హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: కొడాలి నానిపై పోటీకి అభ్యర్థిని ఫైనల్ చేసిన టీడీపీ.. ఆయన ఒకే అంటారా..?

Kodali Nani: కొడాలి నానిపై పోటీకి అభ్యర్థిని ఫైనల్ చేసిన టీడీపీ.. ఆయన ఒకే అంటారా..?

కొడాలి నాని, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

కొడాలి నాని, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Kodali Nani: తెలుగు దేశం తప్పక నెగ్దాలి అనుకుంటున్న నియోజకవర్గాల్లో గుడివాడ ఒక్కటి.. చంద్రబాబు నాయుడు, లోకేష్ పేరు వింటే అంత ఎత్తున లేచే.. కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అందుకు సరైన అభర్థి లేక ఇబ్బంది పడుతోంది. అయితే ఈ సారి అతడికి షాక్ ఇవ్వాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారంట..? ఇంతకీ ఎవరో ఆయన తెలుసా..?

ఇంకా చదవండి ...

  Kodali Nani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపు ఓటములపై ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా ప్రధాన పార్టీలు కొన్ని నియోజకవర్గాలను టార్గెట్ చేస్తున్నారు. అక్కడ గెలవడానికి ప్రత్యేక వ్యూహాలను సైతం సిద్ధం చేస్తున్నారు. అలాంటి నియోజకవర్గాల్లో గుడివాడ (Gudiwada) ఒకటి.. అక్కడ మాజీ మంత్రి.. టీడీపీ కీలక నేతల.. అధినేత సీఎం జగన్ (CM Jagan) కు నమ్మదగిన అనుచరుడు కొడాలి నాని (Kodali Nani) .. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ వరుసగా ఆయన గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ (TDP) టఫ్ ఫైట్ ఇస్తుంది అనుకున్నా కొడాలి మందు దేవినేని అవినాశ్ (Devineni Avinash) నిలబడలేకపోయారు. భారీ మెజార్టీతో కొడాలి నాని గెలుపొందారు.. అవినాష్ వైసీపీలో చేరారు.. ఇక అప్పటి నుంచి టీడీపీ నేతల కంటికి నిద్ర లేకుండా చేస్తున్నారు కొడాలి నాని. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) , నారా లోకేష్ (Nara Lokesh) పై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడతారు.. బూతులు తిట్టడానికి కూడా వెనకాడరు.. అందుకే ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు తప్పని సరి.. అందుకే రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయంగా హాట్ సెంటర్ గుడివాడ. అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ సంచలనమే.

  వచ్చే ఎన్నికల్లో గుడివాడలో ఎలాగైనా కొడాలి నాని కి ధీటుగా బలమైన అభ్యర్ధిని నిలబెట్టి.. విజయం సాధించాలని తెలుగు దేశం నేతలు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే అక్కడ అభ్యర్థి ఎవరైతే గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.. కొడాలి నానికి నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందా ఇలా పలు అంశాలపై ఎప్పటికప్పుడు టీడీపీ సర్వేలు చేస్తూ వచ్చింది. ఆ నివేదికల తరువాత.. ప్రస్తుతం గుడివాడలో పార్టీలో అక్కడ క్రియాశీలకంగా ఉన్న నేతలు కాకుండా.. అనూహ్యంగా కొత్త అభ్యర్ధిని బరిలోకి దింపుతున్నట్టు సమాచారం.

  కొడాలినా నానిపై టీడీపీ అభ్యర్థి ఎవరు అనేదానిపై కొద్ది రోజులుగా టీడీపీలో పలు రకాలుగా చర్చలు జరిగేవి. గుడివాడలో ఓట్లు.. సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుంది. దీనికోసం తాము ఎంపిక చేసిన అభ్యర్ధితో పలు దఫాలుగా మంతనాలు జరిపింది. ఫైనల్ గా కొడాలి నాని పైన అభ్యర్ధి డిసైడ్ చేసింది. కొడాలి నాని పైన టీడీపీ అభ్యర్ధిగా వంగవీటి రాధా ను పోటికి దింపాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధినేత అయితే అభ్యర్థిని ఫైనల్ చేశారు కానీ.. దీనికి వంగవీటి రాధా తన తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన అవును అన్న తరువాతే.. అధికారికంగా తమ అభ్యర్ధిని అధినేత ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఎంపిక వెనుక టీడీపీ సర్వేలు - లెక్కలతో కసరత్తు చేసింది. గుడివాడ పరిధిలో దాదాపు 30వేల కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి. జిల్లాలో వంగవీటి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది.

  ఇదీ చదవండి : ఏపీలో మంకీపాక్స్ కలకలం.. ఐసోలేషన్ లో కుటుంబం..!

  కొడాలి నానిని ఢీ కొట్టే సరైన అభ్యర్ధి రాధా అని టీడీపీ ఫిక్స్ అయ్యింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కొడాలి నానికి 89833 ఓట్లతో 53.50% శాతం ఒట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన దేవినేని అవినాశ్ కు 70354 ఓట్లతో 41.90 శాతం ఓటింగ్ షేర్ సాధించారు. అయితే అక్కడ 30 వేలకు పైగా కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాపు వర్గ ఓట్లు ఎక్కువ శాతం కొడాలి నానికి పోల్ అయినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన వచ్చిన సమయంలో వంగవీటి రాధా అంగీకరించలేదని.. విజయవాడ తూర్పు సీటు పైన పట్టుబట్టినట్లు తెలుస్తోంది. కానీ పార్టీ పెద్దలు మాత్రం రాధాను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. గుడివాడ సీటు పార్టీకి ప్రతిష్ఠాత్మకమని.. సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది.

  ఇదీ చదవండి : బీటలు వారుతున్న టీడీపీ కంచుకోట.. ఆ ఎమ్మెల్యే తీరే కారణమా..?

  దీని పైన వంగవీటి రాధా తన తుది నిర్ణయం చెప్పాల్సి ఉంది. దీనికితోడు జనసేనతో పొత్తు ఉన్నా లేకున్నా.. ఈ సీటులో సహకారం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. పరోక్షంగా సహకారం లభించేలా మంతనాలు సాగించే అవకాశం కనిపిస్తోంది. అయితే అందుకు రాధా అంగికరిస్తారా అన్నదే అసలైన ప్రశ్న.. ఎందుకంటే రాధా ఏ పార్టీలో ఉన్నా కొడాలి నానికి మంచి స్నేహితుడు.. అందులోనూ ఆ నియోజకవర్గంలో నానికి మంచి పట్టు ఉంది. మరి రాధా రిస్క్ చేసే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది చూడాలి.. కానీ టీడీపీ లెక్కలు ప్రకారం.. రాధా అయితే అక్కడ నుంచి కచ్చితంగా గెలుస్తారని సమాచారం.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Guntur, Kodali Nani, Vangaveeti Radha