హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: జగన్ వారిద్దరి గురించి ఆలోచిస్తే.. ఈ ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం ?

YS Jagan: జగన్ వారిద్దరి గురించి ఆలోచిస్తే.. ఈ ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం ?

AP Politics: ఏపీలోని ఇద్దరు నాయకులకు మంత్రి పదవి దక్కితే.. అందుకు మరో ఇద్దరు నాయకులే కారణమని భావించాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది.

AP Politics: ఏపీలోని ఇద్దరు నాయకులకు మంత్రి పదవి దక్కితే.. అందుకు మరో ఇద్దరు నాయకులే కారణమని భావించాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది.

AP Politics: ఏపీలోని ఇద్దరు నాయకులకు మంత్రి పదవి దక్కితే.. అందుకు మరో ఇద్దరు నాయకులే కారణమని భావించాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది.

  మరికొద్ది రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేబినెట్‌లోకి కొత్తవారిని తీసుకుంటానని.. మాజీమంత్రులు పార్టీ కోసం పని చేయాలని ఆయన ఇప్పటికే నేతలకు సూచించారు. అయితే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయనే విషయమై పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమకు ఈసారి కేబినెట్‌లో చోటు దక్కుతుందని గట్టిగా నమ్ముతున్న నేతలు కొందరైతే.. సీఎం జగన్ (YS Jagan) వేసుకునే లెక్కల కారణంగా తమకు అమాత్యయోగం ఉంటుందేమో అని మరికొందరు ఆశపడుతున్నారు. అయితే సీఎం జగన్‌తో పాటు ఆయనకు సన్నిహితంగా ఉండే నాయకులు మాత్రం ఈ విషయంలో ఎక్కడా మనసులోని మాట బయటపెట్టడం లేదు. మంత్రివర్గ విస్తరణ జరగబోయే రోజే.. దీనిపై క్లారిటీ వస్తుందని.. అది కూడా ఆశావాహులకే ఈ విషయాన్ని నేరుగా ఫోన్ చేసి చెబుతారని కొందరు చర్చించుకుంటున్నారు.

  అయితే ఏపీలోని ఇద్దరు నాయకులకు మంత్రి పదవి దక్కితే.. అందుకు మరో ఇద్దరు నాయకులే కారణమని భావించాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరిలో ఒకరు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కాగా, మరొకరు మంగళగిరి (Mangalagiri) ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తమకు కూడా అవకాశం ఉంటుందని ఇతర నేతల తరహాలోనే ఈ ఇద్దరు నేతలు ఆశపడుతున్నారు. గతంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మంత్రిని చేస్తానని సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు.

  టీడీపీ యువనేత, మాజీమంత్రి నారా లోకేశ్‌తో(Nara Lokesh) పోటీపడి ఆయనను ఓడించారు ఎమ్మెల్యే ఆర్కే. దీంతో ఏపీ రాజకీయాల్లో ఆయన ఓ సంచలనంగా మారారు. ఇక గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయారు. అందులో భీమవరంలో పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్‌పై గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. ఇలా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరు చంద్రబాబు కుమారుడు, టీడీపీ యువనేత లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించడంతో.. వీరికి మంత్రి పదవులు దక్కుతాయా ? అనే చర్చ జరుగుతోంది.

  YS Jagan: ఆయనకు పోలవరం అంకితం.. అనుకున్న సమయానికి పూర్తి.. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన

  AP Politics: టీడీపీకి ఏపీ మంత్రి సవాల్.. ఇప్పటి నుంచే వైసీపీ వ్యూహం మొదలుపెట్టిందా ?

  ఇటు నారా లోకేశ్, అటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ మళ్లీ వచ్చే ఎన్నికల్లో మంగళగిరి, భీమవరం నుంచే పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిని ఎదుర్కొనేందుకు సీఎం జగన్.. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను మంత్రులను చేస్తారా ? అనే ఆసక్తి నెలకొంది. ఒకవేళ వీరిద్దరిలో ఎవరికి మంత్రి పదవులు దక్కినా.. అది పవన్ కళ్యాణ్, లోకేశ్‌లను టార్గెట్ చేసేందుకే ఇచ్చారనే చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు