం ఉందా? అంటూ కేటీఆర్కు సవాల్ విసిరారు. జీవీఎల్ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణ కన్నా యూపీ మరింత మిన్న అనే సంకేతాలను ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ -టీఆర్ఎస్ మధ్య ఢీ అంటే ఢీ అనే వాతావరణం ఉంది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఈ వివాదం కేవలం తెలంగాణకే పరిమితం కావడం లేదు.. జాతీయ స్థాయిలో బీజేపీని ఢీ కొట్టే యోచనలో ఉన్నారు కేసీఆర్.. అయితే తెలంగాణలో కేసీఆర్ ను దెబ్బకొడితే.. దక్షిణాదిన అడుగు పెట్టడంతో పాటు.. జాతీయ స్థాయిలో సీట్లు పెంచుకోవచ్చనది బీజేపీ ప్లాన్.. మరి తాజాగా జీవీఎల్ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఎలాంటి కౌంటర్లు ఇస్తుందో చూడాలి..
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.