AP POLITICS GRAND WELCOME TO MINSTER PINEPI VISWARUP AFTER TAKE SECOND TIME OATH FOLLOWERS HANGUMA NGS
AP Minster: మంత్రి అనుచరుల అత్యుత్సాహం చూస్తే షాక్ అవ్వాల్సిందే.. కరెన్సీ కట్టలు.. బైక్ విన్యాసాలతో హల్ చల్
హద్దు దాటిన మంత్రి అభిమానులు
AP Minster: మంత్రి అయ్యారు అంటే.. అనుచరుల ఉత్సహం.. సందడి కామన్.. అయితే ఆ అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందో చూపించారు.. డబ్బులు లేక చాలామంది ఇబ్బందులు పడితే.. రోడ్డుపై నోట్లకట్టలు చల్లారు.. నోట్ల కట్టలు వెదజల్లుతూ మంత్రికి స్వాగతం పలకడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.. ఎక్కడో తెలుసా..?
AP Minster: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM Jagan) కొత్త కేబినెట్ (New Cabinet) తాజాగా కొలువు దీరింది. అందులో 11 మంత్రులు పాతవారికే అవకాశం ఇచ్చారు. దీంతో 25 మందిలో కేవలం 11 మందికే సెకెండ్ ఛాన్స్ ఇవ్వడంతో.. వారి అభిమానులకు హద్దులు ఉండడం లేదు. తాజాగా ఓ మంత్రి అనుచరుల అభిమానం హద్దులు దాటింది. సాధారణంగా గతంలో రికార్డింగ్ డ్యాన్సుల (Recording Dance) సమయంలో అభిమానులు కరెన్సీ నోట్లు చల్లుతూ ఉండే ఘటనలు అందరూ చూసే ఉంటారు. తాజాగా ఓ మంత్రికి వెల్ కమ్ చెప్పడానికి అభిమానులు చేసిన హడావుడి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ హడావుడి అంతా కోనసీమ జిల్లాల్లోది.. కేవలం నోట్ల కట్టలు జల్లడమే కాదు.. బైక్ పై స్టంట్స్.. ఈలలు.. కేకలతో అటు పక్క జనం వెళ్లాలి అంటేనే భయపడేలా చేశారు ఆ మంత్రి అనుచరులు..
ఆయన ఎవరో కాదు.. రెండో ఛాన్స్ దక్కించుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ (Pinipe Viswarup).. ఆయను మంత్రి పదవి దక్కడంతో.. అనుచరులు కరెన్సీ నోట్లతో స్వాగతం పలికారు.. మామిడికుదురు మండల వైఎస్సార్సీపీ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొమ్ముల కొండలరావు భారీగా కరెన్సీ నోట్లు తెచ్చి రోడ్లమీద చల్లుతూ స్వాగతం పలికారు. మంత్రి విశ్వరూప్ రాక సందర్భంగా ద్విచక్రవాహనాలతో హడావిడి చేశారు వైసీపీ నాయకులు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా అమలాపురం వచ్చిన విశ్వరూప్ కు నోట్ల కట్టలు చల్లుతూ చిందులు వేశారు.
మంత్రి విశ్వరూప్ స్వగ్రామం అమలాపురం వస్తున్న నేపథ్యంలో ఘటన చోటుచేసుకుంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టి.. సొంత జిల్లాకు వచ్చిన తమ నేతకు స్వాగతం పలికే విషయంలో అభిమానులు పోటీ పడ్డారు. అయితే ఆ అభిమానం మరీ హద్దులు దాటింది. విమర్శలకు కారణమైంది. 2019లో అమలాపురం నుంచి గెలిచిన విశ్వరూప్ జగన్ తొలి కేబినెట్ లో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పని చేసారు. ఇప్పుడు జగన్ తన రెండో కేబినెట్ విస్తరణలో తిరిగి అవకాశం పొందిన 11 మంది సీనియర్లలో ఒకరు. ఈ సారి విశ్వరూప్ కు రవాణా శాఖ కేటాయించారు.
తండ్రి, తనడయుడు ఇద్దరి కేబినెట్ ల్లోనూ మంత్రిగా పని చేసిన అవకాశం కూడా దక్కించుకున్నారు. గతంలో వైఎస్సార్ కేబినెట్ లోనూ మంత్రిగా వ్యవహరించారు. వివాదాలకు దూరంగా ఉండే విశ్వరూప్.. తాజాగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే వార్తల్లో నిలిచారు. మంత్రి సొంత నియోజవకర్గానికి రాక సందర్భంగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ద్విచక్రవాహనాలతో హడావిడి చేశారు. ఓ యువకుడు మోటారు సైకిల్‌పై వినాస్యాలు చేశాడు. దానిని చూసి ఆనందాన్ని తట్టుకోలేక నగరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొమ్ముల కొండలరావు తన వద్దనున్న కరెన్సీ వెదజల్లారు.
తూర్పు గోదావరి నుంచి విశ్వరూప్.. వేణు మంత్రులుగా కొనసాగుతుండగా.. దాడిశెట్టి రాజా కొత్తగా మంత్రి పదవి దక్కించుకున్నారు. కోనసీమ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న విశ్వరూప్.. 1989 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అయితే, ఇప్పుడు ఆయన అభిమానుల తీరు పార్టీలోనూ..కామన్ పబ్లిక్ లోనూ చర్చకు కారణంగా మారుతోంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.